బ్యాంకులో పనిచేసి..!
పెద్దనోట్ల రద్దు నేపథ్యంలో పాత కరెన్సీ మార్పిడి బృహత్ బాధ్యత బ్యాంకు సిబ్బందిపై పడింది. దీంతో కరెన్సీని మార్చేందుకు బ్యాంకుల సిబ్బంది నిరంతరం పనిచేస్తున్నారు. కనీసం వారాంతపు సెలవులు తీసుకోకుండా బ్యాంకుల సిబ్బంది సేవలు అందిస్తున్న సంగతి తెలిసిందే. అయినా బ్యాంకుల ముందు ప్రజల క్యూలు తగ్గడం లేదు. ప్రజల కష్టాలు ఏమాత్రం తీరడం లేదు.
మరోవైపు బ్యాంకు సిబ్బంది నిరంతరం పనిచేయడం వల్ల బ్యాంకుల సిబ్బంది కూడా ఒత్తిడి ఎదుర్కొంటున్నట్టు చెప్తున్నారు. ఈ నేపథ్యంలో మధ్యప్రదేశ్లో ఓ బ్యాంకు సిబ్బంది ప్రాణాలు విడిచాడు. భోపాల్లోని ఓ బ్యాంకులో ఆయన పనిచేస్తుండగా ఆరోగ్యం క్షీణించింది. వెంటనే ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆయన ప్రాణాలు విడిచాడు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.