Automic bomb
-
ఇంగ్లండ్‌ను వరల్డ్ మ్యాప్‌లో లేకుండా చేస్తాం: రష్యా షాకింగ్ కామెంట్స్
ఇంగ్లండ్‌ను నామరూపాల్లేకుండా చేస్తామని రష్యా ప్రధాన ప్రచారకర్త ద్మిత్రీ కిసెల్యోవ్ హెచ్చరించారు. ‘‘రష్యాపై అణు దాడి చేస్తామని ఇంగ్లండ్ ప్రధాని బోరిస్ జాన్సన్ బెదిరిస్తున్నారు. ఇంగ్లండ్‌పై మేం అణు వార్‌హెడ్‌తో కూడిన పోసిడోన్ టోర్పెడోను ప్రయోగిస్తాం. దాని దెబ్బకు రేడియో ధార్మికతతో కూడిన అలలు 1,600 అడుగుల ఎత్తున ఎగసిపడి ఇంగ్లండ్‌ను సమూలంగా, శాశ్వతంగా సముద్రగర్భంలో కలిపేస్తాయి’’ అంటూ ఒక టీవీ షోలో ఆయన బెదిరించారు. ‘‘100 మెగాటన్నుల వార్‌హెడ్ సామర్థ్యం పోసిడోన్ సొంతం. హిరోషిమాపై వేసిన అణుబాంబు కంటే కొన్ని వేల రెట్లు శక్తిమంతమైనది. దాని దెబ్బకు ఇంగ్లండ్ ప్రపంచ పటంలోనే లేకుండా పోతుంది. రాకాసి అలలతో పాటు వచ్చి పడే రేడియో ధార్మికత ఆ దేశాన్ని రేడియో ధార్మిక ఎడారిగా మార్చేస్తుంది. ఇదెలా ఉంది? లేదంటే రష్యా తాజాగా పరీక్షించిన సర్మాట్ 2 న్యూక్లియర్ మిసైల్‌ను ప్రయోగిస్తాం. ఒక్క దెబ్బకు భస్మీపటలమైపోతుంది. అంత చిన్నది మీ దేశం’’ అంటూ ఎద్దేవా చేశారు. అణు దాడులు తప్పవంటూ రష్యా ప్రభుత్వ మీడియా కొంతకాలంగా ఇంగ్లండ్‌ను హెచ్చరిస్తూ వస్తోంది. కిసెల్యోవ్ వ్యాఖ్యలు వాటికి కొనసాగింపేనంటున్నారు. ఇది కూడా చదవండి: ఉక్రెయిన్ రాజధానికి అమెరికా అధ్యక్షుడు..! -
'మా వద్ద హైడ్రోజన్ బాంబు ఉంది'
ఉత్తర కొరియా: తన వద్ద హైడ్రోజన్ బాంబు (థర్మో న్యూక్లియర్ బాంబు) ఉందని ఉత్తర కొరియా స్పష్టం చేసింది. అది అధికారికంగా రుజువైతే హైడ్రోజన్ బాంబు కలిగి ఉన్న దేశంగా ఇప్పటినుంచి ఉత్తర కొరియాను కూడా పరిగణించాల్సి ఉంటుంది. వాస్తవానికి హైడ్రోజన్ బాంబును తయారు చేసే దిశగా ఉత్తర కొరియా ముందడుగు వేస్తున్నట్లు ప్రపంచానికి ఇటీవలే తెలిసింది. అయితే, స్వయంగా ఆ బాంబును తయారుచేసుకునే పరిజ్ఞానం ఉత్తర కొరియాకు ఉందా లేదా అనే విషయం మాత్రం స్పష్టంగా తెలియదు. ఒక్క హైడ్రోజన్ బాంబు అటామిక్ బాంబులకంటే వందరెట్లు శక్తిమంతమైనది. ఉత్తర కొరియా నేత కిమ్ జాంగ్ అన్ తమ దేశంలోని విపణి తయారీ పరిశ్రమలను సందర్శించిన అనంతరం తమ వద్ద ఉన్న ఆయుధాల గురించి వివరించారు. 'మా వద్ద పరీక్షించేందుకు అటామిక్ బాంబులు, హైడ్రోజన్ బాంబులు సిద్ధంగా ఉన్నాయి. అవి మా దేశ సార్వభౌమత్వాన్ని, దేశ గౌరవాన్ని ఇనుమడింపజేస్తాయని భావిస్తున్నాం' అని ఆయన చెప్పారు.