bandhavgarh tiger reserve
-
అయ్యో గజరాజా.. 48 గంటల్లో ఎనిమిది అనుమానాస్పద మృతి
భోపాల్: మధ్యప్రదేశ్‌లోని బాంధవ్‌ఘర్ టైగర్ రిజర్వ్‌లో 48 గంటల్లో ఎనిమిది ఏనుగులు మృతి కలకలం రేపుతోంది. ఇప్పటికే మంగళవారం ఏడుగురు మృతి చెందగా, నిన్న (బుధవారం)మరో ఏననుగు మృతదేహం లభించినట్లు అధికారులు తెలిపారు. మృతిచెందిన ఏనుగుల్లో ఏడు ఏనుగులు.. ఒక్కొక్కటి మూడు ఏళ్ల వయస్సు గలవి ఉన్నాయి. ఎనిమిదో ఏనుగ ఐదేళ్ల మగ ఏనుగుగా అధికారులు గుర్తించారు. మొత్తం 13 మంది ఏనుగుల్లో తొమ్మిదో ఏనుగు పరిస్థితి విషమంగా ఉందని వన్యప్రాణి అధికారులు పేర్కొన్నారు. వైద్యసేవలు పొందిన పదో కోలుకున్నట్లు తెలిపారు. ఇక.. మిగిలిన మూడు ఏనుగుల నిశితంగా పరిశీలిస్తున్నామని పేర్కొన్నారు. ఈ ఏనుగుల మృతిపై.. ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్‌లతో కూడిన ఐదుగురు సభ్యుల బృందం స్వతంత్ర విచారణను చేపట్టింది. విచారణ నివేదికను 10 రోజుల్లో సమర్పించనుంది. ఏనుగుల మృతికి ప్రాథమిక కారణం విషంగా అధికారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఏనుగు కళేబరాలు ఉన్న ప్రాంతంలోని ఐదుగురి వ్యక్తులను వన్యప్రాణి అధికారులు ప్రశ్నిస్తున్నారు. దర్యాప్తు ప్రాంతం ఐదు కిలోమీటర్ల పరిధిలో విస్తరించి ఉందని తెలిపారు. కుక్కల స్క్వాడ్‌తో సహా 100 మంది అటవీ అధికారులు ఏనుగులు మృతి చెందిన ప్రాంతాన్ని పరిశీలిస్తున్నారు. కోడో మిల్లెట్ గింజలను ఏనుగులు తిన్నాయా అనే విషయంపై అధికారులు విచారణ జరుపుతున్నారు. కోడో మిల్లెట్ గింజలు ఫంగస్‌తో కలుషితమైతే సైక్లోపియాజోనిక్ యాసిడ్ అనే విష పదార్థాన్ని ఉత్పత్తి చేస్తుంది.అందుకే.. మృతిచెందిన ఏనుగుల మలం నమూనాలను సేకరించినట్లు అధికారులు తెలిపారు. -
తల్లిప్రేమ ముందు పులి ఎంత!
