Ball tempering
-
దెబ్బ అదుర్స్.. ఒక్క ఇన్నింగ్స్‌తో అన్నింటికి చెక్
గత కొన్నిరోజులుగా ఆస్ట్రేలియా క్రికెట్ మీడియాలో డేవిడ్ వార్నర్ పేరు హాట్ టాపిక్. కారణం కెప్టెన్సీ విషయంలో క్రికెట్ ఆస్ట్రేలియాతో సున్నం పెట్టుకోవడమే. 2018లో బాల్ టాంపరింగ్ వివాదం అతని మెడకు చుట్టుకొని రెండేళ్ల నిషేధంతో పాటు ఆసీస్‌కు కెప్టెన్ కాకుండా లైఫ్‌టైమ్ బ్యాన్ విధించింది. అయితే తనపై కెప్టెన్సీ లైఫ్‌టైమ్ బ్యాన్ ఎత్తివేయాలంటూ క్రికెట్ ఆస్ట్రేలియాకు అప్పీల్ చేసుకుంటే కనీసం పట్టించుకున్న పాపాన పోలేదు. సొంత బోర్డు నుంచే కనీస మద్దతు కరువవడంతో తెగ బాధపడిపోయిన వార్నర్..'' మీ కెప్టెన్సీకో దండం.. నా అప్పీల్‌ను వెనక్కి తీసుకుంటున్నాని.. ఇకపై ఆ విషయం కూడా ఎత్తను'' అంటూ క్రికెట్ ఆస్ట్రేలియాపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాడు. వార్నర్ తీరుపై స్పందించిన క్రికెట్ ఆస్ట్రేలియా.. ''కెప్టెన్సీ కాదు ముందు మీ ఆటతీరులో దమ్ము చూపించండి.. అప్పుడు కెప్టెన్సీపై చర్చకు రండి'' అంటూ పరోక్షంగా వార్నర్‌కు సవాల్ విసిరింది. నిజానికి వార్నర్ కూడా అంత గొప్ప ఫామ్‌లో అయితే లేడనే చెప్పాలి. ఇటీవలే ముగిసిన టి20 వరల్డ్‌కప్‌లోనూ వార్నర్ పెద్దగా ప్రభావం చూపించింది లేదు. అందునా టెస్టుల్లో వార్నర్ మెరిసి చాలా కాలమైపోయింది. వార్నర్ బ్యాట్ నుంచి శతకం జాలువారి మూడేళ్లు కావొస్తుంది. దీనికి తోడు ఆటను పక్కనబెట్టి కెప్టెన్సీ అంశంపై క్రికెట్ ఆస్ట్రేలియాతో సున్నం పెట్టుకోవడం సొంత అభిమానులకు కూడా నచ్చలేదు. అన్ని వైపుల నుంచి వార్నర్‌పై తీవ్ర విమర్శలు వ్యక్తమయ్యాయి. క్రికెట్ ఆస్ట్రేలియా చేసిన కామెంట్స్‌ను వార్నర్ సీరియస్‌గా తీసుకున్నాడనిపించింది. ఒకే ఒక్క ఇన్నింగ్స్‌తో తనపై వస్తున్న విమర్శలన్నింటికి చెక్ పెట్టాడు. మెల్బోర్న్ వేదికగా దక్షిణాఫ్రికాతో ప్రారంభమైన రెండో టెస్టు వార్నర్ కెరీర్లో వందో టెస్టు కావడం విశేషం. తన వందో టెస్టులో సెంచరీతో మెరిసి అన్నింటికి సమాధానం చెప్పాలనుకున్నాడు. అనుకున్నట్లుగానే తన పంతం నెరవేర్చుకున్నాడు డేవిడ్ వార్నర్. శతకంతో మెరవడమే సూపర్ అనుకుంటే.. ఏకంగా డబుల్ సెంచరీతో కథం తొక్కి సరికొత్త రికార్డులు నెలకొల్పాడు. దాదాపు 1089 రోజులు శతకం లేకుండా కొనసాగిన వార్నర్ ఇన్నింగ్స్‌లకు ఇది మరో