అశ్వరావుపేటలో అగ్నిప్రమాదం
అశ్వరావుపేట(ఖమ్మం): ఆటోమొబైల్స్ దుకాణంలో అగ్నిప్రమాదం సంభవించి భారీ ఆస్తినష్టం వాటిల్లింది. ఈ సంఘటన ఖమ్మం జిల్లా అశ్వరావుపేటలో శనివారం తెల్లవారుజామున చోటుచేసుకుంది. పట్టణంలోని ఖమ్మం రోడ్డులోఉన్న హేమ ఆటోమొబైల్స్ దుకాణం నుంచి మంటలు చెలరేగడాన్ని గుర్తించిన స్థానికులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారమందించారు.
హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటలను ఆర్పివేశారు. దుకాణంలో ఇంజిన్ ఆయిల్ డబ్బాలు ఎక్కువగా ఉండటంతో.. మంటలు త్వరగా చెలరేగి ఉంటాయని స్థానికులు భావిస్తున్నారు. ఈ ప్రమాదంలో రూ. 5 లక్షలు మేర ఆస్తి నష్టం వాటిల్లినట్లు సమాచారం.