'మ్యాగీకి క్లీన్చిట్ ఇవ్వలేదు'
మ్యాగీ నూడుల్స్ విషయంలో తాము ఇంతవరకు నెస్లె ఇండియా కంపెనీకి ఎలాంటి క్లీన్ చిట్ ఇవ్వలేదని భారత ఆహార భద్రతా నియంత్రణ సంస్థ తెలిపింది. కర్ణాటకలోని ఓ ల్యాబ్ మ్యాగీ సురక్షితమేనని చెప్పినా కూడా.. జూన్ 5వ తేదీన మ్యాగీపై తాము విధించిన నిషేధం ఇప్పటికీ అమలులోనే ఉన్నట్లు స్పష్టం చేసింది. వాస్తవానికి అసలు ఎఫ్ఎస్ఎస్ఏఐ సంస్థ మ్యాగీ నూడుల్స్కు ఎలాంటి క్లీన్ చిట్ ఇవ్వనే లేదని ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా సంస్థ ఓ ప్రకటనలో తెలిపింది.
యూకే, సింగపూర్ దేశాల్లో చేయించామని చెబుతున్న పరీక్షల వివరాలను నెస్లె ఇండియా కంపెనీ ఇంతవరకు తమకు ఇవ్వలేదని అన్నారు. అయితే... నెస్లె కంపెనీ మాత్రం ఆయా దేశాల్లో చేసిన పరీక్షల్లో మ్యాగీ తినేందుకు సురక్షితమేనని తేలినట్లు చెబుతోంది.