కర్నూలు(విద్య), న్యూస్‌లైన్: ఇంజనీరింగ్ విద్యార్థులకు సాక్షి ఆధ్వర్యంలో శనివారం గేట్ పరీక్షపై అవగాహన సదస్సు నిర్వహించనున్నారు. ట్రూంఫెంట్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్ ఎడ్యుకేషన్ ప్రైవేటు లిమిటెడ్(టైమ్) వారు అందుకు సహకారం అందిస్తున్నారు. కర్నూలు నగరంలోని కలెక్టరేట్‌లో ఉన్న సునయన ఆడిటోరియంలో మధ్యాహ్నం 1.30 నుండి 3.30 గంటల వరకు సదస్సు కొనసాగనుంది.
గేట్ స్కోర్ ఆధారంగా ప్రభుత్వ రంగ సంస్థల్లో నియామకాలు, తదితర అవకాశాలను టైమ్ గేట్ కోర్సు డెరైక్టర్, బిట్స్‌పిలాని, ఐఐఎం కలకత్తాకు చెందిన పృథ్వీరెడ్డి వివరిస్తారు. ఆసక్తి గల ఇంజనీరింగ్ విద్యార్థులు ఇతర వివరాలకు 72077 02848, 99853 96911 నంబర్లను సంప్రదించాలని సూచించారు.
నేడు సాక్షి ఆధ్వర్యంలో గేట్‌పై అవగాహన సదస్సు
Published Sat, Jan 25 2014 12:53 AM | Last Updated on Sat, Sep 2 2017 2:57 AM
Advertisement
Advertisement