బ్యాంక్ మిత్రలు అందుబాటులో ఉండాలి
మోతె: గ్రామాల్లో బ్యాంక్ మిత్రలు ఖాతాదారులకు అందుబాటులో ఉండాలని మోతె ఏపీజీవీబీ ఫీల్డ్ఆఫీసర్‡ శంకర్రావు అన్నారు. మంగళవారం మండల పరిధిలోని రావిపహడ్లో జరిగిన బ్యాంక్ మిత్రల అవగాహణ సదస్సులో ఆయన ముఖ్య అధితిగా పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ బ్యాంక్ మిత్రల వద్ద ఎటువంటి కనీస మొత్తం లేకుండా సేవింగ్ ఖాతా ప్రారంభించవచ్చన్నారు. మహిళా సంఘాల నెల సరి పొదుపు లాంటివి చెల్లించవచ్చన్నారు. ఈ కార్యక్రమంలో బ్యాంక్ అకౌంటెంట్ వెంకటేశ్వరరావు, సీఎస్పీలు సుహాన్, రవి, కృష్ణయ్య, నగేష్, ఖాతాదారులు, రైతులు పాల్గొన్నారు.