Award wapsi
-
అవార్డ్ తిరిగి ఇచ్చేసిన రచయిత్రి.. బీజేపీ, టీఎంసీ మాటల యుద్ధం
కోల్‌కతా: పశ్చిమ బెంగాల్లో ‘అవార్డ్ వాపసీ’ బీజేపీ, తృణమూల్ కాంగ్రెస్ పార్టీల మధ్య మాటల యుద్ధానికి దారి తీసింది. టీఎంసీ ఏలుబడిలో స్వోత్కర్ష ఎక్కువైందని బీజేపీ విమర్శించగా.. కమలనాథులు తమకు నీతులు చెప్పాల్సిన అవసరం లేదని అధికార పార్టీ నాయకులు కౌంటర్ ఇచ్చారు. అసలేం జరిగింది? బెంగాల్‌కు చెందిన రచయిత్రి, జానపద సంస్కృతి పరిశోధకురాలు రత్న రషీద్ బెనర్జీ.. పశ్చిమబంగ బంగ్లా అకాడమీ 2019లో తనకు ప్రదానం చేసిన ప్రతిష్టాత్మక ‘అన్నదా శంకర్ స్మారక్ సమ్మాన్’ పురస్కారాన్ని తిరిగి ఇచ్చేశారు. ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి సాహిత్య విభాగంలో అవార్డు ప్రదానం చేయడంతో ఆమె ఈ విధంగా తన నిరసన తెలియజేశారు. రవీంద్రనాథ్ ఠాగూర్ జయంతి సందర్భంగా.. సోమవారం ప్రభుత్వ సమాచార, సాంస్కృతిక శాఖ ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మమతకు సాహిత్య పురస్కారం ప్రదానం చేశారు. ఆమె రాసిన 'కబితా బితాన్' పుస్తకానికి గాను సాహిత్య అకాడమీ ఈ సంవత్సరం కొత్తగా ప్రవేశపెట్టిన అవార్డును ముఖ్యమంత్రికి అందజేశారు. దీనిపై రషీద్ బెనర్జీ స్పందిస్తూ.. మమతా బెనర్జీ రాసిన పుస్తకంలో సాహిత్యమే లేదని, ఆమెకు అవార్డు ఇవ్వడాన్ని వ్యతిరేకిస్తూ తన పురస్కారాన్ని వెనక్కి ఇచ్చేస్తున్నట్టు ప్రకటించారు. అవమానంగా భావిస్తున్నా ‘సీఎంకు సాహిత్య పురస్కారం ఇవ్వడం నన్ను అవమానించినట్లు భావిస్తున్నాను. ఆ నిర్ణయానికి ఇది నా నిరసన. నేను దానిని అంగీకరించలేను. ముఖ్యమంత్రి గారి ‘కబితా బితాన్’ పుస్తకాన్ని నేను సాహిత్యంగా అస్సలు పరిగణించను. ఆమె మన ముఖ్యమంత్రి. మేము ఆమెకు ఓటు వేశాం. నేను వృద్ధురాలిని. నాకు కలం భాష మాత్రమే తెలుసు. నాకు ఏ రాజకీయ పార్టీతో సంబంధం లేదు. ఆమె మాకు అందనంత ఉన్నత పదవిలో ఉన్నారని తెలుసు. ఇలాంటి ఉదంతాలు ప్రతికూల సంకేతాలు పంపే అవకాశముంద’ని రషీద్ బెనర్జీ పేర్కొన్నారు. అధినాయకురాలి దృష్టిలో పడేందుకే.. మమతా బెనర్జీని ప్రసన్నం చేసుకోవడానికే తృణమూల్ నేతలు ఆమె అవార్డు ఇచ్చారని బీజేపీ సీనియర్ బిజెపి నాయకుడు శిశిర్ బజోరియా ‘ఇండియా టుడే’తో చెప్పారు. రాజకీయ నాయకురాలైన మమతా బెనర్జీకి సాహిత్య అవార్డుతో కవులు, రచయితలు అసంతృప్తికి గురయ్యారని అన్నారు. ఇందులో భాగంగానే రషీద్ బెనర్జీ తన సాహిత్య పురస్కారాన్ని వెనక్కి ఇచ్చేశారని తెలిపారు. తమ అధినాయకురాలి దృష్టిలో పడేందుకు తృణమూల్ కాంగ్రెస్ నేతల మధ్య అంతర్గత పోటీ నడుస్తోందని ఎద్దేవా చేశారు. (క్లిక్: కేజ్రీవాల్ కిడ్నాప్ చేసేందుకు యత్నించారు) బీజేపీ నీతులు చెప్పడమా? అవార్డ్ వాపసీ అంశాన్ని