Badvel constitution
-
తెలుగు రాష్ట్రాల్లో ఉప ఎన్నికల నోటిఫికేషన్ విడుదల
-
హుజురాబాద్, బద్వేల్ నియోజకవర్గాల ఉప ఎన్నిక షెడ్యూల్ విడుదల
సాక్షి, హైదరాబాద్: తెలుగు రాష్ట్రాల్లో ఉప ఎన్నికలకు కేంద్ర ఎన్నికల కమిషన్ మంగళవారం షెడ్యూల్ విడుదల చేసింది. తెలంగాణలోని హుజురాబాద్, ఆంధ్రప్రదేశ్‌లోని బద్వేల్ నియోజకవర్గాలకు ఉప ఎన్నికలు జరగనున్నాయి. అక్టోబర్ 30న ఈ రెండు నియోజక వర్గాలకు ఉప ఎన్నిక నిర్వహించనున్నట్లు కేంద్ర ఎన్నికల కమిషన్ వెల్లడించింది. నవంబర్ 2న కౌంటింగ్ చేపట్టనున్నట్లు పేర్కొంది. ఈ మేరకు కేంద్ర ఎన్నికల కమిషన్ అధికారికంగా షెడ్యూల్‌ను విడుదల చేసింది. దేశవ్యాప్తంగా 14 రాష్ట్రాలలోని 30 అసెంబ్లీ నియోజకవర్గాలకు, మూడు లోక్‌సభ స్థానాలకు ఉప ఎన్నిక నిర్వహించనున్నారు. చదవండి: కొడుకును సీఎం చేయడానికే నన్ను పక్కకు తోశారు: ఈటల కాగా తెలంగాణ మాజీ మంత్రి ఈటల రాజేందర్‌ను మంత్రి పదవి నుంచి బర్తరఫ్ చేయడంతో.. తన ఎమ్మెల్యే పదవికి జూన్ 12న ఆయన రాజీనామా చేశారు. దీంతో హుజురాబాద్ నియోజకవర్గంలో ఉప ఎన్నిక అనివార్యమైంది. అదే విధంగా బద్వేల్ వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే డాక్టర్ వెంకట సుబ్బయ్య అనారోగ్యంతో మార్చి 28న మృతిచెందడంతో.. బద్వేల్లోనూ ఉప ఎన్నిక జరగాల్సి ఉంది. ఇక ప్రజాప్రాతినిధ్య చట్టంలోని నిబంధనల ప్రకారం ఆరు నెలలలోగా.. అంటే డిసెంబర్ 12 లోగా హుజూరాబాద్‌కు ఉప ఎన్నిక నిర్వహించాలి. ఈ నేపథ్యంలో హుజురాబాద్, బద్వేల్ ఉపఎన్నికల షెడ్యూల్‌ను ఎలక్షన్ కమిషన్ విడుదల చేసింది. చదవండి: జగ్గారెడ్డి పంచాయితీ.. కాంగ్రెస్‌లో టీ కప్పులో తుపానే..! షెడ్యూల్ వివరాలు.. ► అక్టోబర్ 1న నోటిఫికేషన్ విడుదల ► నామినేషన్ దాఖలుకు చివరి తేదీ అక్టోబర్ 8 ► అక్టోబర్ 11న నామినేషన్ల పరిశీలన ► నామినేషన్ల ఉపసంహరణకు చివరి తేదీ అక్టోబర్ 13 ► అక్టోబర్ 30వ తేదీన పోలింగ్ ► నవంబర్ 2వ తేదీ ఓట్ల లెక్కింపు, ఫలితాల ప్రకటన. -
బద్వేలు టీడీపీలో రచ్చ రచ్చ
గోపవరం :బద్వేలు నియోజకవర్గంలో గత కొద్దిరోజులుగా ఎమ్మెల్యే జయరాములు, మాజీ ఎమ్మెల్యే విజయమ్మల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోంది. అధికారిక కార్యక్రమాలను ఇద్దరూ పోటాపోటీగా నిర్వహిస్తున్నారు. ప్రజా సమస్యలను పక్కనపెట్టి ఇద్దరు నేతలు కూడా బలనిరూపణకు వేదికగా జనచైతన్య యాత్రలను మార్చుకుంటున్నారని ఆరోపణలు వస్తున్నాయి. గోపవరం మండలంలో 14, 15వ తేదీల్లో జనచైతన్యయాత్ర షెడ్యూల్‌ను ఎమ్మెల్యే ప్రకటించారు. విషయం తెలుసుకున్న మాజీ ఎమ్మెల్యే రెండు రోజుల ముందే తన అనుచరులతో మండలంలో కార్యక్రమాన్ని పూర్తిచేశారు. ఆ తర్వాత ఎమ్మెల్యే షెడ్యూల్ ప్రకారం రెండు రోజుల పాటు నిర్వహించారు. ఈ నెల 16వ తేదీ డ్వాక్రా సంఘాల రెండవ విడత రుణామాఫీ చెక్కుల కార్యక్రమాన్ని బద్వేలు మార్కెట్‌యార్డులో అధికారులు ఎమ్మెల్యే చేతులమీదుగా పంపిణీ చేయించారు. విషయం తెలుసుకున్న మాజీ ఎమ్మెల్యే విజయమ్మ ఎమ్మెల్యే అక్కడి నుంచి వెళ్లిపోయిన తర్వాత అదే ప్రజల సమక్షంలో అధికారులపై ఒత్తిడి తెచ్చి తిరిగి రుణమాఫీ చెక్కులు అందజేశారు. నియోజకవర్గంలో ఇద్దరు నేతల మధ్య అధికారులు నలిగిపోతున్నారు. ఒకానొక దశలో ఈ నియోజకవర్గాన్ని వదిలితే ప్రశాంతంగా ఉద్యోగం చేసుకోవచ్చన్న ఆలోచనలో అధికారులు ఉన్నట్లు సమాచారం. ఎమ్మెల్యే చెప్పింది చేయాలా లేక మాజీ ఎమ్మెల్యే మాటవినాలా అని అధికారులు తలలు పట్టుకుంటున్నారు. కాగా ఏ హోదాతో మాజీ ఎమ్మెల్యే అధికారిక కార్యక్రమాలు చేపడుతున్నారని ఎమ్మెల్యే ప్రశ్నిస్తున్నారు. ఇంకా ఎంత కాలం దళిత ప్రజాప్రతినిధులపై పెత్తనం చెలాయిస్తారని గురువారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఎమ్మెల్యే ధ్వజమెత్తారు. మాజీ ఎమ్మెల్యే అనుసరిస్తున్న తీరుపై ఇప్పటికే జిల్లా అధ్యక్షుడు, పార్టీ పరిశీలకుల దృష్టికి కూడా తీసుకెళ్లానని, త్వరలోనే ముఖ్యమంత్రి చంద్రబాబుకు కూడా ఫిర్యాదు చేయనున్నట్లు ఆయన తెలిపారు.