
సాక్షి, కర్నూలు : తాను పార్టీ మారుతున్నాననే వార్తల్లో నిజం లేదని కర్నూలు జిల్లా మంత్రాలయం వైఎస్‌ఆర్‌సీపీ ఎమ్మెల్యే బాల నాగిరెడ్డి చెప్పారు. కొందరు కావాలనే వదంతులు సృష్టిస్తున్నారని అన్నారు. వదంతుల గురించి తాను ఆలోచించడం లేదని చెప్పారు. పార్టీ మారే ఉద్దేశం ఉన్నవారే పుకార్ల గురించి ఆలోచిస్తారని అన్నారు.
పుకార్లు ఎన్ని సృష్టించుకున్నా.. తాను మాత్రం వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీని వీడనని చెప్పారు. చివరి వరకూ వైఎస్ జగన్ మోహన్ రెడ్డితోనే కొనసాగుతానని వెల్లడించారు.
Comments
Please login to add a commentAdd a comment