తగ్గించి చూపించేందుకు తృణమూల్ కాంగ్రెస్ నాయకులు బీజేపీపై ఎదురుదాడికి దిగారు. సాహిత్యం, సంస్కృతి గురించి బీజేపీ నుంచి తాము పాఠాలు నేర్చుకోవాల్సిన అవసరం లేదని టీఎంసీ ఎంపీ సౌగతా రాయ్ అన్నారు. సంఘ సంస్కర్త ఈశ్వర్ చంద్ర విద్యాసాగర్ విగ్రహాన్ని ధ్వంసం చేసిన బీజేపీ తమకు నీతులు చెప్పే అర్హత లేదని వ్యాఖ్యానించారు. (క్లిక్: దేశానికి తదుపరి ప్రధాని అమిత్ షా..?) -
'అవార్డు వాపసీ ఓ ఫ్యాషన్ అయింది'
పుణె: అవార్డులు తిరిగి వెనుకకు ఇచ్చేయడం ఓ ఫ్యాషన్‌గా మారిపోయిందని ప్రముఖ భారతీయ ఆంగ్ల రచయిత చేతన్ భగత్ అన్నారు. సోమవారం పుణెలోని పింప్రి వద్ద జరిగిన 89వ ఆల్ ఇండియా మరాఠీ సాహితీ సంగోష్టి కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. 'రచయితల్లో భిన్నరకాల వారున్నారు. వారిలో కొందరు అవార్డులను గెలుచుకునేందుకు ప్రయత్నించేవారైతే.. ఇంకొందరు అవార్డులను వెనుకకు ఇచ్చేవారు. నేను నాకోసం రచనలు చేస్తుంటాను. అవార్డు వాపసీ(అవార్డులు వెనుకకు ఇచ్చేయడం) పెద్ద ఫ్యాషన్ గా మారిపోయింది. ఈ విషయం చాలాకాలంగా ఆందోళన కలిగిస్తున్నది. అయితే, నేను ఇటీవల ఎలాంటి అవార్డులను తీసుకోలేదు. అందుకే వెనక్కి తిరిగి ఇచ్చేయడమనే ప్రశ్నకు అవకాశమే లేదు' అని చేతన్ అన్నారు. రచయితలు వారి రచనల ద్వారా పాఠకుల ప్రేమను, అనుబంధాన్ని గెలుచుకుంటారని, అలాంటి వాటిని తిరిగి వెనక్కు ఇచ్చేసినట్లవుతుందని తెలిపారు. -
అవార్డు వాపసీపై రాష్ట్రపతి వ్యాఖ్యలు
న్యూఢిల్లీ: దేశంలో పరమత అసహనం పెరిగిపోయిందంటూ పలువురు రచయితలు, సినీ ప్రముఖులు తమ అవార్డులను వాపస్ ఇవ్వడంపై రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ స్పందించారు. ప్రతిభకు గుర్తింపుగా అవార్డులు లభిస్తాయని, వాటితో గౌరవంగా స్వీకరించాలని ప్రణబ్ పేర్కొన్నారు. నేషనల్ ప్రెస్ డే సందర్భంగా సోమవారం నిర్వహించిన సదస్సులో ఆయన ప్రసంగిస్తూ.. 'కొన్నిసార్లు సున్నిత మనస్కులు సమాజంలోని కొన్ని ఘటనలు చూసి ఆందోళనకు గురవుతారు. అయినప్పటికీ భావోద్వేగాలు హేతుబద్ధతను అధిగమించరాదు' అని పేర్కొన్నారు. అసహనం, అవార్డు వాపసీ వివాదాలపై పరోక్షంగా పేర్కొంటూ 'అసమ్మతిని చర్చలు, అభిప్రాయాల ద్వారా వ్యక్తం చేయాలి' అని సూచించారు. సమయం వచ్చినప్పుడల్లా ఆత్మపరిశోధన చేసుకొని తన తప్పులను తాను సరిదిద్దుకోవడంలో భారత్ ఎప్పుడూ ముందుంటుందని ప్రణబ్ అన్నారు. '21వ శతాబ్దంలో శక్తిమంతమైన, వైభవోజ్వలమైన భారత్ కోసం స్వేచ్ఛాయుతమైన పత్రికా వ్యవస్థ అత్యంత కీలకమని పేర్కొన్నరు. ప్రజాప్రయోజనాలు రక్షించడంలో, అట్టడుగు వర్గాలకు అండగా నిలువడంలో మీడియా కీలక పాత్ర పోషించాలని సూచించారు. -
గాంధీజీ తన బారిస్టర్ పట్టా తిరిగిచ్చారా?
