'బల్జిత్ సింగ్ చనిపోవడం దురదృష్టకరం'
విశాఖపట్టణం: ఉగ్రదాడిలో పంజాబ్ ఎస్పీ బల్జిత్ సింగ్ చనిపోవడం దురదృష్టకరమని విశాఖపట్నం పోలీస్ కమిషనర్ అమిత్ గార్గ్ అన్నారు. బల్జిత్ సింగ్ కుటుంబానికి తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. సోమవారం ఆయన విశాఖపట్టణంలో మీడియాతో మాట్లాడారు. విశాఖలో ఇప్పటికే హై అలర్ట్ ప్రకటించామన్నారు. అదే విధంగా నగరంలో వాహనాల తనిఖీలు నిర్వహిస్తున్నామని తెలిపారు. ఈ సందర్భంగా విశాఖకు వచ్చే ప్రముఖులకు భద్రతా ఏర్పాట్లపై పరిశీలిస్తున్నామని చెప్పారు.