పులి అనగానే అమ్మో అనుకుంటాం. కాని అమ్మ ముందు పులి బలమెంత! ఒక తల్లి తన బిడ్డను రక్షించుకోవడానికి పులితో పోరాడిన సాహసం సోషల్‌మీడియాలో వైరల్ అయింది... మధ్యప్రదేశ్‌లోని ఉమేరియా జిల్లాలోని బందవ్‌ఘర్ టైగర్ రిజర్వ్‌కు సమీపంలో రోహనియా అనే గ్రామం ఉంది. ఈ గ్రామానికి చెందిన అర్చన చౌదరికి పదిహేను నెలల కొడుకు రవిరాజ్. కొడుకు నవ్వితే నవ్వేంత, ఏడిస్తే ఏడ్చేంత ప్రేమ తనకు! కొన్ని నెలల క్రితం చీమ కుట్టి కొడుకు ఏడుస్తుంటే తాను కూడా ఏడ్చేసింది. ఈసారి మాత్రం చీమ కుట్టలేదు. పులి ఎదురైంది! బిడ్డను నోట కరుచుకుపోవడానికి రెడీ అయిపోయింది. అయితే ఇప్పుడు మాత్రం అర్చన ఏడ్వలేదు. వణికిపోలేదు. ఏం జరిగిందంటే... ఆరోజు రాత్రి బిడ్డ రవిరాజ్‌ను తీసుకొని ఇంటి నుంచి బయటికి వచ్చింది అర్చన. అక్కడి పొదల్లో ఒక పులి కాచుకొని కూర్చుంది. వీరిని చూడగానే బయటికి వచ్చింది. పిల్లాడిని దూరంగా ఎత్తుకుపోవడానికి ప్రయత్నించింది. అంతే... అర్చన తన శక్తినంతా కూడదీసుకొని పెద్దగా అరుస్తూ ఎదురుదాడి ప్రారంభించింది. అర్చన కేకలు విన్న గ్రామస్థులందరూ మెరుపు వేగంతో పరుగెత్తుకు వచ్చారు. వారిని చూసి పులి తోకముడిచి సమీపంలోని అడవిలోకి పారిపోయింది! తల, వీపు వెనుక గాయాలైన బిడ్డను, ఒళ్లంతా గాయాలైన తల్లిని గ్రామస్థులు వెంటనే హాస్పిటల్లో చేర్చడంతో ప్రమాదం నుంచి బయటపడ్డారు. ‘ఒక పులి టైగర్ రిజర్వ్ దాటి జనావాసాలలోకి వచ్చింది అని ప్రచారం చేస్తున్నాం. ఈ విషయం చాలామందికి తెలుసు’ అని అటవీశాఖ అధికారులు చెబుతున్నారుగానీ అదెంత వరకు నిజమో తెలియదు. ‘మాకు అలాంటి వార్త గురించి ఏమీ తెలియదు’ అని చెబుతున్నాడు అర్చన భర్త బోలా చౌదరి. అరుదుగా మాత్రమే ఊరు దాటేది అర్చన. అలాంటి అర్చన పేరు ఇప్పుడు ఊళ్లు, జిల్లాలు, రాష్ట్రాలు దాటింది. ‘తల్లి శక్తి ఏమిటో నిరూపించావు’ అని వేనోళ్ల కొనియాడుతున్నారు నెటిజనులు. ‘మా ఊళ్లోనే కాదు, ఇంకా చాలా ఊళ్లలో అర్చన పేరు గొప్పగా చెప్పుకుంటున్నారు. ఆమె సాహసం అద్భుతం. పులిని చూడగానే వణికిపోయి, భయపడి ఉంటే ఏం జరిగి ఉండేదో ఊహించడానికి కూడా భయంగా ఉంది. ఎంతోమంది తల్లులకు స్ఫూర్తిని ఇచ్చే సాహసం ఆమెది’ అంటుంది రోహనియ గ్రామానికి చెందిన కులుమతి. ఆరోజు అర్చన అరుపులు విని పరుగెత్తుకు వచ్చిన వారిలో కుష్వా అనే రైతు ఉన్నాడు. ‘అరుపులు వినగానే ప్రమాదాన్ని ఊహించి కట్టె తీసుకొని పరుగెత్తుకు వచ్చాను. అక్కడికి వెళ్లగానే విషయం అర్థమైంది. అందరం గట్టిగా అరుస్తూ ముందుకు వెళుతుంటే పులి భయపడి పారిపోయింది. తల్లీబిడ్డలను ఆ దేవుడే రక్షించాడు’ అంటున్నాడు కుష్వా. చాలామందికి మాత్రం అర్చన తన బిడ్డను రక్షించుకున్న దేవత. ఊరి జనాల నుంచి నెటిజనుల వరకు అర్చనా చౌదరి సాహసానికి అందరూ జై కొడుతున్నారు. -
అమ్మ లాంటి బొమ్మను చూసి...
