ముగ్గురిపై గొడ్డలితో దాడి చేసిన సైకో
ఒంగోలు(ప్రకాశం): ప్రకాశం జిల్లాలోని కంభం మండలం ఎర్రబాలెంలో ఓ సైకో వీరంగం సృష్టించాడు. ముగ్గురిపై విచక్షణ రహితంగా గొడ్డలితో దాడి చేశాడు. ఈ ఘటన గురువారం చోటుచేసుకుంది. ఈ దాడిలో ముగ్గురు వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారు. దాంతో వారిని చికిత్స నిమిత్తం స్థానిక ఆస్పత్రికి తరలించినట్టు సమాచారం. సైకో దాడితో గ్రామస్తులు భయటకు రావాలంటేనే భయంతో వణికిపోతున్నారు. సైకో బారినుంచి తమను రక్షించాలంటూ వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
వారి ఫిర్యాదు మేరకు రంగంలోకి దిగిన పోలీసులు అందరినీ జాగ్రత్తగా ఉండాలంటూ సూచించారు. సైకో ఉనికి ఏమాత్రం తెలిసినా తమకు సమాచారం అందించాలని సూచించారు. కాగా, సైకో కోసం గాలిస్తున్నామని సైకోను త్వరలో పట్టుకుంటామని పోలీసులు తెలిపారు. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.