Authority committee meetings
-
వరదొస్తే ఇలా చేయండి
సాక్షి, పోలవరం : కేంద్ర ప్రభుత్వ నిధులతో రాష్ట్ర ప్రభుత్వం నిర్మిస్తున్న పోలవరం ప్రాజెక్టులో పరిస్థితులన్నీ తమ నియంత్రణలో ఉన్నాయని ప్రాజెక్ట్ అథారిటీ చైర్మన్ ఆర్కే జైన్ తెలిపారు. ఆయన నేతృత్వంలోని బృందం శుక్రవారం ప్రాజెక్టును పరిశీలించింది. ఈ సందర్భంగా జైన్ మాట్లాడుతూ.. వరద ఉధృతిని ఎలా ఎదుర్కోవాలనే దాన్ని ప్రత్యక్షంగా పరిశీలించేందుకు వచ్చినట్టు చెప్పారు. నిన్న జరిగిన సమావేశంలో ప్రాజెక్టులో కొన్ని మార్పులు చేశామనీ, కాఫర్ డ్యామ్ భద్రత విషయమై అధికారులతో చర్చించినట్లు తెలిపారు. గోదావరిలో నిర్మించిన కాపర్ డ్యాంలో కుడి వైపున కొన్ని పనులు జరుగుతున్నందున, వరద నీరు వస్తే నీటిని ఎడమవైపు నుంచి విడుదల చేయడం జరుగుతుందన్నారు. నదిలో ప్రస్తుతం 19 వేల క్యూసెక్కుల వరద నీరు ప్రవహిస్తుందని, దీనివల్ల ఎగువ ప్రాంతంలో ఉన్న నిర్వాసిత గ్రామాలకు ఎటువంటి ప్రమాదం లేదన్నారు. వరద ఉధృతి పెరిగి గ్రామాలు మునిగిపోయే పరిస్థితి వస్తే తక్షణ చర్యలు తీసుకోవాల్సిందిగా జిల్లా అధికారులకు ఇప్పటికే ఆదేశాలివ్వడంతో పాటు, కేంద్రం నుంచి కూడా సహాయ సహకారాలు అందించడానికి సిద్ధంగా ఉన్నామన్నారు. -
ప్రారంభమైన పీపీఏ అథారిటీ సమావేశం
సాక్షి, అమరావతి : పోలవరం ప్రాజెక్టు హెడ్ వర్క్స్ (జలాశయం)లో ఇప్పటి వరకూ చేసిన పనులను గోదావరి వరద నుంచి రక్షించడం, రాష్ట్ర ప్రభుత్వం కుదుర్చుకోవాల్సిన కొన్ని ఎంవోయూలు, పనుల పురోగతి, పెండింగ్ బిల్లుల చెల్లింపు తదితర అంశాలపై చర్చించేందుకు విజయవాడలోని ఇరిగేషన్ కార్యాలయంలో పీపీఏ (పోలవరం ప్రాజెక్టు అథారిటీ) గురువారం భేటి అయింది. ఈ సమావేశంలో రాష్ట్ర జలవనరుల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్ దాస్, ఈఎన్సీ ఎం.వెంకటేశ్వరరావు, సీఈ శ్రీధర్, సహాయ పునరావాస కమిషనర్ రేఖారాణి, ప్రాజెక్ట్ అధారిటీ సీఈవో ఆర్కె జైన్, సభ్య కార్యదర్శి పాండే తదితరులు పాల్గొన్నారు. ఈ భేటీకి ప్రత్యేత ఆహ్వానితులుగా ప్రాజెక్ట్ డిజైన్ కమిటీ చైర్మన్ పాండ్యా, కేంద్ర జల సంఘం సభ్యుడు హాల్దార్, ప్రాజెక్టుల కమిటీ కమిషనర్ ఓరా హాజరయ్యారు. పీపీఏ సమావేశం ముగిసిన తర్వాత సీఈవో ఆర్కే జైన్, సభ్య కార్యదర్శి బీపీ పాండేలు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిని కలిసి ప్రాజెక్టు పురోగతిపై నివేదిక అందజేస్తారు. -