-
అమ్మ లాంటి బొమ్మను చూసి...
చిన్న పిల్లలకు తల్లి దూరమైతే కలిగే బాధ చెప్పనలవి కాదు. కన్నతల్లి కానరాక.. అన్న పానీయాలు కూడా మానేస్తారు. మనుషులే కాదు.. జంతువులకు కూడా ఇది వర్తిస్తుంది. మధ్యప్రదేశ్‌లోని బాంధవ్‌గఢ్ టైగర్ రిజర్వ్ ప్రాంతంలో సరిగ్గా ఇలాగే జరిగింది. ఒక పెద్దపులి మూడు పిల్లలను కంది. ఆ తర్వాత అది రైతులు తమ పొలాల సంరక్షణ కోసం ఏర్పాటుచేసుకున్న కరెంటు కంచె తగిలి చనిపోయింది. దాంతో అప్పటివరకు తల్లి దగ్గరే అడవిలో పెరిగిన ఆ పులి పిల్లలకు ఒక్కసారిగా ఏం చేయాలో తెలియలేదు. మనుషులను నమ్మలేక.. బాటిళ్లలో ఇచ్చే పాలు తాగలేక రోజురోజుకూ అవి క్షీణించసాగాయి. వాటి ఆరోగ్యం కూడా బాగా ప్రమాదకరంగా మారడంతో ఏం చేయాలో అధికారులకు అర్థం కాలేదు. చివరకు వాళ్లలో ఒకరికి మంచి ఐడియా తట్టింది. రోడ్డు పక్కన అచ్చం పులిలాగే ఉండే సాఫ్ట్ టాయ్స్ అమ్ముతుండటం గుర్తుకొచ్చి, అలాంటి బొమ్మ ఒకదాన్ని తీసుకొచ్చి ఆ పులిపిల్లలున్న చోట పెట్టారు. సాధారణంగా గ్రామాల్లో దూడలు చనిపోయినప్పుడు ఆవులు, గేదెలు పాలివ్వవు. అలాంటప్పుడు గ్రామస్తులు వాటి దగ్గరలో ఆ దూడ మృతదేహాన్ని నిలబెట్టడం లేదా బొమ్మ దూడలను ఉంచడం చేస్తారు. అప్పుడు అవి పాలిస్తాయి. ఆ విషయం తెలిసిన మృదుల్ పాఠక్ అనే ఫీల్డ్ డైరెక్టర్ అదే ఆలోచనను ఇక్కడ కూడా అమలుచేశారు. అధికారులు ఆ పులిపిల్లలను చూసేసరికి అవి దాదాపుగా మరణానికి దగ్గరగా ఉన్నాయి. సాధారణంగా మనుషులకైతే వెంటనే సెలైన్ పెట్టడం లాంటి చర్యల ద్వారా వీలైనంత త్వరగా కోలుకునేలా చేస్తారు. కానీ జంతువుల విషయంలో అలా కుదరదు. వాటికి సూది గుచ్చిన వెంటనే విపరీతంగా భయపడతాయని, ఆ భయంతో వెంటనే చనిపోతాయని పాఠక్ వివరించారు. అందుకే వాటికి తప్పనిసరిగా నోటి ద్వారానే ఆహారం అందించాలన్నారు. దాంతో బొమ్మ పులి లోపల పాల బాటిళ్లను ఉంచి, బయటకు పాల తిత్తులు వచ్చేలా చేసి, వాటి ద్వారా ఆ పిల్లలకు పాలు అందించారు. నిజంగా అమ్మే పాలు పడుతోందని భావించిన ఆ పులిపిల్లలు.. పాలు తాగి ఎంచక్కా కోలుకున్నాయి, ఇప్పుడు చలాకీగా తిరుగుతున్నాయి.