Baisaran Valley
-
అత్యంత కీలకంగా మారిన చెట్టు మీది వీడియో
పహల్గాం/న్యూఢిల్లీ: ఒక ఫొటోగ్రాఫర్ చెట్టు మీది నుంచి తీసిన వీడియో పహల్గాం ఉగ్ర ఘటన దర్యాప్తులో కీలకంగా మారింది. అలాగే ఘటన సమయంలో కుటుంబంతో కలిసి అక్కడికి విహారయాత్రకు వచ్చిన ఒక సైనికాధికారి ప్రత్యక్ష సాక్షిగా ఇచ్చిన వాంగ్మూలం కూడా దర్యాప్తు అధికారులకు ఎంతో సాయపడుతోంది. నాటి ఘటన క్రమాన్ని ఆయన పూసగుచ్చినట్లు వివరించారు. కేంద్ర హోం శాఖ ఆదేశాల మేరకు పహల్గాం ఘటన దర్యాప్తును జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) స్వీకరించింది. ఆదివారం జమ్మూలో కేసు నమోదుచేసి దర్యాప్తు ప్రారంభించింది. ఐజీ, డీఐజీ, ఎస్పీలతో ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసింది. ఘటన జరిగిన రోజు నుంచే స్థానిక పోలీసులకు దర్యాప్తులో ఎన్ఐఏ బృందం సాయపడటం తెల్సిందే. దాడి నుంచి బయటపడి స్వస్థలాలకు వెళ్లిన పర్యాటకుల నుంచి వేర్వేరు బృందాలు వాంగ్మూలాలను సేకరిస్తున్నాయి. సైన్యాధికారి ఏం చెప్పారంటే... లెఫ్టినెంట్ కల్నల్ హోదాలో ఉన్న సైనికాధికారి కాల్పుల వేళ తన కుటుంబాన్ని సురక్షిత ప్రాంతంలో దాచేశారు. ఉగ్రవాదులు ఎటు నుంచి వచ్చారు, తొలుత ఎవరిని చంపారు, తర్వాత ఎటు వెళ్లారు వంటి వివరాలను వాంగ్మూలంలో చెప్పారు. ‘‘తొలుత ఇద్దరు ఉగ్రవాదులు చిన్నపాటి దుకాణాల వెనుక నుంచి హఠాత్తుగా వచ్చి పర్యాటకులను ‘కల్మా’ చదవాలని ఆదేశించారు. చదవని నలుగురిని తలపై కాల్చిచంపారు. దాంతో అంతా ప్రాణభయంతో పరుగులు పెట్టారు. ఉగ్రవాదులు వారి తల, గుండెకు గురి చూసి కాల్చడంతో మరికొందరు చనిపోయారు. కాసేపటికే మరో ఇద్దరు ఉగ్రవాదులు అడవి నుంచి బయటికొచ్చి పర్యాటకులపైకి కాల్పులకు దిగారు’’ అని ఆయన వివరించినట్టు సమాచారం. కాల్పుల ఘటనను ఉగ్రవాదులు తమ బాడీ క్యామ్‌లలో రికార్డ్ చేసుకున్నట్టు కూడా ప్రత్యక్ష సాక్షులు చెప్పారు. యువ నేవీ అధికారి లెఫ్టినెంట్ వినయ్ నర్వాల్ పెళ్లయిన ఆరు రోజులకే దాడిలో చనిపోవడం తెలిసిందే. దాంతో ఆయన భార్య హిమాన్షీ గుండెలవిసేలా రోదిస్తూనే ఫోన్ చేసి పోలీసులకు వెంటనే సమాచారమిచ్చారు. దాడిపై వారికి వచ్చిన తొలి కాల్ అదే. దాంతో పహల్గాం పోలీసులు వెంటనే ఘటనాస్థలికి చేరుకున్నారు. 22 గంటలు ట్రెక్కింగ్ చేసొచ్చి చంపారు భద్రతా బలగాల కంటబడకుండా ఉండేందుకు ఉగ్రవాదులు రోడ్డు మార్గంలోకాకుండా అత్యంత ప్రతికూలమైన, ప్రమాదకర పర్వత సానువుల గుండా వచ్చినట్టు వెల్లడైంది. కోకెర్నాగ్ అటవీ ప్రాంతం గుండా 22 గంటలు ట్రెక్కింగ్ చేసి మరీ బైసారన్ చేరుకున్నారని విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. పర్యాటకులను కాల్చే క్రమంలో ఒక స్థానికుడు, మరో పర్యాటకుడి నుంచి వాళ్లు మొబైల్ ఫోన్లు లాక్కున్నారు. తిరిగి వెళ్తూ వాటిని మార్గమధ్యంలో ధ్వంసం చేశారని తెలుస్తోంది. దాడిలో ఏకే 47, ఎం4 మెషీన్గన్లు వాడినట్టు జాగా ఫోరెన్సిక్ పరీక్షల్లో తేలింది. ప్రాణభయంతో చెట్టెక్కి, వీడియో తీసి...ఉగ్రవాదులు దాడికి దిగిగినప్పుడు అక్కడే ఉన్న స్థానిక ఫొటోగ్రాఫర్ ఒకరు ప్రాణభయంతో చెట్టెక్కి కొమ్మల్లో నక్కారు. అలా వారి కంట పడకుండా తప్పించుకున్నారు. కళ్లెదుటే అమాయక పర్యాటకులపై విచక్షణారహితంగా తూటాల వర్షం కురిపించిన తీరును కెమెరాలో బంధించారు. దాడి క్రమాన్ని స్పష్టంగా పట్టిచ్చిన ఆ వీడియో ఎన్ఐఏ దర్యాప్తులో కీలకంగా మారింది. -
త్రుటిలో తప్పించుకున్నారు..
