bala nagireddy
-
‘పుకార్లు నమ్మొద్దు.. వైఎస్ఆర్సీపీలోనే’
సాక్షి, కర్నూలు : తాను పార్టీ మారుతున్నాననే వార్తల్లో నిజం లేదని కర్నూలు జిల్లా మంత్రాలయం వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే బాల నాగిరెడ్డి చెప్పారు. కొందరు కావాలనే వదంతులు సృష్టిస్తున్నారని అన్నారు. వదంతుల గురించి తాను ఆలోచించడం లేదని చెప్పారు. పార్టీ మారే ఉద్దేశం ఉన్నవారే పుకార్ల గురించి ఆలోచిస్తారని అన్నారు. పుకార్లు ఎన్ని సృష్టించుకున్నా.. తాను మాత్రం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని వీడనని చెప్పారు. చివరి వరకూ వైఎస్ జగన్ మోహన్ రెడ్డితోనే కొనసాగుతానని వెల్లడించారు. -
వైఎస్సార్ సీపీ ఎదుగుదల చూడలేకే..
కర్నూలు: పత్తికొండ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి చెరుకులపాడు నారాయణ రెడ్డిని పథకం ప్రకారమే హత్య చేశారని ఎమ్మెల్పీ గంగుల ప్రభాకర్ రెడ్డి ఆరోపించారు. ప్రభుత్వం అండతోనే టీడీపీ నేతలు రెచ్చిపోతున్నారని ధ్వజమెత్తారు. ఫ్యాక్షన్ రాజకీయాలను టీడీపీ ప్రోత్సహిస్తోందని మండిపడ్డారు. నారాయణ రెడ్డి మృతి చాలా దురదృష్టకరమని ఎమ్మెల్యే బాలనాగిరెడ్డి అన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎదుగుదల చూడలేకే టీడీపీ ఈ దారుణానికి ఒడిగట్టిందని ఆరోపించారు. రాబోయే రోజుల్లో టీడీపీకి మనుగడ ఉండదన్న భయంతోనే దాడులకు పాల్పతున్నారని దుయ్యబట్టారు. పోలీసు వ్యవస్థను చంద్రబాబు నిర్వీరం చేసిందని వ్యాఖ్యానించారు. -
వైఎస్సార్ సీపీలో చేరిన కాంగ్రెస్ నేత బాలనాగిరెడ్డి
అనంతం: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలోకి వలసల పరంపర కొనసాగుతూనే ఉంది. జిల్లా కాంగ్రెస్ నేత బాలనాగిరెడ్డి శుక్రవారం వైఎస్సార్ సీపీలో చేరారు. బాలనాగిరెడ్డితో సహా వెయ్యి మంది వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే గుర్నాథ్ రెడ్డి, పార్టీ నేతలు తోపుదుర్తి కవిత, ఆలూరు సాంబశివారెడ్డిలు హాజరైయ్యారు. బాలనాగిరెడ్డిని సాదరంగా పార్టీలోకి ఆహ్వానించి వైఎస్సార్ సీపీ కండువా కప్పారు. దీంతో ఆ జిల్లాకు చెందిన మంత్రి శైలజానాథ్కు ఎదురుదెబ్బ తగిలినట్టయ్యింది.