బెంగళూరులో కామిక్ సంబరాలు
సాక్షి, బెంగళూరు : ఆర్కావతి లే అవుట్ విషయంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ప్రజాకోర్టులో హాజరుకావాలని రైతు సంఘం అధ్యక్షుడు కోడిహళ్లి చంద్రశేఖర్ డిమాండ్ చేశారు. శనివారమిక్కడ నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ....ఆర్కావతి లే అవుట్ కోసం దాదాపు 16 గ్రామాల భూములను ప్రభుత్వం సేకరించిందని తెలిపారు.
ఆ సమయంలో యడ్యూరప్ప ముఖ్యమంత్రిగా ఉన్నారని, సేకరించిన భూముల నుంచి దాదాపు 40 శాతం వరకు తిరిగి అభివృద్ధి పరిచిన భూములను రైతులకు అప్పగించాల్సిందిగా ఒప్పందం కుదుర్చుకున్నారని చెప్పారు. అయితే ఇలా అభివృద్ధి చేసిన భూముల్లో నిర్మించిన ఇళ్లను రైతులకు కాకుండా ఇతరులకు కేటాయించడం వివాదాస్పదంగా మారిందని అన్నారు. ఈ విషయంలో ప్రభుత్వం ఎన్ని విచారణలు జరిపినా అసలైన అక్రమార్కులపై ఎటువంటి చర్యలు తీసుకోలేక పోయారని విమర్శించారు.
ఇక స్వతహా ముఖ్యమంత్రి సిద్ధరామయ్యే ఆరోపణలు ఎదుర్కొంటున్నందున రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోని సంస్థలతో విచారణ చేయించడం ద్వారా ఎటువంటి ప్రయోజనం ఉండబోదని అన్నారు. అందువల్ల ఆర్కావతి లే అవుట్ అక్రమాలపై సీబీఐ విచారణకు ఆదేశించడంతో పాటు ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ప్రజా కోర్టులో హాజరుకావాలని డిమాండ్ చేశారు. భూములను పోగొట్టుకొని నష్టపోయిన రైతులు ప్రజాకోర్టులో అడిగే ప్రశ్నలకు సిద్ధరామయ్యే స్వయంగా సమాధానం చెప్పాలని కోరారు.