దేశంలో ప్రస్తుతం హాట్ టాపిక్‌గా ఉన్న 'అసహనం'పై విశ్వనాయకుడు కమల్‌హాసన్ తన పుట్టిన రోజు నాడు విభిన్నంగా స్పందించారు. మన చుట్టూ ఉన్న వివిధ మతాలకు చెందిన ప్రార్థనలు, ఉపదేశాలను వినడమే సహనం అవుతుందని ఆయన అన్నారు. మనుషుల మీద లేని ప్రేమను జంతువుల మీద చూపించడం వల్ల ఎలాంటి ఉపయోగం ఉండబోదని చెప్పారు. అయితే.. అదే సమయంలో అవార్డులు తిరిగి ఇవ్వడంపై మాత్రం ఆయన ఒకింత ఘాటుగానే స్పందించారు. అసలు తాను తనకొచ్చిన అవార్డులను ఎందుకు తిరిగివ్వాలని కమల్ ప్రశ్నించారు. బ్రిటిష్ వాళ్ల మీద పోరాడే సమయంలో గాంధీజీ తన బారిస్టర్ పట్టాను తిరిగిచ్చారా అని సూటిగా అడిగారు. పైగా తనకు అవార్డులను ఆయా జ్యూరీలు ఇచ్చాయి తప్ప ప్రభుత్వం కాదని, అలాంటప్పుడు ప్రభుత్వం మీద కోపంతో అవార్డులు వెనక్కి ఇవ్వడం ఎందుకని ఆయన అన్నారు. -
అవార్డు వాపసీపై బీజేపీ కౌంటర్ బుక్!
న్యూఢిల్లీ: దేశంలో అసహనం పెరిగిపోతున్నదంటూ జాతీయ పురస్కారాలు వెనుకకు ఇచ్చేస్తున్న సినీ కళాకారులు, రచయితల సంఖ్య నానాటికీ పెరిగిపోతున్నది. దేశంలోని పరమత అసహనానికి నిరసనగా గురువారం 24మంది సినీ ప్రముఖులు, రచయితలు తమ అవార్డులు వాపస్ ఇచ్చారు. అవార్డులు వెనుకకు ఇచ్చేసిన వారిలో సయిద్ మిర్జా, కుందన్ షా, అరుంధతి రాయ్, విక్రాంత్ పవర్ వంటి ప్రముఖులు ఉన్నారు. మరోవైపు అవార్డులు వెనుకకు ఇచ్చేస్తున్న వారికి బీజేపీ కూడా దీటుగానే సమాధానం ఇచ్చే ప్రయత్నం చేస్తున్నది. అవార్డు వాపసీ ధోరణిని తప్పుబడుతూ 'నో యువర్ ట్రస్ట్' (మీ విశ్వాసాన్ని తెలుసుకోండి) పేరిట ఆ పార్టీ ఓ పుస్తకాన్ని విడుదల చేసింది. ఢిల్లీలోని బీజేపీ కేంద్ర కార్యాలయంలో ఆ పార్టీ అధ్యక్షుడు అమిత్ షా ఈ పుస్తకాన్ని విడుదల చేశారు. ఈ సందర్భంగా కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు మాట్లాడుతూ.. మోదీ ప్రభుత్వ అభివృద్ధి అజెండాను పట్టాలు తప్పించేందుకే ఈ విధంగా కల్పితమైన నిరసనను సృష్టించారని మండిపడ్డారు. భావస్వేచ్ఛను హరించిన కాంగ్రెస్ పార్టీ గడిచిన 60 ఏళ్లలో తాను ఏ తప్పు చేయనట్టు నీతులు చెప్తున్నదని విమర్శించారు.