1 నుంచి నగదు రహిత చెల్లింపులు
అనంతపురం టౌన్ : నగదు రహిత చెల్లింపులు డిసెంబర్ ఒకటో తేదీ నుంచి ప్రారంభం కానున్నట్లు ఇన్చార్జ్ కలెక్టర్ లక్ష్మీకాంతం తెలిపారు. ఆలోగా ఉపాధి కూలీలు, మహిళా సంఘాల సభ్యులు, రైతులందరికీ బ్యాంక్ ఖాతాలు తెరిపించాలని అధికారులను ఆదేశించారు. శనివారం స్థానిక ట్రైనింగ్ సెంటర్లో డ్వామా అధికారులతో సమావేశం నిర్వహించారు.
ఉపాధి కూలీలందరికీ బ్యాంక్ అకౌంట్లు తప్పనిసరని, ఆధార్‌తో అనుసంధానం చేయాలని సూచించారు. అందరికీ రూపే కార్డులు అందజేయాలన్నారు. అలాగే ఒకటో తేదీలోగా మండలానికి ఒక ఓడీఎఫ్ (బహిరంగ మల విసర్జన రహిత) గ్రామాన్ని ప్రకటించాలన్నారు. కార్యక్రమంలో డ్వామా పీడీ నాగభూషణం, ఏపీడీలు, ఏపీఓలు, ఐడబ్ల్యూఎంపీ పీఓలు, జేఈలు పాల్గొన్నారు.