ఒకరు ప్లాన్ చేంజ్ చేసుకున్నారు.. మరొకరికి గుర్రపు స్వారీ దొరకలేదు.. ఇంకొందరైతే ఘటనకు కొద్దిసేపటి నుంచే అక్కడి నుంచి వెళ్లిపోయారు. పహల్గాం ఉగ్రదాడినుంచి త్రుటిలో తప్పించుకున్న పర్యాటకులు ఒక్కొక్కరిదీ ఒక్కో అనుభవం. దాడి భయానక పరిస్థితులను, క్షతగాత్రులకు సాయం చేయడానికి, సురక్షితంగా బయటపడేయడానికి తమ ప్రాణాలను పణంగా పెట్టిన స్థానికుల ప్రయత్నాలను వారు గుర్తు చేసుకున్నారు. భయంతో నిద్రపట్టలేదు.. ‘అక్కడికి వెళ్లడానికి.. బైసారన్ లోయకు కొన్ని కిలోమీటర్ల దూరంలో ఉన్న సిటీ ట్యాక్స్ స్టాండ్ దగ్గర మేం ఉండగా గందరగోళం ప్రారంభమైంది. ప్రజలు కేకలు వేస్తూ పరుగులు తీస్తున్నారు. ఏం జరుగుతుందో మాకు అర్థం కాలేదు. ఆ తరువాత దాడి గురించి తెలిసింది. స్థానికుల సలహా మేరకు ఓ హోటల్‌ను సంప్రదించడంతో వారు వాహనాన్ని పంపి మమ్మల్ని అక్కడినుంచి తీసుకెళ్లారు. మేం తిరిగి వెళ్తుండగా అంబులెన్సులు, మిలిటరీ వాహనాలు పరుగులు పెట్టడం కనిపించింది. నా ఎనిమిదేళ్ల కొడుకు చాలా భయపడ్డాడు. మాట్లాడలేకపోయాడు. ఆ భయం రాత్రంతా కొనసాగింది. నిద్రకూడా పట్టలేదు. వెంటనే ప్రయాణాన్ని కుదించుకుని తిరిగి వచ్చేశాం.’అని ఆ భయానకమైన రోజును గుర్తు చేసుకున్నారు పశి్చమబెంగాల్‌లోని హుగ్లీకి చెందిన చంచల్ డే. దాడి జరిగిన సమయంలో ఆయన కుటుంబంతో కలిసి కశ్మీర్ పర్యటనలో ఉన్నారు. ‘‘నేను మళ్లీ కశ్మీర్‌కు వెళ్లను. అక్కడికి వెళ్లాలన్న ఆలోచన వచి్చనా పునరాలోచిస్తాను. ఉగ్రవాదులపై చర్యలు తీసుకోవాల్సింది ప్రభుత్వం. నా ఆలోచన మాత్రం మా భద్రత గురించే’అని వారితో పాటు పర్యటనకు వెళ్లొచి్చన డే మరదలు బసంతి తెలిపారు. ప్లాన్ మారి ప్రాణాలతో బయటపడ్డాం.. మహారాష్ట్రలోని అకోలాకు చెందిన విశాల్ సంగోకర్, అతని భార్య దాడి జరిగిన రోజే బైసారన్‌ను సందర్శించాలనుకున్నారు. అదృష్టవశాత్తు వారి ప్లాన్ ఒక రోజు ముందుకు మారింది. 22న దాడి జరగగా, 21న అంటే ఒక రోజు ముందుగానే బైసారన్‌లో పర్యటించారు. ‘‘ఒక రోజు ముందుగా వెళ్లడం మా అదృష్టం. లేకపోతే మేం కూడా బాధితుల్లో ఉండేవాళ్లం. మేం వెళ్లిన రోజు కూడా కొంత అసౌకర్యానికి గురయ్యాం. చుట్టుపక్కల ఎలాంటి సెక్యూరిటీ లేదు’’అని పహల్గాం అనుభవాలు పంచుకున్నారు సంగోకర్. ప్రస్తుతం శ్రీనగర్‌లో ఉన్న వీరు త్వరలోనే అకోలాకు రానున్నారు. డ్రైవర్ తన ఇంట్లో ఆశ్రయం కల్పించారు.. ధారశివ్ జిల్లాకు చెందిన రెండు కుటుంబాలు కూడా ఏప్రిల్ 22న సంఘటనా స్థలానికి మూడు, నాలుగు కిలోమీటర్ల దూరంలో ఉన్నాయి. ‘‘అప్పటిదాకా ప్రశాంతంగా ఉన్న వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. ఆకస్మిక