అవీవా ఇండియాలో అవీవాకు మరో 23 శాతం వాటాలు
న్యూఢిల్లీ: బీమా రంగంలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల పరిమితిని పెంచిన నేపథ్యంలో అవీవా లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ ఇండియాలో అదనంగా 23 శాతం వాటాల కొనుగోలు ప్రక్రియ పూర్తయినట్లు విదేశీ భాగస్వామ్య సంస్థ అవీవా వెల్లడించింది. దీంతో వాటాలు గరిష్ట పరిమితి 49 శాతానికి చేరినట్లు సంస్థ తెలిపింది. బ్రిటన్కు చెందిన అవీవా.. దేశీ దిగ్గజం డాబర్ గ్రూప్లో భాగమైన డాబర్ ఇన్వెస్ట్ కార్ప్తో కలసి ఈ బీమా సంస్థను ఏర్పాటు చేసింది.