రేపు బాలాజీ డిగ్రీ కళాశాలలో క్యాంపస్ సెలక్షన్స్
హిందూపురం అర్బన్ : పట్టణంలోని పైప్లైన్ రోడ్డులో ఉన్న బాలాజీ కళాశాలలో బెంగళూరుకు చెందిన సాఫ్ట్వేర్ కంపెనీలతో సోమవారం క్యాంపస్ సెలక్షన్స్ నిర్వహిస్తున్నట్లు ప్రిన్సిపల్ వీరభద్రప్ప తెలిపారు. సెలక్షన్లో సాఫ్ట్వేర్ డెవలప్ కంపెనీలు ఇంటర్సోగ్ ఆటోమెటిక్ టెస్టీంగ్ గ్రూప్, పీర్ జంక్షన్ సొల్యూషన్స్, డేమర్ రీసర్చ్ అండ్ కన్సల్టెన్సీ సాఫ్ట్వేర్ కంపెనీల ప్రతినిధులు పాల్గొని ఇంటర్వ్యూలు చేపడుతారని వివరించారు.
బీఈ, బీటెక్, ఎంసీఏ, ఎంబీఎ, ఎమ్మెస్సీ, ఎంకాం, బీకాం కంప్యూటర్స్, బీఎస్సీ కంప్యూటర్స్, బీసీఏ, బీబీఎం తదితర డిగ్రీలు ఉన్న వారు హాజరు కావాలన్నారు. ఇంటర్వ్యూలు మధ్యాహ్నం 12 నుంచి సాయంత్రం 6 గంటల వరకు నిర్వహిస్తారని చెప్పారు. వివరాలకు 73967 11803, 99592 48359, 94413 81867 నంబర్లు సంప్రదించాలని సూచించారు.