అచ్చంగా ఆరొందల అడుగుల కేక్..
వందల కేజీలకొద్దీ బరువైన కేకును మీరు చూసుంటారు. కానీ ఇది వేలకిలోల బరువైన కేకు. బరువు 3,120 కేజీలు. ఈ కేకు పొడవు ఎంతనుకుంటున్నారు? అక్షరాలా ఆరొందల అడుగులు. కేరళ రాష్ట్రంలోని ‘బేకర్స్ అసోసియేషన్’ సంస్థ వారు దీనిని తయారుచేశారు. దేశంలోనే అత్యంత పొడవైనది కాబట్టే ఈ కేకు ‘లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్’ లో చోటు సంపాదించేసింది.
త్రిసూర్‌లో గురువారం ప్రారంభమైన ‘బేక్ ఎక్స్పో 2014’లో దీనిని ప్రదర్శించారు. దేశంలోనే వృద్ధ మహిళగా తాజాగా రికార్డులకెక్కిన కుంజనమ్(112) ఫొటో సహా 700 మంది ప్రముఖుల చిత్రపటాలను ఈ కేకుపై చిత్రించారు. భారత్‌లో కేకును తొలిసారి తయారుచేసి 131 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఈ ఎక్స్పోను ఏర్పాటుచేసినట్లు నిర్వాహకులు తెలిపారు.