ఇక రాజమహేంద్రవరంలోనే ‘పోలవరం’ సమావేశాలు
పోలవరం : పోలవరం ప్రాజెక్టు అధారిటీ కమిటీ సమావేశాలు ఇక ముందు రాజమహేంద్రవరంలోనే జరగాలని, అవసరమైన కార్యాలయాన్ని వెంటనే ఏర్పాటు చేయాలని ప్రాజెక్టు ఈఎన్సీ ఎం.వెంకటేశ్వరరావును జలవనరుల శాఖా మంత్రి దేవినేని ఉమా మహేశ్వరరావు ఆదేశించారు. పోలవరం ప్రాజెక్టు కాంట్రాక్టు ఏజెన్సీ అతిథి గృహంలో మంత్రి రెవెన్యూ, పోలవరం హెడ్‌వర్క్స్, కుడి, ఎడమ కాలువల ఇంజినీరింగ్ అదికారులతోను, కాంట్రాక్టు ఏజెన్సీ ప్రతినిధులతో శనివారం సమావేశం నిర్వహించారు. కుడి, ఎడమ కాలువల తవ్వకం పనులను ప్యాకేజ్‌ల వారీగా సమీక్షించారు. ప్రాజెక్టు డిజైన్లు త్వరగా రూపొందించేందుకు సీడబ్ల్యూసీ రిటైర్డ్ ఇంజీనీరింగ్ అధికారులు, నిపుణులతో టెక్నికల్ కమిటీని ఏర్పాటు చేస్తామన్నారు. గోదావరి వరద ఎంత వస్తుంది, ఇబ్బంది లేకుండా పనులు ఎలా చేయాలి? అనే దిశగా అధికారులు ఆలోచన చేయాలన్నారు. 2018 నాటికి ప్రాజెక్టు పూర్తికావాలి కుడి కాలువను ఈ ఏడాది మే నెలాఖరుకు, ఎడమ కాలువను వచ్చే ఏడాది జూన్ నాటికి పూర్తి చేయాలన్నారు. ప్రాజెక్టు నిర్మాణాన్ని 2018 నాటి కి పూర్తి చేసే విధంగా పనులు చేయాలన్నారు. ఎడ మ కాలువ నిర్మాణంలో మూడు కట్టడాలు హైవే మీద నిర్మాణం చేయాలని అధికారులు ఆయన దృష్టికి తీసుకు వచ్చారు. ఎట్టి పరిస్థితుల్లోను 58వ కి.మీ వద్ద ఏలేరు రిజర్వాయర్ వరకు కాలువ నిర్మాణం పూర్తి చేయాలని మంత్రి ఆదేశించారు. అక్కడ నుంచి కాలువ ద్వారా విశాఖకు నీరు వెళస్త్ల్ర అవకాశం ఉందన్నారు. పట్టిసీమ స్ఫూర్తితో పనులు వేగవంతం చేయాలన్నారు. ప్రారంభోత్సవానికి కేంద్ర జలవనరుల శాఖ మంత్రి ఉమా భారతిని తీసుకు వస్తామన్నారు. ఈఎన్సీ ఎం.వెంకటేశ్వరరావు మాట్లాడుతూ ప్రాజెక్టును జూన్ 2018 నాటికి పూర్తి చేసేలా పనిచేస్తామన్నారు. ఆర్అండ్ఆర్ ప్యాకేజ్ అమలు తీరును కలెక్టర్ కె.భాస్కర్ వివరించారు. నీటి పారుదల శాఖ కార్యదర్శి ఆదిత్యనాథ్ దాస్, మంత్రి పీతల సుజాత, ఎంపీ టి.సీతా రామలక్ష్మి, ఎమ్మెల్యేలు తదితరులు పాల్గొన్నారు.