దాడితో దిగ్భ్రాంతికి గురయ్యాం. ‘ఏదో సమస్య ఉంది. వెంటనే ఇక్కడి నుంచి వెళ్లిపోదాం’అని స్థానికుడైన మా డ్రైవర్ మజీద్‌ఖాన్ చెప్పారు. మమ్మల్ని తీసుకెళ్లి వాళ్లింట్లో ఆశ్రయం కలి్పంచారు. మజీద్ మమ్మల్ని అప్రమత్తం చేయకుంటే పరిస్థితి మరోలా ఉండేది’’అంటూ ఆనాటి వాతావరణాన్ని వారు గుర్తు చేసుకున్నారు. గుర్రం దొరక్క ప్రాణాలు దక్కాయి.. సాంగ్లీకి చెందిన సంతోష్ జగ్దాలే కుటుంబం ఊహించని ట్విస్ట్‌తో ప్రాణాపాయం నుంచి తప్పించుకుంది. దాడి జరిగిన రోజు ఉదయం వారు పహల్గాం వెళ్లాల్సి ఉంది. స్వారీ చేయడానికి గుర్రాలు దొరకలేదు. దీంతో బదులుగా సందర్శనకు మరొక ప్రదేశానికి వెళ్లారు. ‘‘మేం తిరిగి వచ్చేసరికి దాడి జరిగింది. ఎక్కడ చూసినా సైన్యమే. సంతోష్ జగ్దాలే అనే పేరున్న పుణేకి చెందిన మరో వ్యక్తి చనిపోయాడు. దీంతో మా బంధువుల్లో భయాందోళనలు పెరిగి ఫోన్స్ చేశారు. నేను బతికే ఉన్నానని నిర్ధారించుకుని నెమ్మదించారు’అని సంతోష్ వివరించారు. ప్రాణాలు కాపాడిన మటన్ రోగన్ జోష్...కేరళలోని కొచి్చకి చెందిన 11 మంది సభ్యుల కుటుంబాన్ని మటన్ రోగన్ జోష్ ప్రాణాలతో బయటపడేసింది. వారి కుటుంబం ఏప్రిల్ 19న కశీ్మర్ చేరుకుంది. గుల్మార్గ్, సోన్మార్గ్ అందాలను ఆస్వాదిస్తూ రెండు రోజులు గడిపారు. బిజీ షెడ్యూల్ కారణంగా రెండు రోజుల పాటు మధ్యాహ్న భోజనం చేయలేదు. దీంతో.. బైసారన్ మైదానానికి వెళ్లడానికి ముందు ఏదైనా తినాలనుకున్నారు. ఆ రోజు ఉదయం కొంచెం ఆలస్యంగా బయలుదేరారు. రెండు రోజులుగా ఏం తినకపోవడంతో, కేవలం 15 నిమిషాల దూరంలో ఉన్న బైసారన్ చేరుకునే ముందు ఏదైనా తిందామని రోడ్డు పక్కన ఫుడ్‌స్టాల్ దగ్గర ఆగారు. మటన్ రోగన్ జోష్ ఉప్పగా ఉండటంతో తాజాగా చేయమని రెస్టారెంట్ సిబ్బందిని అడిగారు. తిని, బైసారన్‌కు తిరిగి ప్రయాణాన్ని ప్రారంభించేపట్టికి గంట ఆలస్యమైంది. బైసారన్ రెండు కిలోమీటర్ల దూరంలో ఉండగా గందరగోళం నెలకొంది. గుర్రాలు, ట్యాక్సీలు కిందకు వస్తున్నాయి. ప్రజలు కేకలు వేస్తున్నారు. స్థానిక భాష తెలియకపోవడంతో ముందుకు వెళ్దాం అనుకున్నారు. డ్రైవర్ స్థానికుడు కావడంతో ఎందుకైనా మంచిదని ఆరా తీశాడు. దాడి జరిగిందని, అప్పటికే భద్రతా బలగాలు రంగంలోకి దిగాయని సమాచారం తెలిసింది. వారికి ధైర్యం చెప్పిన డ్రైవర్ వెంటనే వాహనాన్ని వెనక్కి తిప్పాడు. క్షేమంగా హోటల్‌కు చేర్చాడు. లేటైతే ప్రాణాలు పోయేవి.. నాందేడ్‌కు చెందిన కృష్ణ, సాక్షిల ప్రాణాలను ఓ పదిహేను నిమిషాలు కాపాడాయి. ఉగ్రవాదులు కాల్పులు జరపడానికి 15 నిమిషాల ముందే ఘటనా స్థలం నుంచి వెళ్లిపోయారు. తాము క్షేమంగా ఉన్నామని వివరిస్తూ వారు షేర్ చేసిన వీడియో వైరల్ అవుతోంది. ప్రస్తుతం తిరుగు ప్రయాణానికి విమాన టిక్కెట్ల కోసం ఎదురుచూస్తున్నారు. అస్సాంలోని బొంగైగావ్‌కు చెందిన బిశ్వజిత్ ఛటర్జీ కుటుంబం కూడా ఇలాగే ప్రాణాలు కాపాడుకుంది. గౌహతి మీదుగా ఏప్రిల్ 17న శ్రీనగర్‌కు చేరుకున్నవారు 19 వరకు గుల్మార్గ్లో ఉన్నారు. 