అధినేత్రి వచ్చింది... పొలం మాయమైంది
మాజీ ముఖ్యమంత్రి, పార్టీ అధ్యక్షురాలు వస్తున్నారు. అది హెలికాప్టర్లో... దిగడానికి అనువైన స్థలం లేదు . ఏం చేయాలి. కార్యకర్తలు బుర్రలు చించుకున్నారు. అంతే బంగారంలాంటి పొలాన్ని హెలిపాడ్ కోసం ఏర్పాటు చేయాలన్న ఆలోచనల కార్యకర్తల బుర్రలో చటుకున్న మెరుపులా మెరిసింది. అంతే అనుకున్నదే తడువుగా పొలాన్ని పార్టీ కార్యకర్తలు క్షణాల్లో హెలిపాడ్గా మర్చేశారు. ఆ తతంగమంతా ఉత్తరప్రదేశ్ బుదాయూ జిల్లాలోని కట్రా గ్రామంలో చోటు చేసుకుంది. అది కూడా బీఎస్పీ అధ్యక్షురాలు, ఆ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి కుమారి మాయావతి కోసం.
ఈ వారం మొదట్లో కట్రా గ్రామంలో వరుసకు అక్కాచెల్లిళ్లపై సామూహిక అత్యాచారం చేసి ఆపై వారిని మామిడి చెట్టుకు ఉరి వేశారు. ఆ సంఘటన దేశవ్యాప్తంగా సంచలనం కలిగించింది. ఆ బాలికల కుటుంబ సభ్యులను ఓదార్చేందుకు జాతీయనాయకులు ఇప్పటికే ఆ గ్రామానికి క్యూడుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో బీఎస్పీ అధినేత్రి కుమారి మాయావతి ఆదివారం కట్రాలో బాధిత కుటుంబసభ్యులను ఓదార్చనున్నారు. అందుకోసం ఆమె హెలికాప్టర్లో కట్రా గ్రామానికి రానున్నారు. దాంతో బంగారం లాంటి పోలాన్ని హెలిపాడ్గా మార్చేశారు. అయితే శనివారం కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ బాధిత కుటుంబాలను పరామర్శించిన సంగతి తెలిసిందే.