టర్నింగ్ పాయింట్ అని చెప్పొచ్చు. ఏ బోర్డు అయితే తనకు సవాల్ విసిరిందో అదే బోర్డుతో చప్పట్లు కొట్టించుకున్నాడు వార్నర్. ఇది అందరికి సాధ్యం కాదు. కచ్చితంగా వార్నర్ కెరీర్లో ఈ ఇన్నింగ్స్ ఎప్పటికి మధురానుభూతిగా మిగిలిపోతుందనడంలో సందేహం లేదు. A double century for David Warner! But his #OhWhatAFeeling jump comes at a cost! 😬#AUSvSA | @Toyota_Aus pic.twitter.com/RqJLcQpWHa — cricket.com.au (@cricketcomau) December 27, 2022 చదవండి: వారీ ఎంత పని జరిగే.. గట్టిగా తాకుంటే ప్రాణం పోయేదే! -
'మానసిక వేదనకు గురయ్యా'.. సొంత బోర్డుపై ఆగ్రహం
ఆస్ట్రేలియా సీనియర్ క్రికెటర్ డేవిడ్ వార్నర్ శనివారం సొంత బోర్డు.. క్రికెట్ ఆస్ట్రేలియాపై విమర్శనాస్త్రాలు సంధించాడు. కెప్టెన్ అయ్యే అవకాశం లేకుండా లైఫ్‌టైమ్ బ్యాన్ విధించడంపై అప్పీల్‌కు వెళ్తే కనీస మద్దతు లభించకపోవడం దారుణమని పేర్కొన్నాడు. ఇటీవలే వెస్టిండీస్‌తో ముగిసిన టెస్టు సిరీస్‌లో ఈ అంశం నన్ను మానసిక వేదనకు గురి చేసిందని ఆవేదన వ్యక్తం చేశాడు. 2018లో కేప్‌టౌన్ వేదికగా సౌతాఫ్రికాతో జరిగిన టెస్టు మ్యాచ్‌లో బాల్ టాంపరింగ్(SandpaperGate) వివాదం రేపిన సంగతి తెలిసిందే. ఈ వివాదంలో అప్పటి కెప్టెన్ స్టీవ్ స్మిత్, వైస్ కెప్టెన్ డేవిడ్ వార్నర్, కామెరున్ బెన్‌క్రాప్ట్‌లు కలిసి బాల్ టాంపరింగ్‌కు పాల్పడినట్లు ఆరోపణలు రావడంతో వారిపై నిషేధం పడింది. ఈ నేపథ్యంలో డేవిడ్ వార్నర్‌పై ఏడాది నిషేధంతో పాటు కెప్టెన్ కాకుండా లైఫ్‌టైమ్ బ్యాన్ విధించింది. ఇటీవలే వెస్టిండీస్ పర్యటన సందర్భంగా.. రెండో టెస్టుకు ముందు వార్నర్ తన కెప్టెన్సీపై లైఫ్‌టైమ్ బ్యాన్ ఎత్తేయాలంటూ క్రికెట్ ఆస్ట్రేలియాకు అప్పీల్ చేశాడు. దానిపై అతను బోర్డుతో తీవ్రంగా పోరాడినప్పటికి మద్దతు కరువయిపోయింది. అయితే తన వాదనలను బోర్డు ఎదుట చెప్పేందుకు సిద్ధమని.. కానీ బోర్డు మాత్రం బహిరంగంగా చర్చించాలని పట్టుబట్టింది. ఇదంతా నా ఫ్యామిలీని ఇబ్బంది పెట్టే అంశంలా కనిపించింది. అందుకే కెప్టెన్సీ బ్యాన్‌ను ఎత్తేయాలనే అభ్యర్థనను వెనక్కి తీసుకుంటున్నట్లు తెలిపాడు. ఈ నిర్ణయం వార్నర్‌ను మానసిక వేదనకు గురి చేసింది. ఆ ప్రభావం ఆటపై కూడా పడింది. పెర్త్ వేదికగా జరిగిన తొలి టెస్టులో 5, 48 పరుగులు మాత్రమే చేయగలిగాడు. తాజాగా