బంద్ నేపథ్యంలో శ్రీనగర్ లో ఆంక్షలు విధింపు
శ్రీనగర్: సెక్యూరిటీ సిబ్బంది కాల్పుల్లో ఇద్దరు యువకులు మరణించిన నేపథ్యంలో ఆందోళనకారులు బంద్ ప్రకటించిన నేపథ్యంలో శ్రీనగర్ పట్టణంలో భద్రతాపరమైన ఆంక్షలు బుధవారం కూడా కొనసాగుతునే ఉన్నాయి.
బడ్గమ్ జిల్లాలో జరిగిన కాల్పుల్లో ఇద్దరు యువకులు మరణించిన సంగతి తెలిసిందే. ఎలాంటి అవాంచనీయ సంఘటనలు జరగకుండా జిల్లాలోని నోగామ్, సఫకదల్, రేయిన్ వారి, ఎం.ఆర్ గంజ్, నోవ్ హట్టా, ఖన్యార్ లో బుధవారం కూడా ఆంక్షలు విధించామని ఓ సీనియర్ పోలీస్ అధికారి తెలిపారు.