27లోగా రుణమాఫీ రైతుల వివరాలివ్వాలి
గుంటూరు ఈస్ట్ ఈనెల 27వ తేదీకల్లా బ్యాంకు ఖాతాల్లో తప్పులు సరిచేసి రుణమాఫీకి సంబంధించిన రైతుల వివరాలు ప్రభుత్వానికి అందించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. జిల్లా కలెక్టర్ కార్యాలయంలోని వీడియో కాన్ఫరెన్స్‌హాలులో శుక్రవారం ముఖ్యమంత్రి నిర్వహించిన వీడియో సమావేశానికి జిల్లా కలెక్టర్ కాంతీలాల్‌దండే, సంయుక్త కలెక్టర్ శ్రీధర్ తదితరులు హాజరయ్యారు. రాష్ట్ర ఫైనాన్స్ సెక్రటరీ ప్రేమ్‌చంద్రారెడ్డి మాట్లాడుతూ అర్హులై ఉండి, మంజూరుకాని రైతుల విషయంలో సాంకేతిక కారణాలను సెట్లో పెడుతున్నామని, వాటిని బ్యాంకర్లు అప్డేట్ చేసుకుని తిరిగి ప్రభుత్వానికి పంపాలని కోరారు.10లోగా నిర్దేశిత లక్ష్యాలు పూర్తిచేయాలి
సత్తెనపల్లి నియోజకవర్గంలో లక్ష్యంగా నిర్దేశించిన 16,692 వ్యక్తిగత మరుగుదొడ్లను వచ్చే నెల 10 లోగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ కాంతీలాల్ దండే అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్లోని డీఆర్సీ సమావేశ మందిరంలో శుక్రవారం నియోజక వర్గానికి చెందిన సత్తెనపల్లి,రాజుపాలెం,ముప్పాళ్ల,నకరికల్లు మండలాల అధికారులతో ఆయన మాట్లాడారు.
కిరోసిన్ అక్రమ తరలింపును నియంత్రించాలి
జిల్లాలో కిరోసిన్ అక్రమ తరలింపును నెల రోజుల్లోగా నియత్రించాలని సంయుక్త కలెక్టర్ చెరుకూరి శ్రీధర్ పౌర సరఫరాల అధికారులను ఆదేశించారు. పౌర సరఫరాల అధికారులతో శుక్రవారం తన చాంబర్లో నిర్వహించిన సమావేశంలో ఆయన నిత్యవసర సరుకుల సరఫరా విషయంపై సమీక్షించారు. జిల్లా పౌర సరఫరాల అధికారి శ్రీ రవితేజ నాయక్ ,సహాయ పౌర సరఫరాల అధికారులు, సీఎస్డీటీలు పాల్గొన్నారు.
నెలాఖరులోగా ఆధార్‌ను అనుసంధించాలి
రైతుల పట్టాదారు పాస్‌పుస్తకాలు, అడంగళ్లకు ఆధార్‌ను అనుసంధానం చేసే ప్రక్రియను ఈ నెలాఖరుకల్లా పూర్తి చేయాలని సంయుక్త కలెక్టర్ సీహెచ్ శ్రీధర్, ఆర్డీవో, తహశీల్దార్లను ఆదేశించారు. కలెక్టర్ కార్యాలయంలోని వీడియో కాన్ఫరెన్స్ హాలులో జేసీ శుక్రవారం జిల్లాలోని రెవెన్యూ అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మాన్యువల్‌గా ఇచ్చే ప్రక్రియను పూర్తిగా నిలుపుదల చేశామని, పట్టాదారు పాస్ పుస్తకాలను మీసేవ ద్వారానే పొందాలన్నారు.