bachehalli
-
చిరుత దాడిలో లేగదూడ మృతి
బచ్చేహళ్లి (శెట్టూరు): చిరుత దాడిలో లేగ దూడ మృతి చెందిన ఘటన శెట్టూరు మండలంలో సంచలనం రేకెత్తించింది. వారం రోజుల్లో పశుసంపదపై చిరుత దాడి చేయడం ఇది రెండోసారి. వివరాల్లోకి వెళితే.. శెట్టూరు మండలంలోని బచ్చేహళ్లి గ్రామానికి చెందిన గొల్ల చిత్తక్క పాడిపోషణతో జీవనోపాధి పొందుతున్నారు. బుధవారం రాత్రి తన పశువుల పాకలో చొరబడిన చిరుతపులి ఓ లేగదూడను గ్రామ శివారులోకి లాక్కెళ్లి తినేసింది. సమాచారం అందుకున్న అటవీశాఖ అధికారులు రామచంద్రనాయక్, జగన్నాథ్.. ఘటన స్థలాన్ని పరిశీలించారు. చిరుత దాడిలో రూ. 4వేలు నష్టపోయినట్లు ఈ సందర్భంగా వారి ఎదుట బాధిత చిత్తక్క వాపోయారు. చిరుతను బంధించాలని గ్రామస్తులు వేడుకున్నారు. -
కనుల పండువగా వీరబ్రహ్మేంద్రస్వామి రథోత్సవం
శెట్టూరు : మండలంలోని బచ్చేహళ్లి గ్రామంలో గురువారం వీరబ్రహ్మేంద్రస్వామి రథోత్సవం కనులపండువగా జరిగింది. ఉత్సవాల్లో భాగంగా ఉదయం గణపతిపూజ, అభిషేకం, మధ్యాహ్నం 12 గంటలకు హోమం, ఒంటి గంటకు మడుగుతేరు నిర్వహించారు. సాయంత్రం 3 నుంచి 4 గంటల వరకు గ్రామదేవతల పూజ, గంగపూజ చేపట్టారు. అనంతరం 108 పూర్ణకుంభాలతో రథోత్సవం నిర్వహించారు. ఈసందర్భంగా భక్తులు స్వామివారికి పండ్లు సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. రాత్రికి గ్రామ పెద్దల సహకారంతో సాంఘిక నాటిక ప్రదర్శించారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఎస్ఐ శ్రీకాంత్ యాదవ్ ఆధ్వర్యంలో బందోబస్తు నిర్వహించారు.