సమాజంలోని అసమానతలు రూపుమాపాలి
బామ్సెఫ్ రాష్ట్ర అధ్యక్షులు చెన్నయ్య
కరీంనగర్: సమాజంలోని అసమానతలు రూపుమాపాలని బామ్సెఫ్ రాష్ట్ర అధ్యక్షుడు బి.చెన్నయ్య అన్నారు. ఆదివారం రెవెన్యూ గార్డెన్లో జరిగిన తెలంగాణ రాష్ట్ర బామ్సెఫ్ మూడో రాష్ట్ర మహాసభలో ఆయన మాట్లాడుతూ బహుజన పితామహులు మహత్మా జ్యోతిబాపూలే, సాహుమహారాజ్, అంబేద్కర్ సిద్ధాంతాలను నిమ్నవర్గాలకు అందజేస్తూ సమాజ రుగ్మతలను పారదోలేందుకు విద్యావంతులు ముందుకు రావాలని సూచించారు. సమాజాన్ని చైతన్యపర్చడంలో బామ్‌సేప్ కార్యకర్తలు అగ్రభాగాన నిలవాలని కోరారు. బ్రిటిష్ ప్రభుత్వం, బ్రాహ్మణులతో పోరాడి బాబాసాహెబ్ అంబేద్కర్ కమ్యూనల్ అవార్డును సాధించారని, పూనా ఒప్పందం పేరుతో గాంధీ సాధించిన హక్కులను లాక్కున్నారని ఆరోపించారు. ఎస్సీ,ఎస్టీ,బీసీలు హక్కుల సాధన కోసం దమాషా ప్రకారం పోరాడాలని సూచించారు. ఈ కార్యక్రమంలో బామ్‌సేఫ్ ప్రతినిధులు జనాబ్ ఆహ్మద్ మహ్మద్ సాహెబ్, దాసురాం నాయక్, రేవెల్లి శంకర్, ప్రొఫెసర్ ఎల్లన్నయాదవ్, ఎన్.దేవేందర్(ఎస్టీఓ), అమరేందర్, నాగెల్లి దేవేందర్, సుదర్శనం, కట్టెకోల లక్ష్మణ్‌తో పాటు తదితరులు పాల్గొన్నారు.