కావలిలో విషాదం : నృత్యకళాకారుడి ఆత్మహత్య
నెల్లూరు : నెల్లూరు జిల్లా కావలిలో విషాదం చోటుచేసుకుంది. జాతీయ నృత్యకళాకారుడు అవినాశ్ సాయి అనూహ్యంగా ఆత్మహత్య చేసుకున్నాడు. శనివారం సాయంత్రం ఉరేసుకుని తనువు చాలించాడు. దీనిపై స్థానిక టూ టౌన్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. అతని ఆత్మహత్యకు గల కారణాలతో పాటు ఘటనకు సంబంధించి పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.