baked goods
-
ఇసుకలో అప్పడం కాల్చిన జవాను
దేశంలోని కొన్ని ప్రాంతాల్లో ఎండలు ఠారెత్తిస్తున్నాయి. చాలా చోట్ల ఉష్ణోగ్రతలు 44 డిగ్రీలు దాటాయి. ఎండ వేడిమిలో ప్రజల పరిస్థితి దయనీయంగా మారింది.రాజస్థాన్‌లో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఈ నేపధ్యంలో ఒక వీడియో వైరల్‌గా మారింది. దీనిని చూసినవారంతా షాక్‌కు గురవుతున్నారు. తాజాగా బికనీర్‌లో 47 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఈ ఎండలు ఏ రీతిలో ఉన్నాయో తెలియజేసేందుకు బీఎస్ఎప్ జవాను ఒకరు వినూత్న ప్రయోగం చేశారు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు వైరల్‌గా మారింది.బీఎస్ఎఫ్ జవాను ఎండకు అత్యంత వేడిగా మారిన ఇసుకతో ఒక అప్పడాన్ని కాల్చారు. ఈ వీడియోను చూస్తే.. ప్రతికూల పరిస్థితుల్లో సైతం మన దేశ సరిహద్దులలోని సైనికులు ఎలా విధులు నిర్వహిస్తున్నారో గమనించవచ్చు. వేడి నుంచి ఉపశమనం పొందేందుకు మనమంతా ఏసీలు, కూలర్లను ఆశ్రయిస్తుండగా, దేశ సరిహద్దుల్లోని జవానులు ఉక్కపోత మధ్యనే విధులు నిర్వహిస్తున్నారు. వైరల్ అయిన ఈ వీడియో బికనీర్‌లోని ఖాజువాలా సమీపంలోని పాక్ సరిహద్దులలోనిది. రాజస్థాన్‌లో హాటెస్ట్ సిటీగా బికనీర్ పేరుపొందింది. उफ ये गर्मी! बीकानेर में 47 डिग्री पार पहुंचा पारा, तपती रेत पर @BSF_India जवान ने सेंका पापड़। इतनी गर्मी में भी जवान सीमा पर निभा रहे फर्ज... देखें वीडियो #summersafety पूरी खबर पढ़ें- https://t.co/ToEeaJcxG9 pic.twitter.com/yyCajuv1lt— Amar Ujala (@AmarUjalaNews) May 22, 2024 -
హెల్తీగా రాగి డోనట్స్ చేసుకోండిలా..!
రాగి డోనట్స్కి కావలసినవి: మైదాపిండి – 1 కప్పు పంచదార పొడి – 1 కప్పు వైట్ వెనిగర్, వెనీలా ఎసెన్స్ బేకింగ్ సోడా – 1 టీ స్పూన్ చొప్పున ఉప్పు – అర టీ స్పూన్ మజ్జిగ – 1 కప్పు గుడ్లు – 2 రాగి పిండి– 2 కప్పులు నూనె – 2 టేబుల్ స్పూన్లు తయారీ విధానం: ముందుగా ఒక బౌల్ తీసుకుని అందులో మైదాపిండి, పంచదార పొడి, బేకింగ్ సోడా, వెనీలా ఎసెన్స్, గుడ్లు, నూనె, వైట్ వెనిగర్, రాగిపిండి, తగినంత ఉప్పు వేసుకుని.. కొద్దికొద్దిగా మజ్జిగ పోస్తూ బాగా కలిపి పెట్టుకోవాలి. అవసరం అయితే కొద్దిగా నీళ్లూ కలుపుకోవచ్చు. డోనట్స్ మేకర్‌కి కొద్దిగా నూనె రాసి, కలిపి పెట్టుకున్న మిశ్రమాన్ని కొద్దికొద్దిగా వేసి ఓవెన్లో బేక్ చేసుకోవాలి. అభిరుచిని బట్టి చాక్లెట్ క్రీమ్, డ్రైఫ్రూట్స్‌తో నచ్చిన విధంగా గార్నిష్ చేసుకుని సర్వ్ చేసుకోవాలి. (చదవండి: పచ్చి మిర్చిని పచ్చిగా తినడమా? అనుకోవద్దు!.. ఎన్ని ప్రయోజనాలో తెలుసా!) -
ఎంత ఘాటు ప్రేమయో!
తిండి గోల చూడటానికి చిన్నగా ఉన్నా, రుచికి మాత్రం ఘాటే. కొన్ని వంటకాలలో అవి పడకపోతే రుచించదు. అవే మిరియాలు. రాములోరి పానకంలో మిరియాల పొడి పడలేదా... ఇక అది పానకం కాదు... కల్లుకిందే లెక్క! చక్రపొంగలిలో, దధ్యోదనంలో, తిరుమలేశునికి నివేదించే పులిహోరలో పంటికింద మిరియాలు తగిలితేనే పసందు. బ్లాక్ పెప్పర్‌గా ఆంగ్లేయులు పిలుచుకునే మిరియాలకు ఓ స్పూను జీలకర్ర చేర్చి, వాటిని కచ్చాపచ్చాగా దంచి, ఓ స్పూను నేతిలో వేసి వేగించామా... ఎంత జటిలమైన జలుబూ ఎగిరిపోవాల్సిందే! ఈ క్రోసిన్లు, కోల్డారిన్లు రాకముందు పడిశం పడితే అదే పెద్ద మందు. అంతేనా.. అజీర్తితో నోటికి అరుచిగా అనిపించినప్పుడు చిటికెడు ఉప్పూ మిరియాల పొడీ జీలకర్ర, చిన్న అల్లంముక్క కలిపి నేతిపోపు పెట్టి మొదటి ముద్దలో తింటే... ఆకలి... అని గెంతవలసిందే ఇక! మిరియాల చారెడితే ఎంతదూరంలో ఉన్నా గుబాళిస్తుంది. జ్వరం వచ్చినప్పుడు నీళ్లలో కొన్ని మిరియాలు, చక్కెర కలుపుకుని తాగితే జ్వరం తొందరగా తగ్గుతుందని ఆయుర్వేదం చెబుతోంది..