గాంధీజీ తన బారిస్టర్ పట్టా తిరిగిచ్చారా?
దేశంలో ప్రస్తుతం హాట్ టాపిక్‌గా ఉన్న 'అసహనం'పై విశ్వనాయకుడు కమల్‌హాసన్ తన పుట్టిన రోజు నాడు విభిన్నంగా స్పందించారు. మన చుట్టూ ఉన్న వివిధ మతాలకు చెందిన ప్రార్థనలు, ఉపదేశాలను వినడమే సహనం అవుతుందని ఆయన అన్నారు. మనుషుల మీద లేని ప్రేమను జంతువుల మీద చూపించడం వల్ల ఎలాంటి ఉపయోగం ఉండబోదని చెప్పారు.
అయితే.. అదే సమయంలో అవార్డులు తిరిగి ఇవ్వడంపై మాత్రం ఆయన ఒకింత ఘాటుగానే స్పందించారు. అసలు తాను తనకొచ్చిన అవార్డులను ఎందుకు తిరిగివ్వాలని కమల్ ప్రశ్నించారు. బ్రిటిష్ వాళ్ల మీద పోరాడే సమయంలో గాంధీజీ తన బారిస్టర్ పట్టాను తిరిగిచ్చారా అని సూటిగా అడిగారు. పైగా తనకు అవార్డులను ఆయా జ్యూరీలు ఇచ్చాయి తప్ప ప్రభుత్వం కాదని, అలాంటప్పుడు ప్రభుత్వం మీద కోపంతో అవార్డులు వెనక్కి ఇవ్వడం ఎందుకని ఆయన అన్నారు.