స్కూల్‌పై దాడికి ఉగ్రవాదుల యత్నం
ఇస్లామాబాద్: పాకిస్తాన్లో ఉగ్రవాదులు మరో ఘాతుకానికి ప్రయత్నించారు. పంజాబ్ ప్రావిన్స్‌లోని బహవాల్‌నగర్‌లో సోమవారం ఉదయం ఇద్దరు ఉగ్రవాదులు ప్రైవేట్ స్కూల్లో చొరబడడానికి ప్రతత్నించారు. పాఠశాల వెలుపల వారు కాల్పులకు పాల్పడ్డాడు. పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకోవడం గమనించిన ఉగ్రవాదులు.. అక్కడ నుంచి పారిపోయినట్లు పాక్ మీడియా వెల్లడించింది. ఈ ఘటనలో స్కూల్ సెక్యూరిటీ గార్డ్ గాయపడినట్లు తెలుస్తోంది.
అప్రమత్తమైన పోలీసులు పాఠశాలలోని విద్యార్థులను ఖాళీ చేయించారు. ఉగ్రవాదుల కోసం గాలింపుచర్యలు చేపడుతున్నారు. గతవారం క్వెట్టాలోని పోలీస్ ట్రైనింగ్ సెంటర్‌పై ఉగ్రవాదులు జరిపిన దాడిలో 61 మంది మృతి చెందగా.. 165 మంది గాయపడిన విషయం తెలిసిందే.