రైతులకు అందుబాటులో ధరలు ఉండాలి
కోదాడ: వ్యవసాయ రంగంలో అధునిక పరికరాల వాడకం ఎక్కువగా ఉన్నపుడే రైతులు అధిక దిగుబడులు సా«ధిస్తారని కోదాడ నియోజకవర్గ టీఆర్ఎస్ ఇన్చార్జీ కె. శశిధర్‌రెడ్డి అన్నారు. యంత్రాల ధరలు రైతులకు అందుబాటులో ఉండే విధంగా చూడాలని ఆయన కోరారు. కోదాడలో వీఎంసీ జాన్‌ఢీర్ ట్రాక్టర్ షోరూంలో కొత్త సీరిస్ ట్రాక్టర్‌ను ఆయన ప్రాంభించారు. కొత్త ట్రాక్టర్ ధర తక్కువ ఉండడం వల్ల రైతులకు మేలు కలుగుతుందని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో పట్టణ ఎస్ఐ సురేష్‌కుమార్, కోదాడ డివిజన్ మేనేజర్ రామారావు, రాయపూడి వెంకటనారాయణ, వాచేపల్లి వెంకటేశ్వరరెడ్డి, లంకెల నిరంజన్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.