ముగిసిన త్యాగరాజ జయంత్యుత్సవాలు
పాలకొల్లు సెంట్రల్ : పంచారామక్షేత్రం క్షీరారామలింగేశ్వరస్వామివారి ఆలయ ప్రాంగణంలో 4 రోజులుగా నిర్వహించిన 41వ వార్షిక త్యాగరాజ జయంత్యుత్సవాలు ఆదివారంతో ముగిశాయి. త్యాగరాజ కీర్తనల ఆలాపన, భక్తి, సంగీత పోటీలు నిర్వహించినట్టు గానసభ ప్రధాన కార్యదర్శి ద్వీపాల దక్షిణామూర్తి తెలిపారు. అలాగే చిన్నారుల కూచిపూడి నృత్య ప్రదర్శన ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. తబలా సీనియర్స్ విభాగంలో ఎమ్.స్టీఫెన్, వరద శేషకుమార్, కె.సుమంత్, తబలా జూనియర్స్ విభాగంలో కె.బ్లెసన్, మద్దాల థామస్, వై.ఇందువర్థన్, అన్నమాచార్య కీర్తనల ఆలాపన సీనియర్స్ విభాగంలో జ్యోత్సS్న శ్రీప్రియ, ఎస్.వెంకటరత్నం, డి.రేవతి, జూనియర్స్ విభాగంలో యశశ్విని, వైడీ మహాలక్ష్మి, సమ్మత, శాస్త్రీయ సంగీత విభాగంలో టి.విష్ణు వర్థన శర్మ, ఎం.హేమర్షిణి, వైడీ మహాలక్ష్మి, పాడుతా తీయగా ఘంటశాల పాటల పోటీల్లో సీనియర్స్ విభాగంలో వీఎస్ఎన్ మూర్తి, ఎస్.వెంకటరత్నం, డి.దామోదర సాయి మణికంఠ, జూనియర్స్ విభాగంలో టి.కృష్ణ మృణాళిని దేవి, జి.జాహ్నవి, జి.శ్రీవైష్ణవి దేవి ప్రథమ, ద్వితీయ, తృతీయ స్థానాలు గెలుచుకున్నారు. విజేతలకు ఆలయ చైర్మన్ రెడ్డి నర్సింహమూర్తి, విన్నకోట వెంకటేశ్వరరావు, కొల్లు నర్సింహమూర్తి బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో గానసభ అధ్యక్షుడు ఈరంకి రామకృష్ణ, సంయుక్త కార్యదర్శి ఎంఎన్వీ సాంబశివరావు, సహాయ కార్యదర్శి వడ్లమూడి హరికృష్ణ, కోశాధికారి రేపాక శ్రీనివాసు పాల్గొన్నారు.