baahubali 2 first look
-
సంకెళ్లు తెంచుకున్న మహేంద్ర బాహుబలి
-
సంకెళ్లు తెంచుకున్న మహేంద్ర బాహుబలి
హైదరాబాద్ : దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి బాహుబలి మొదటి భాగం షూటింగ్ మొదలుపెట్టినప్పటి నుంచి కూడా ఈ సినిమా మీద బోలెడంత హైప్ క్రియేట్ అయ్యింది. అనుకున్నదాని కంటే కూడా భారీ స్థాయిల్ హిట్ అయిన ఈ సినిమా తెలుగు సినిమా రికార్డులన్నింటినీ తుడిచిపెట్టేసింది. అప్పటినుంచి నాన్ బాహుబలి రికార్డులు అనే మాట కూడా కొత్తగా మొదలైంది. ఇప్పుడు బాహుబలి-2 ద కన్‌క్లూజన్ సినిమా మీద కూడా అంచనాలు భారీగా ఉన్నాయి. కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడు, మహేంద్ర బాహుబలి ఎలా ఉంటాడు, ఏం చేస్తాడన్న ప్రశ్నలు సామాన్య ప్రేక్షకుల నుంచి సినిమా విశ్లేషకుల వరకు అందరికీ వస్తున్నాయి. షూటింగ్ దాదాపుగా పూర్తికావచ్చిన తరుణంలో ప్రభాస్ పుట్టినరోజు బహుమతిగా బాహుబలి 2 ఫస్ట్‌లుక్‌ను గ్రాండ్‌గా ఏర్పాటుచేసిన ఒక ఈవెంట్లో విడుదల చేశారు. సంకెళ్లు తెంచుకుంటూ సిక్స్‌ప్యాక్ బాడీతో, మెడలో గంటతో రఫ్ లుక్‌లో కనిపించిన ప్రభాస్ పోస్టర్‌ను ఈ సందర్భంగా చిత్ర యూనిట్ విడుదల చేసింది. దర్శకుడు రాజమౌళి, హీరో ప్రభాస్, హీరోయిన్లు అనుష్క, తమన్నా, నిర్మాతలు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. -
నేను కూడా ఆగలేకపోతున్నా: రాజమౌళి
బాహుబలి -2 ఫస్ట్‌లుక్ విడుదల చేయడానికి తాను కూడా ఆగలేకపోతున్నానని దర్శక ధీరుడు ఎస్ఎస్ రాజమౌళి ట్విట్టర్లో తెలిపారు. చిన్న చిన్న అడ్డంకులు ఉన్నాయని, అవి క్లియర్ అయిపోగానే మీ అందరి కోసం అతి త్వరలోనే అది వచ్చేస్తుందని చెప్పారు. ఎవరూ అడ్డుకోలేని తన శక్తితో మాహిష్మతి రాజ్యాన్ని ఎలా గెలుచుకుంటాడో అన్నదే బాహుబలి-2 ద కన్‌క్లూజన్ కథ అని వివరించారు. వాస్తవానికి బాహుబలి-2 ఫస్ట్‌లుక్‌ను సాయంత్రం 4.45 నిమిషాలకు విడుదల చేస్తామని ప్రకటించారు. కానీ అనుకున్నదాని కంటే కార్యక్రమం కొంత ఆలస్యమైంది. బాహుబలి సినిమా సెట్స్‌లో చాలా గ్రాండ్‌గా ఏర్పాటుచేసిన ఈ కార్యక్రమానికి దర్శకుడు రాజమౌళి, హీరో ప్రభాస్, హీరోయిన్లు అనుష్క, తమన్నాలతో పాటు నిర్మాతలలో ఒకరైన శోభు యార్లగడ్డ తన కుటుంబంతో సహా వచ్చారు. పలువురు సాంకేతిక సిబ్బంది సైతం ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. I myself cant wait to tweet the first look. Just waiting for the decks to be cleared and it'll be out there for you guys very soon! — rajamouli ss (@ssrajamouli) 22 October 2016 And how he wins the Mahishmati Kingdom with his Unrestrained Power is #Baahubali2 The Conclusion. — rajamouli ss (@ssrajamouli) 22 October 2016