పంజాబ్లో బాలికపై సామూహిక అత్యాచారం
మొగా: పంజాబ్లోని మొగా జిల్లాలో 14 ఏళ్ల బాలికపై ముగ్గురు యువకులు సామూహిక అత్యాచారానికి పాల్పడిన ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. స్థానికంగా సంచలనం సృష్టించిన ఈ ఘటనపై పోలీసులు తెలిపిన వివరాలు.. మొగా జిల్లాలోని బధ్నికలన్ గ్రామానికి చెందిన బాలిక స్థానిక ప్రభుత్వ పాఠశాలలో తొమ్మిదో తరగతి చదువుతోంది. శనివారం పాఠశాలకు వెళ్లి తిరిగి వస్తున్న సమయంలో 20 ఏళ్ల లోపున్న సుఖ్జీవన్ సింగ్, జగ్సీర్ సింగ్ సహా మరో వ్యక్తి కారులో వచ్చి బాలికను కిడ్నాప్ చేశారు. అక్కడి నుంచి ఓ నిర్జనప్రాంతానికి తీసుకెళ్లి ఆమెపై అత్యాచారం చేశారు. అనంతరం బాధితురాలిని అక్కడే వదిలి పారిపోయారు.