వార్నర్ క్రికెట్ ఆస్ట్రేలియాపై పరోక్షంగా ఆగ్రహం వ్యక్తం చేశాడు.'' కొంతమంది పనిగట్టుకొని నన్ను ఇబ్బందులకు గురి చేస్తున్నారు. ఎంతలా అంటే అది నా ఆటపై తీవ్ర ప్రభావం చూపించింది. కెప్టెన్సీపై లైఫ్‌టైమ్ బ్యాన్ ఎత్తేయాలని అప్పీల్ చేస్తే బోర్డు నుంచి మద్దతు కరువయింది. ఇది నన్ను మానసిక వేదనకు గురి చేసింది. నావైపు నుంచి సమస్యను విన్నవించుకున్నప్పటికి.. క్రికెట్ ఆస్ట్రేలియా పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి నాకు ఎలాంటి మద్దతు రాలేదు. నా జట్టు సహచరులు, సిబ్బంది నుంచి మంచి సపోర్ట్ ఉన్నప్పటికి క్రికెట్ ఆస్ట్రేలియాకు నేను కెప్టెన్ అవ్వడం ఇష్టం లేదని స్పష్టంగా అర్థమైంది. ఇది నాకు నిజంగా కష్టకాలంలా ఉంది. దీని నుంచి బయటపడేందుకు ప్రయత్నిస్తున్నా.'' అంటూ చెప్పుకొచ్చాడు. ఇక సౌతాఫ్రికాతో బాక్సింగ్ డే టెస్టు ద్వారా డేవిడ్ వార్నర్ టెస్టుల్లో మరో మైలురాయిని అందుకోనున్నాడు. మెల్బోర్న్ వేదికగా జరగనున్న ఈ టెస్టు మ్యాచ్ వార్నర్‌కు వందో మ్యాచ్ కానుంది. అయితే జనవరి 2020 నుంచి వార్నర్ బ్యాట్ నుంచి ఒక్క టెస్టు సెంచరీ కూడా రాలేదు. ప్రస్తుతం జట్టులో సీనియర్ క్రికెటర్‌గా ఉన్న వార్నర్.. ఆస్ట్రేలియా తరపున ఇప్పటివరకు 99 టెస్టులు, 141 వన్డేలు, 99 టి20 మ్యాచ్‌లు ఆడాడు. చదవండి: Virat Kohli: శ్రుతి మించిన బంగ్లా ఆటగాళ్ల చర్య.. కోహ్లి ఆగ్రహం షాహిద్ అఫ్రిదికి పీసీబీలో కీలక బాధ్యతలు -
లార్డ్స్ టెస్ట్ మ్యాచ్‌లో ఇంగ్లండ్ బాల్ టాంపరింగ్ చేసిందా?
లార్డ్స్: టీమిండియాతో జరుగుతున్న రెండో టెస్ట్ మ్యాచ్‌లో ఇంగ్లండ్ ఆటగాళ్లు బాల్ టాంపరింగ్‌కు పాల్పడినట్లు వార్తలు వస్తున్నాయి. రెండో ఇన్నింగ్స్‌లో భారత్ జిడ్డు బ్యాటింగ్ కొనసాగిస్తుండడంతో వికెట్లు తీయడంలో ఇబ్బంది పడుతున్న ఇంగ్లండ్ బంతి ఆకారాన్ని మర్చే ప్రయత్నం చేసినట్లు తెలుస్తుంది. దీనికి సంబంధించిన కొన్ని ఫోటోలు, వీడియో ట్విటర్లో ప్రత్యక్షమయ్యాయి. అయితే ఆ ఫోటోల్లో మొహాలు చూపించకపోవడంతో ఆటగాళ్లు ఎవరనేది కనిపెట్టడం కష్టంగా మారింది. ఇక వీడియోలో బంతిని ఉద్దేశపూర్వకంగా కింద పడేసి.. బూట్లతో తన్నుతూ.. బూట్ల స్పైక్స్‌తో అదిమి తొక్కుతూ... ఆకారాన్ని మార్చేందుకు ప్రయత్నించడం టీవీల్లో స్పష్టంగా కనిపించింది. ఇది చూసిన భారత అభిమానులు ఉద్దేశపూర్వకంగా బాల్ టాంపరింగ్కి పాల్పడిన ఇంగ్లాండ్ ప్లేయర్లపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. దీనిపై ఐసీసీ ఎలా రియాక్టవుతుందో చూడాలి. ఇక క్రికెట్లో బాల్‌టాంపరింగ్ ఉదంతం అనగానే మొదటగా గుర్తుకు వచ్చేది ఆసీస్ ఆటగాళ్లు. 