ban on Pakistan
-
పాకిస్థాన్ ఓటీటీపై నిషేధం.. ఎందుకంటే?
పాకిస్థాన్‌కు చెందిన ఓటీటీ ఫ్లాట్‌ఫామ్‌పై భారత ప్రభుత్వం ఆగ్రహం వ్యక్తం చేసింది. పాక్‌కు చెందిన 'విడ్లీ టీవీ' అనే ఓటీటీ ఫ్లామ్ఫామ్ను నిషేధిస్తున్నట్లు వెల్లడించింది. దీంతో పాటు మరో రెండు మొబైల్ అప్లికేషన్లు, నాలుగు సోషల్ మీడియా ఖాతాలు, స్మార్ట్ టీవీ యాప్‌లపై కూడా నిషేధం విధించింది. ఇటీవల విడ్లీ టీవీ ఓటీటీలో విడుదలైన 'సేవక్: ది కన్ఫెషన్స్' అనే వెబ్ సిరీస్‌లో భారతదేశ సమగ్రతకు, సార్వభౌమత్వానికి, భద్రతకు ముప్పు తెచ్చేలా కంటెంట్ ఉందని కేంద్రం వెల్లడించింది. ఓటీటీలో విడుదలైన మూడు ఎపిసోడ్లు దేశ సమగ్రతను దెబ్బతీసేలా ఉన్నాయని పేర్కొంది. వెబ్ సిరీస్‌లో ప్రసారమవుతున్న కంటెంట్ భారత చారిత్రక ఘటనలపై వ్యతిరేకతను పెంచేలా ఉందని.. పూర్తి అవాస్తవాలతో ప్రసారం చేస్తున్నారని భారత సీనియర్ అధికారి కంచన్ గుప్తా తన ట్విటర్లో వెల్లడించారు. IMPORTANT Ministry of Information & Broadcasting, using emergency powers under IT Rules 2021, has issued directions on 12 December 2022 for immediate blocking of the website, 2 mobile apps, 4 social media accounts, and one smart TV app of #Pakistan-based OTT Platform Vidly TV. n1 — Kanchan Gupta 🇮🇳 (@KanchanGupta) December 12, 2022 -
ట్రంప్‌గారు మా దేశంపై నిషేధం విధించండి!
లాహోర్: అమెరికాలోకి ముస్లింల రాకపై అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తాజా ఆదేశాల నేపథ్యంలో క్రికెటర్, పాకిస్థాన్ ప్రతిపక్ష నేత ఇమ్రాన్ ఖాన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అమెరికాకు రాకుండా పాకిస్థానీయులపై కూడా ట్రంప్ నిషేధం విధిస్తారని ఆశిస్తున్నానని, దీనివల్ల పాకిస్థానీలు తమ దేశాన్ని అభివృద్ధి చేసుకునే అవకాశముందని ఆయన పేర్కొన్నారు. 'చాలామంది పాకిస్థానీలు కూడా అమెరికా వీసా ఆంక్షలు ఎదుర్కొంటున్నట్టు తెలుస్తోంది. పాకిస్థానీలకు వీసాలు ఇవ్వొద్దని ట్రంప్‌కు నేను విజ్ఞప్తి చేస్తున్నాను. ఇది మాకు మేలు చేస్తుంది. మేం మా దేశాన్ని అభివృద్ధి చేసుకుంటాం' అని ఆయన అన్నారు. ఏడు ముస్లిం మెజారిటీ దేశాల పౌరులు అమెరికాకు రాకుండా ట్రంప్ సర్కారు నిషేధం విధించిన సంగతి తెలిసిందే. అదేవిధంగా పాకిస్థాన్‌పై కూడా భవిష్యత్తులో నిషేధం విధించే అవకాశముందని వైట్‌హౌస్ స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో ఇమ్రాన్ ఖాన్ చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. పాక్ ప్రధాని నవాజ్ షరీఫ్ తలనొప్పి వచ్చినా విదేశాలకు వెళుతున్నారని, అమెరికా పాకిస్థానీయులపై నిషేధం విధిస్తే ఈ పరిస్థితి మారి.. ఆయన దేశాభివృద్ధిపై దృష్టి సారించే అవకాశముందని పేర్కొన్నారు.