ఎయిర్ పోర్ట్‌లో అరకిలో బంగారం పట్టివేత
మలేషియా ఎయిర్‌లైన్స్ విమానంలో బంగారాన్ని అక్రమంగా నగరానికి తీసుకువచ్చిన చెన్నైకు చెందిన అజ్మత్‌ఖాన్ అనే ప్రయాణికుడిని కస్టమ్స్ అధికారులు గురువారం శంషాబాద్ ఎయిర్ పోర్ట్‌లో అదుపులోకి తీసుకున్నారు. అతని వద్ద నుంచి అరకిలో బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు.
శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో దిగిన అజ్మత్ ఖాన్‌ను కస్టమ్స్ అధికారులు తనిఖీ నిర్వహించారు. ఆ క్రమంలో అతడి లో దుస్తులలో దాచి ఉంచిన 5 బంగారు బిస్కెట్లను కనుగొని, వాటిని స్వాధీనం చేసుకున్నారు. అనంతరం అనంతరం వారిని ఎయిర్‌పోర్ట్‌లోని కస్టమ్స్ కార్యాలయానికి తరలించి విచారిస్తున్నారు.