ఆటో, బైక్ ఢీ: నలుగురికి తీవ్ర గాయాలు
లేపాక్షి: అనంతపురం జిల్లా లేపాక్షి మండల కేంద్రం శివారులో బుధవారం సాయంత్రం ఆటో, బైకు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో నలుగురు తీవ్రంగా గాయపడగా.. ఇద్దరికి స్వల్ప గాయాలయ్యాయి. ఆటోలో మొత్తం ఆరుగురు ప్రయాణిస్తుండగా వారిలో నలుగురు గాయపడ్డారు. బైక్పై ప్రయాణిస్తున్న ఇద్దరు స్వల్పంగా గాయపడ్డారు. క్షతగాత్రులను చికిత్స కోసం లేపాక్షి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.