20న పహల్గాంకు వచ్చారు. 20, 21 తేదీల్లో చాలా సరదాగా గడిపారు. 22వ తేదీన దాడి జరగడానికి రెండు గంటల ముందే బైసారన్ నుంచి వారు వెళ్లిపోయారు. వారు మరో ప్రదేశాన్ని సందర్శిస్తుండగా దాడి వార్త తెలిసింది. కాస్త ఆలస్యమైతే ఏమయ్యేదన్న ఆలోచన వస్తేనే భయమేస్తుందని వారు చెబుతున్నారు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
పహల్గాంలోని బైసరన్ వ్యాలీ నుంచి సాక్షి గ్రౌండ్ రిపోర్ట్
-
పహల్గాం ఉగ్రదాడిలో విస్తుపోయే విషయాలు
ప్రభుత్వాధికారులను, వారి కుటుంబ సభ్యులను లక్ష్యంగా చేసుకునే పహల్గాం దాడి జరిగిందా? కాల్చి చంపే ముందు ఉగ్రవాదులు టూరిస్టుల ఐడీ కార్డులను ఎందుకు చెక్ చేశారు?. పైగా మృతుల్లో ఐబీ, నేవీ, ఎయిర్‌ఫోర్స్ విభాగాల ఉద్యోగులే అధికంగా ఉండడం.. ఈ అనుమానాలకు మరింత బలం చేకూరుస్తోంది. పహల్గాం ఉగ్రదాడిలో సంచలన విషయాలు వెలుగు చూస్తున్నాయి.కశ్మీర్ గడ్డపై నరమేధానికి ఉగ్రవాదులు ఈ పర్యాటక ప్రాంతాన్నే ఎంచుకోవడం వెనుక భద్రతాధికారులు పలు కారణాలు చెబుతున్నారు. పహల్గాం పట్టణానికి ఐదు కిలోమీటర్ల దూరంలో ఉన్న బైసరన్ వ్యాలీ(baisaran valley)కి కశ్మీర్ ‘మినీ స్విట్జర్లాండ్’గా పేరుంది. శీతాకాలంలో మంచు దుప్పటి పర్చుకునే ఈ ప్రాంతం.. మిగతా కాలంలో పచ్చిక బయళ్లతో, ఫైన్ చెట్లతో.. యూరప్ అల్పైన్ లోయలను తలపిస్తుంటుంది. అందుకే దేశం నలుమూలల నుంచి పర్యాటకలకు వేసవిలో ఈ ప్రాంతానికి క్యూ కడుతుంటారు. పైగా ల్యూలియన్ సరస్సుకు బైసరన్ వ్యాలీ బేస్‌గా ఉండడంతో పాటు ట్రెక్కింగ్ కోసం సాహస యాత్రికులు ఈ ప్రాంతానికి క్యూ కడుతుంటారు.అయితే పహల్గాం(pahalgam) బైసరన్ లోయకు ఉన్న ప్రత్యేకతలే.. ఉగ్రవాదులు సులువుగా చొరబడి అమాయకులపై దాడి చేయడానికి వీలు కలిపించింది. ఇక్కడి పచ్చదనం పాడు కాకూడదన్న ఉద్దేశంతో మోటార్ వెహికిల్స్‌ను అనుమతించరు. పహల్గాం టౌన్ నుంచి ఐదు కిలోమీటర్ల పాటు కాలినడకన లేదంటే పొట్టి గుర్రాలను(Pony) పర్యాటకులు ఆశ్రయించాల్సి ఉంటుంది. పర్యావరణ సమతుల్యతను కాపాడుకోవడం కోసం తీసుకున్న ఈ చర్యలు ఈ ప్రాంతాన్ని ఒంటరిని చేసేశాయి. తద్వారా అత్యవసర పరిస్థితుల్లో లేదంటే ఊహించని సంఘటనల సమయంలో చర్యలకు జాప్యం కలిగేలా చేశాయి. ప్రభుత్వాధికారులే లక్ష్యంగా.. పక్కా ప్లాన్‌తోనే బైసరన్ వ్యాలీలో ఉగ్రదాడి జరిగినట్లు స్పష్టమవుతోంది. మంగళవారం మధ్యాహ్నా సమయంలో (2.45గం.