బంగూయిలో విధ్వంసకాండ: 300 మంది మృతి
సెంట్రల్ ఆఫ్రికన్ రిపబ్లికన్ రాజధాని బంగూయిలో గత రెండు రోజులుగా చోటు చేసుకున్న విధ్వంసకాండలో దాదాపు 300 మంది మరణించారని రెడ్ క్రాస్ సొసైటీ శనివారం ఇక్కడ వెల్లడించింది. ఆ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని తెలిపింది. మృతదేహలను ఏరివేత కార్యక్రమాన్ని చేపట్టినట్లు తెలిపింది.
శాంతి భద్రతలను పరిరక్షించే క్రమంలో భాగంగా ఇప్పటికే ఫ్రెంచ్ దళాలకు చెందిన వేలాది మంది భద్రత సిబ్బంది ఇప్పటికే బంగూయి చేరుకున్నారని వివరించింది. సెంట్రల్ ఆఫ్రికన్ రిపబ్లిక్న్ అధ్యక్షుడు ఫ్రాంకోయిస్ బొజీజ్ను ఇటీవల పదవి నుంచి తొలగించారు. దాంతో ఫ్రాంకోయిస్ అనుకూల వర్గానికి, వ్యతిరేక వర్గానికి మధ్య ఘర్షణలు చోటు చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ మేరకు బీబీసీ శనివారం వెల్లడించింది.