2018 కేప్‌టౌన్ టెస్ట్‌లో సాండ్ పేపర్ విధానంతో బెన్ క్రాప్ట్ బాల్‌టాంపరింగ్‌కు పాల్పడి కెమెరాలకు అడ్డంగా దొరికిపోయాడు. అయితే ఈ ఉదంతంలో అప్పటి కెప్టెన్ స్టీవ్ స్మిత్, వైస్ కెప్టెన్ డేవిడ్ వార్నర్ హస్తం కూడా ఉందని తెలియడంతో వారిద్దరిపై ఏడాది పాటు నిషేధం విధించిన ఐసీసీ బెన్‌క్రాఫ్ట్‌పై తొమ్మిది నెలల నిషేధం విధించింది. ఆసీస్ క్రికెటర్లు చేసిన బాల్ టాంపరింగ్ ఉదంతం క్రికెట్ కెరీర్లో మాయని మచ్చగా మిగిలిపోయింది. ఇక రెండో టెస్టు మ్యాచ్‌లో టీమిండియా రెండో ఇన్నింగ్స్‌లో నిలకడైన ఆటతీరు ప్రదర్శిస్తుంది. టాపార్డర్ విఫలమైన వేళ రహానే, పుజారాలు నెమ్మదైన ఆటను ప్రదర్శిస్తూ ఇంగ్లండ్ బౌలర్లకు చుక్కలు చూపిస్తున్నారు. ప్రస్తుతం టీమిండియా 64 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 121 పరుగులు చేసింది. పుజారా (33, 180 బంతులు), రహానే( 33, 106 బంతులు) క్రీజులో ఉన్నారు. https://t.co/2CqnuowAqq — GurPreet ChAudhary (@GuriChaudhary77) August 15, 2021 -
బాల్ ట్యాంపరింగ్‌కు యత్నంచి బుక్కైన లంక బౌలర్
నాగ్‌పూర్: శ్రీలంక పేస్ బౌలర్ దసన్ షనక బాల్ ట్యాంపరింగ్ ప్రయత్నించి అడ్డంగా బుక్కయ్యాడు. రెండో టెస్ట్ రెండో రోజు టీమిండియా బ్యాట్స్‌మెన్ ఎంతకి అవుట్ కాకపోవడంతో చికాకు చెందిన షనక బాల్ ట్యాంపరింగ్‌కు యత్నించాడు. షనక వేసిన 50వ ఓవర్లో బాల్ ట్యాంపరింగ్‌కు ప్రయత్నించడం కెమెరాల్లో రికార్డైంది. ఈ విషయాన్ని మ్యాచ్ రిఫరీ డేవిడ్ బూన్ గుర్తించి ఐసీసీకి ఫిర్యాదు చేశాడు. ఐసీసీ కోడ్ ఆఫ్ కండక్ట్‌లో దీన్ని లెవల్ 2 ఉల్లంఘనగా పరిగణించి షనక మ్యాచ్ ఫీజులో 75 శాతం కోత విధించారు. బంతి కండీషన్‌ను మార్చేందుకు షనక ప్రయత్నించాడు. ఆటగాళ్లు, సహాయక సిబ్బంది కోసం ఉద్దేశించిన ఐసీసీ కోడ్ ఆఫ్ కండక్ట్‌లో ఆర్టికల్ 2.2.9ను ఇది ఉల్లఘించడమేనని ఐసీసీ స్పష్టం చేసింది. ఈ ఘటన కారణంగా షనక ఖాతాలో మూడు డీ మెరిట్ పాయింట్లను చేర్చారు. రెండేళ్ల వ్యవధిలో నాలుగు లేదా అంత కంటే ఎక్కువ డీ మెరిట్ పాయింట్లు పొందితే.. సదరు ఆటగాడు నిషేధానికి గురవుతాడు. షనక కెరీర్ ఆరంభంలో ఉన్నాడు. భవిష్యత్తులో ఇలాంటి తప్పిదాలు చేయకుండా జాగ్రత్త వహించాలని మ్యాచ్ రిఫరీ హెచ్చరించారు. రెండోస్థాయి ఉల్లంఘన కింద మ్యాచ్ ఫీజులో 50-100 శాతం వరకూ కోత విధించే అవకాశం ఉంది. దీంతో పాటు రెండు సస్పెన్షన్ పాయింట్లు కూడా విధించొచ్చు. దీని వల్ల ఒక టెస్ట్ మ్యాచ్ లేదా రెండు వన్డేలు లేదా రెండు టీ20ల్లో ఏదీ ముందు ఆడితే దానికి సదరు క్రికెటర్ దూరం అవుతాడు. -
పాక్ ఆరోపణలు సరైనవి కావు
కరాచీ: ఇటీవల ముగిసిన రెండో టెస్టులో బాల్ ట్యాంపరింగ్‌కు పాల్పడిన దక్షిణాఫ్రికా ఆల్‌రౌండర్ డుప్లెసిస్‌కు శిక్ష విధించడంలో అలసత్వం చూపారని పాక్ క్రికెట్ బోర్డు (పీసీబీ) చేసిన ఆరోపణలను ఐసీసీ తోసిపుచ్చింది. క్రికెటర్ మ్యాచ్ ఫీజులో 50 శాతం కోత విధిస్తూ మ్యాచ్ రిఫరీ డేవిడ్ బూన్ తీసుకున్న చర్యను ఐసీసీ సమర్థించుకుందని పీసీబీ వర్గాలు వెల్లడించాయి. ఇందుకోసం ట్యాంపరింగ్‌కు సంబంధించి సవరించిన నిబంధనలను సాకుగా చూపెడుతోందని విమర్శించారు. ‘ఈ మొత్తం ఉదంతంలో బూన్... డుప్లెసిస్పై దయ చూపారు. 2010లో పెర్త్ వన్డేలో ఆఫ్రిది ట్యాంపరింగ్‌కు పాల్పడితే రెండు టి20 మ్యాచ్‌ల నిషేధం విధించారు. అప్పటి సంఘటన, ఇప్పటిది రెండు ఒకేలా ఉన్నప్పుడు శిక్షలో మాత్రం తేడా ఎందుకు అని మేం ప్రశ్నిస్తున్నాం. రెండో టెస్టులో మరికొంత మంది ప్రొటీస్ ఆటగాళ్లూ ట్యాంపరింగ్‌కు పాల్పడ్డారు. దీనిపై ఐసీసీ స్పందించిన తీరూ ఏమాత్రం బాగాలేదు. మ్యాచ్ రిఫరీ తీర్పును సమర్థించడమే పనిగా పెట్టుకుంది’ అని పీసీబీ వర్గాలు పేర్కొన్నాయి. ప్రతి ఒక్కరూ చేస్తారు: ముస్తాక్ మహ్మద్ కరాచీ: ప్రతి జట్టు, ప్రతి బౌలర్ ఏదో ఓ సమయంలో బాల్ ట్యాంపరింగ్‌కు పాల్పడతారని పాక్ మాజీ కెప్టెన్, కోచ్ ముస్తాక్ మహ్మద్ అన్నారు. దీని గురించి ఎందుకు ఆందోళన చెందుతున్నారో అర్థం కావడం లేదన్నారు. ‘బంతిపై మంచి గ్రిప్ లభించేందుకు స్పిన్నర్లు కూడా సీమ్‌ను తొలగించేందుకు ప్రయత్నిస్తారు. కొన్నిసార్లు నేను కూడా అలా చేశా. ఇది కూడా ఓ రకమైన ట్యాంపరింగే. ఏ జట్టయినా ఇలా చేయడం సర్వసాధారణం. అయితే ట్యాంపరింగ్ చేసిన ప్రతిసారి వికెట్లు పడతాయనుకోవడం పొరపాటు. రివర్స్ స్వింగ్ నైపుణ్యం ఉంటే బౌలర్లకు బాగుంటుంది’ అని ముస్తాక్ వివరించారు.