సీసీఎస్ డీఎస్పీ బాధ్యతల స్వీకరణ
నెల్లూరు(క్రైమ్): నెల్లూరు సెం ట్రల్ క్రైమ్ స్టేషన్ డీఎస్పీగా ఎం. బాలసుందరరావు సోమవారం బాధ్యతలు స్వీకరించారు. 1991 బ్యాచ్‌కు చెం దిన బాలసుందరం ఎస్ ఐ, సీఐగా ప్రకాశం, నెల్లూరు జిల్లా సీసీఎస్‌లో పనిచే శారు. 2014 నవంబర్‌లో సీసీఎస్‌లో పనిచేస్తోన్న సమయంలో ఆయనకు డీఎస్పీ పదోన్నతి లభించిం ది. అప్పటి నుంచి ఆయన ప్రకా శం జిల్లా ఎస్సీ, ఎస్టీ సెల్–1 డీఎస్పీగా పనిచేశారు. ఈ నెల 15వతేదీన జరిగిన బదిలీల్లో నెల్లూరు సీసీఎస్ డీఎస్పీగా నియమితులయ్యారు. బాధ్యలు స్వీకరించిన ఆయనకు సీసీఎస్ ఇన్స్పెక్టర్లు బాజీజాన్‌సైదా, రామకృష్ణారెడ్డి, సిబ్బంది ఆయనకు పుష్పగుచ్ఛాలిచ్చి అభినందనలు తెలిపారు. అనంతరం ఎస్పీ విశాల్‌గున్నీ, ఏఎస్పీ బి.శరత్‌బాబులను మర్యాదపూర్వకంగా కలిశారు.