వైఎస్సార్సీపీ, లెఫ్ట్ ఉమ్మడి పోరుబాట!
సాక్షి, అమరావతి బ్యూరో: బందరుపోర్టు నిర్మాణం ముసుగులో ల్యాండ్ పూలింగ్ పేరుతో పేదల కడుపు కొట్టి సాగు భూములు లాగేసుకుంటున్న సీఎం చంద్రబాబు వైఖరికి నిరసనగా ప్రతిపక్షనేత, వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి పోరాటానికి వామపక్ష పార్టీలనేతలు జతకలిశారు. కృష్ణా జిల్లాలోని మచిలిపట్నం మండలం బుద్దాలపాలెం, కోన గ్రామాల్లో గురువారం వైఎస్ జగన్ పర్యటన సందర్భంగా జరిగిన కార్యక్రమాలలో సీపీఐ జిల్లా కార్యవర్గసభ్యులు మోదుమోడి రామారావు, సీపీఎం మచిలీపట్నం పట్టణ కార్యదర్శి కొడాలి శర్మలు పాల్గొన్నారు. రైతులకు జరుగుతున్న అన్యాయానికి నిరసనగా వైఎస్సార్సీపీ, వామపక్షాలు జెండాలు పక్కన పెట్టి సమైక్యంగా పోరాటాలకు కలసిరావడంపై ప్రజల్లోనూ, పోర్టు బాధిత రైతాంగంలోనూ హర్షం వ్యక్తమౌతోంది.