-3గం. ప్రాంతంలో) సైన్యం దుస్తుల్లో సమీప అడవుల నుంచి వచ్చిన బృందం.. టూరిస్టులపై విచక్షణా రహితంగా కాల్పులు జరిపింది. బాడీక్యామ్‌లు ధరించిన ముగ్గురు టెర్రరిస్టులు పర్యాటకులను ఒక చోటా చేర్చి.. వివరాలను ఆరా తీసి మరి కాల్చి చంపి ఆ దృశ్యాలను రికార్డు చేశారు. టూరిస్టులు పారిపోతున్న టైంలో స్నైఫర్ ఫైర్ చేశారు. అయితే ప్రత్యక్ష సాక్షుల కథనం ప్రకారం.. ఆరుగురు ఉగ్రవాదులు దాడికి పాల్పడినట్లు తెలుస్తోంది. ఈ దాడిలో 26 మంది మరణించగా, అనేక మంది గాయపడ్డారు. బైరసర్ వ్యాలీ దగ్గర వాహనాలు లేకపోవడంతో క్షతగాత్రుల తరలింపు మరింత ఆలస్యమైంది. భద్రతా బలగాలు కూడా కాస్త ఆలస్యంగానే అక్కడికి చేరుకున్నట్లు తెలుస్తోంది. ఈలోపు దట్టమైన అడవుల్లోకి ఉగ్రవాదులు పారిపోగలిగారు. జమ్ము కశ్మీర్‌లోనే అంత్యంత ప్రశాంతమైన పర్యాటక ప్రాంతంగా పేరు ఉన్న బైసరన్ వ్యాలీ.. నిన్నటి దాడితో ఆ పేరుపై నీలినీడలు కమ్ముకునేలా చేసుకుంది.ఎమోషనల్ పోస్టులుపహల్గాం ఉగ్రదాడి గురించి తెలిశాక.. చాలా మంది(సెలబ్రిటీలతో సహా) సోషల్ మీడియాలో బైసరన్ వ్యాలీ అనుభూతుల్ని పంచుకుంటున్నారు. గతంలో తాము అక్కడికి వెళ్లిన సందర్భంలో దిగిన చిత్రాలను షేర్ చేస్తూ.. ఉగ్రదాడిపై దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. ప్రశాంతమైన ఆ నేల నెత్తురోడడంపై ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఉగ్రవాదంపై కఠిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని కేంద్రాన్ని కోరుతున్నారు. 👉: (ఫోటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి)#baisaranvalley. Kashmir. Had been there 2 years before with family. Can’t imagine today this tragic incidence has happened at the same place. My heart goes out to the victims, their families and all those tourist civilians who lost their life🙏 pic.twitter.com/MabmrYmG5F— Rakesh Banerjee (@RakeshB41201077) April 22, 2025 Most people refer to Baisaran Valley in Pahalgam as "Mini Switzerland" but I prefer to call it by its own name Baisaran. After all, it’s Kashmir, not Switzerland. Why would I compare such a breathtaking place in Kashmir to another country? Baisaran has its own unique charm.. pic.twitter.com/MDLDXl41L7— batukh (@Samaandar_) March 13, 2025