బెంగళూరు శుభారంభం
యూపీ వారియర్స్‌పై గెలుపు {పొ రెజ్లింగ్ లీగ్
న్యూఢిల్లీ: ప్రొ రెజ్లింగ్ లీగ్ (పీడబ్ల్యుఎల్)లో బెంగళూరు యోధ శుభారంభం చేసింది. శుక్రవారం ఉత్తరప్రదేశ్ (యూపీ) వారియర్స్‌తో జరిగిన పోరును పూర్తి ఏకపక్షంగా మారుస్తూ 6-1తో విజయం సాధించింది. స్టార్ రెజ్లర్ సందీప్ తోమర్ పురుషుల 57 కేజీ విభాగంలో 4-2తో రటుష్ణియ్ను ఓడించి జట్టుకు తొలి విజయాన్ని అందించాడు. ఆ తర్వాత 65 కేజీ విభాగంలో బజరంగ్ పూనియా 10-2తో రాహుల్ మాన్‌ను ఓడించి జట్టు ఆధిక్యాన్ని 2-0కు పెంచాడు. మహిళల 48 కేజీలో అలిసా లాంపే 5-4తో కోగుట్ ఒలెగ్జాండ్రాను.. పురుషుల 97 కేజీలో ఒలినిక్ 2-1 సత్యవర్త్‌ను.. మహిళల 58 కేజీలో రట్కేవిచ్ 4-1తో రీతూ మాలిక్‌ను ఓడించి 5-0తో ఆధిక్యాన్ని అందించారు. అయితే మహిళల 53 కేజీలో బబిత 8-2తో లలితా షెరావత్‌ను ఓడించి యూపీ వారియర్స్‌కు ఏకైక విజయాన్ని అందించింది. ఇక చివరి బౌట్ 74 కేజీ విభాగంలో నర్సింగ్ యాదవ్ 9-1తో ఉనుర్బట్ను చిత్తుచేసి బెంగళూరుకు ఘనవిజయాన్ని అందించాడు.