awareness convention
-
భారతీ సిమెంట్స్‌పై తాపీ మేస్త్రీలకు అవగాహన సదస్సు
-
ప్రతీ రైతుకు రూ.5 లక్షల బీమా
సాక్షి, జెడ్పీసెంటర్(మహబూబ్‌నగర్) : జిల్లాలోని రైతులందరికీ రూ.5 లక్షల జీవిత బీమా సౌకర్యం కల్పించనున్నట్లు కలెక్టర్ రొనాల్డ్‌రోస్ తెలిపారు. స్థానిక జెడ్పీ హాల్లో మహబూబ్‌నగర్, జోగులాంబ గద్వాల జిల్లాలకు చెందిన ఏఓలు, ఏఈఓలకు రైతు బీమా పథకంపై మంగళవారం అవగాహన సదస్సు ఏర్పాటుచేశారు. ఈ సదస్సులో కలెక్టర్ మాట్లాడుతూ రైతులకు ఏదైని కారణంలో మరణిస్తే వారి కుటుంబాలకు ఉపశమనం కోసం బీమా పథకాన్ని ప్రభుత్వం ప్రవేశపెట్టిందన్నారు. ఈ పథకం ఈ ఏడాది ఆగస్టు 15వ తేదీ నుంచి వచ్చే ఏడాది ఆగస్టు 14వ తేదీ వర్తిస్తుందన్నారు. ఈ పథకం అమలులో వ్యవసాయ అధికారులు కీలకపాత్ర పోషించాలన్నారు. ఆధార్ కార్డుల్లో పుట్టిన తేదీ లేకుంటే జూలై 1వ తేదీగా నమోదు చేయాలన్నారు. రైతు కుటుంబ సభ్యుల పేర్లు, నామినీ పేర్లు నమోదు చేయాలన్నారు. నామినేషన్ వివరాలతో పాటు అర్హులైన రైతుల వివరాలు ఏఈఓలు నామినేషన్ ఫారంలో సేకరించాల్సి ఉంటుందన్నారు. డీఏఓ, ఏడీఏ, ఏఓల పర్యవేక్షణలో ఏఈఓ రైతుల వివరాలు సేకరించాలన్నారు. సమావేశంలో డీఏఓలు సుచరిత, గోవింద్‌నాయక్ పాల్గొన్నారు. -
సెప్టెంబర్ 30లోపు ఆదాయ పన్ను చెల్లించాలి
గ్రీన్, క్లాత్, గోల్డ్ మర్చంట్ వర్తకులకు అవగాహన సదస్సు వికారాబాద్ రూరల్: సెప్టెంబర్ 30వ తేదీలోపు ఆదాయపు పన్ను చెల్లించని వారు చెల్లించి, ఆదాయ వెల్లడి పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని వికారాబాద్ సర్కిల్ ఆదాయపు పన్ను అధికారి వి.కల్యాణ్‌కుమార్, ఇన్స్పెక్టర్ పి.శ్రీనివాస్ సూచించారు. స్థానిక మార్కెట్ కమిటీ కార్యాలయ సమావేశం మందిరంలో శుక్రవారం ఆదాయపు పన్ను వికారాబాద్ సర్కిల్ ఆధ్వర్యంలో పట్టణంలోని గ్రీన్, క్లాత్, గోల్డ్ మర్చంట్ సభ్యులకు ఈ పథకంపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా వారూ మాట్లాడుతూ.. 2015-16 లేదా అంతకుముందు సంవత్సరాల్లో ఆస్తులుగానీ ఇతర రూపేణా ఆదాయం వెల్లడించని వారికి ఈ పథకం వర్తిస్తుందన్నారు. ఆస్తి రూపంలో వెల్లడించే పక్షంలో 2016 జూన్ ఒకటో తేదీనాటికి ఆస్తి ఫెయిర్ మార్కెట్ విలువను ఆదాయంగా పరిగణిస్తారన్నారు. డిక్లరేషన్లు ఆన్‌లైన్‌లోగానీ, ప్రింట్ ఫారంలో సంబంధిత ప్రిన్సిపల్ కమిషనర్ వద్ద దాఖలు చేసుకోవచ్చన్నారు. 2016 జూన్ ఒకటో తేదీ నుంచి 2016 సెప్టెంబర్ 30 వ తేదీ వరకు ఈ పథకం అమలులో ఉంటుందన్నారు. పన్ను, సర్‌చార్జి పెనాల్టీ మొత్తం కలిపి వెల్లడి చేసిన ఆదాయంలో 45% చెల్లించాలన్నారు. అందుకు ఆఖరి తేదీ 2016 నవంబర్ 30 వరకు ఉంటుందన్నారు. ఈ పధకంలో వెల్లడి చేసిన ఆస్తులపై తదుపరి విచారణ ఉండదన్నారు. వివరాలు పూర్తిగా గోప్యంగా ఉంచుతామని, ఈ పథకాన్ని వినియోగించుకుని టాక్స్ ఉల్లంఘన నుంచి బయట పడాలని వారు పిలుపునిచ్చారు. కార్యక్రమంలో సూపరిటెండెంట్ పురుషోత్తంరావు, గ్రీన్, క్లాత్, గోల్డ్ మర్చంట్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. -
నేడు సాక్షి ఆధ్వర్యంలో గేట్‌పై అవగాహన సదస్సు
కర్నూలు(విద్య), న్యూస్‌లైన్: ఇంజనీరింగ్ విద్యార్థులకు సాక్షి ఆధ్వర్యంలో శనివారం గేట్ పరీక్షపై అవగాహన సదస్సు నిర్వహించనున్నారు. ట్రూంఫెంట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ ఎడ్యుకేషన్ ప్రైవేటు లిమిటెడ్(టైమ్) వారు అందుకు సహకారం అందిస్తున్నారు. కర్నూలు నగరంలోని కలెక్టరేట్లో ఉన్న సునయన ఆడిటోరియంలో మధ్యాహ్నం 1.30 నుండి 3.30 గంటల వరకు సదస్సు కొనసాగనుంది. గేట్ స్కోర్ ఆధారంగా ప్రభుత్వ రంగ సంస్థల్లో నియామకాలు, తదితర అవకాశాలను టైమ్ గేట్ కోర్సు డెరైక్టర్, బిట్స్‌పిలాని, ఐఐఎం కలకత్తాకు చెందిన పృథ్వీరెడ్డి వివరిస్తారు. ఆసక్తి గల ఇంజనీరింగ్ విద్యార్థులు ఇతర వివరాలకు 72077 02848, 99853 96911 నంబర్లను సంప్రదించాలని సూచించారు.