వ్యభిచారం గుట్టు రట్టు
టీడీపీ కౌన్సిలర్‌కు చెందిన లాడ్జిలో అసాంఘిక కార్యకలాపాలు
అర్ధరాత్రి పోలీసుల ఆకస్మిక తనిఖీలు
వ్యభిచారం చేస్తున్న తొమ్మిది మంది నిందితుల గుర్తింపు
పోలీసుల అదుపులో ఏడుగురు యుువకులు, ఇద్దరు వుహిళలు
పిడుగురాళ్ళ: పట్టణంలోని ఓ కల్యాణ మండపంలో గుట్టు చప్పుడు కాకుండా నిర్వహిస్తున్న వ్యభిచారం పోలీసుల తనిఖీలతో బట్టబయలైంది. ఇద్దరు మహిళ లను, ఏడుగురు యువకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సేకరించిన వివరాల ప్రకారం.. పిడుగురాళ్ళ పట్టణానికి చెందిన టీడీపీ కౌన్సిలర్, మున్సిపల్ చైర్పర్సన్ భర్త అయిన భవనాశి ఎల్లారావు స్థానిక ఆర్టీసీ బస్టాండ్ ఎదుట కల్యాణ మండపం, దానిపై బాలాజీ రెసిడెన్సీ పేరుతో ఓ హోటల్ నిర్వహిస్తున్నాడు. వీటిల్లో అసాంఘిక కార్యకలాపాలు జరుగుతున్నాయనే సమాచారంతో ఆదివారం అర్ధరాత్రి దాటాక ఒంటి గంట సమయంలో పట్టణ సీఐ సుబ్బారావు సిబ్బందితో వెళ్లి లాడ్జి, కల్యాణ మండపాల్లో ఆకస్మిక తనిఖీలు చేశారు. ఈ క్రమంలో అక్కడ వ్యభిచారం నిర్వహిస్తున్న ఇద్దరు మహిళలు, ఏడుగురు యువకులను గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. దీంతో ఇంతకాలం రాజకీయ అండదండలతో గుట్టుగా సాగుతున్న వ్యవహారం బహిర్గతమైంది. సోమవారం పట్టణంలో ఏ నలుగురు కలిసినా ఈ లాడ్జిలో వ్యభిచారం జరుగుతుందన్న విషయూన్నే చర్చించుకోవడం విశేషం.
పోలీసులపై ఒత్తిళ్లు..
ధైర్యంగా దాడులు చేసిన పోలీసులు తీరు పట్ల ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నప్పటికీ ఓ వైపు అధికార పార్టీ ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారుల నుంచి ఒత్తిళ్లు వస్తుండటంతో తనిఖీల్లో పట్టుబడిన వారిని మీడియూ ఎదుట ఉంచడానికి పోలీసులు వివుుఖత చూపిస్తున్నారు. వారం రోజుల కిందట సున్నం బట్టీల వద్ద వ్యభిచారం నిర్వహిస్తున్న వుుగ్గురు వుహిళలు, ఆరుగురు యుువకులను అదుపులోకి తీసుకున్న స్థానిక పోలీసులు, వారిని వెంటనే మీడియూ దృష్టికి తీసుకువచ్చారు. ఇప్పుడు పట్టుబడినవారు పలుకుబడి ఉన్న వ్యక్తుల కువూరులు కావడంతో వీరందరినీ పట్టణ పోలీస్‌స్టేషన్‌లో ఓ గదిలో రహస్యంగా ఉంచారు. మీడియూను కూడా అనుమతించకపోవడంతో పలు అనువూనాలకు తావిస్తోంది. దీనిపై సీఐ సుబ్బారావు మాట్లాడుతూ తాము అదుపులోకి తీసుకున్న నిందితులందరినీ కోర్టులో హాజరు పరచనున్నట్లు చెప్పారు.
ఎల్లారావు అరెస్టుకు డిమాండ్
వ్యభిచార గృహాన్ని నిర్వహిస్తున్న ఎల్లారావును వెంటనే అరెస్టు చేయూలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జంగా కృష్ణవుూర్తి డివూండ్ చేశారు. పట్టణ పోలీస్‌స్టేషన్‌లో సీఐ సుబ్బారావును కలసి మాట్లాడుతూ అధికార, ధన బలం ఉందన్న ధీవూతో కల్యాణ మండపంపైనే లాడ్జిని పెట్టి అసాంఘిక కార్యకలాపాలను ప్రోత్సహిస్తున్న వ్యక్తిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.