చోరీలతో జల్సాలు
బెంగళూరు, చోరీలకు పాల్పడిన ఇద్దరిని అరెస్టు చేసిన సీసీబీ పోలీసులు వారినుంచి రూ.19.50లక్షల విలువైన బంగారు నగలు స్వాధీనం చేసుకున్నారు. పోలీసుల కథనం మేరకు... బెంగళూరు గ్రామీణ జిల్లా బైలనరసాపురకు చెందిన పాజివ్ బాష, అవీన్ బాష జల్సాలకు అలవాటు పడ్డారు.
ఈక్రమంలో కే ఆర్‌పురం, రామమూర్తినగర, మహదేవపుర, భారతీనగర, బయ్యప్పనహళ్ళి జేపీనగర, బయ్యప్పనహళ్ళి పోలీస్ స్టేషన్ల పరిధిలో రెక్కీ నిర్వహించి తాళం వేసిన ఇళ్లను గుర్తించి చోరీలకు పాల్పడ్డారు.
అనంతరం నగలును చింతామణి, కోలారు, హొసకోటేలలో విక్రయించి జల్సాలు చేశారు. వీరిద్దరూ శుక్రవారం అనుమానాస్పదంగా తిరుగుతుండగా అదుపులోకి తీసుకొని విచారణ చేపట్టగా చోరీలకు పాల్పడినట్లు అంగీకరించారు. ఇద్దరినీ అరెస్టు చేసి పది చోరీకేసులకు సంబంధించి రూ. 19.50 లక్షల విలువైన 630 గ్రాముల బంగారు నగలు స్వాధీనం చేసుకున్నారు. వీరినుంచి నగలు కొనుగోలు చేసిన కోలారులోని రాజేష్ జ్యువెలర్స్ యజమాని రాజేష్‌ను అదుపులోకి తీసుకుకొని విచారణ చేపట్టినట్లు పోలీసులు తెలిపారు.