Bank Employees Association
-
కస్టమర్లకు అలర్ట్: దేశవ్యాప్త సమ్మెకు దిగనున్న ఉద్యోగులు
న్యూఢిల్లీ: డిసెంబరు నెలలో దేశవ్యాప్త సమ్మెకు దేశంలోని పలు బ్యాంకులు సిద్ద మవు తున్నాయి. దీంతో బ్యాంకింగ్ సేవలపై ప్రభావం పడే అవకాశం ఉంది. డిసెంబరు 4 నుంచి 11 వరకు బ్యాంకు ఉద్యోగుల సమ్మె జరగనుంది. ఈ మేరకు అఖిల భారత బ్యాంకు ఉద్యోగుల సంఘం నోటిఫికేషన్ జారీ చేసింది. రెండు లక్షల ఉద్యోగాలను భర్తి , బ్యాంకుల్లో ఔట్ సోర్సింగ్ సిబ్బందికి స్వస్తి అనే ప్రధాన డిమాండ్లతో ఉద్యోగ సంఘాలు సమ్మెకు దిగనున్నాయి. ఆల్ ఇండియా బ్యాంక్ ఎంప్లాయీ అసోసియేషన్ (ఏఐబీఈఏ) నోటిఫికేషన్ ప్రకారం ప్రభుత్వ, ప్రైవేట్ రంగ పలు బ్యాంకులు సమ్మెలో భాగం కానున్నాయి. డిసెంబర్ 4 -11 వరకు బ్యాంకుల వారీగా సమ్మె కొనసాగుతుంది. బ్యాంకుల్లో తగినంత శాశ్వత సిబ్బందిఉండేలా చర్యలు తీసుకోవాలని ఉద్యోగ సంఘాలు కోరుతున్నాయి. బ్యాంకు ఉద్యోగాల అవుట్సోర్సింగ్ వల్ల దిగువ స్థాయిలో రిక్రూట్‌మెంట్‌ను తగ్గించడమే కాకుండా కస్టమర్ల గోప్యత , వారి డబ్బు ప్రమాదంలో పడే అవకాశం ఉందని ఏఐబీఈఏ ప్రధాన కార్యదర్శి సీహెచ్ వెంకటాచలం పేర్కొన్నారు. సమ్మెలో పాల్గొనే బ్యాంకుల వివరాలను ఆయన ట్విటర్లో షేర్ చేశారు. డిసెంబరు 4న ఎస్బీఐ, పీఎన్బీ, పంజాబ్ అండ్ సింధ్ బ్యాంక్ సమ్మె చేయనున్నాయి. అలాగే డిసెంబరు 5న బ్యాంక్ ఆఫ్ ఇండియా, బ్యాంక్ ఆఫ్ బరోడా, డిసెంబరు 6న సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, కెనరా బ్యాంక్ ఉద్యోగులు సమ్మెను పాటిస్తారు.అలాగే డిసెంబరు 7న యూకో బ్యాంక్, ఇండియన్ బ్యాంక్, డిసెంబరు 8న యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర, డిసెంబరు 11న ప్రైవేటు బ్యాంకుల ఉద్యోగులు సమ్మెకు దిగనున్నారు. #BankStrike#2lakhbankjobs #bankrecruitment #AIBEA pic.twitter.com/YkbNeE87kK — CH VENKATACHALAM (@ChVenkatachalam) November 14, 2023 -
జెట్‌ను ప్రభుత్వ అధీనంలోకి తీసుకోవాలి
ముంబై: నిధుల సంక్షోభంతో కార్యకలాపాలు నిలిచిపోయిన జెట్ ఎయిర్వేస్ను ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలని, 22,000 మంది ఉద్యోగుల భవిష్యత్తు దృష్ట్యా ఇది అవసరమని బ్యాంకు ఉద్యోగుల సంఘాలు ప్రధాని నరేంద్ర మోదీకి సూచించాయి. దెబ్బతిన్న విమానయాన సంస్థకు మరిన్ని నిధులిచ్చే దిశగా బ్యాంకులను ఒత్తిడి చేయకుండా ప్రభుత్వం భరోసా ఇవ్వాల్సిన అవసరం ఉందని ప్రధానికి రాసిన లేఖలో ఆల్ ఇండియా బ్యాంకు ఎంప్లాయీస్ అసోసియేషన్ (ఏఐబీఈఏ) పేర్కొంది. జెట్ కార్యకలాపాలపై దర్యాప్తు చేయాలని కోరింది. తాజాగా నిధులిచ్చేందుకు బ్యాంకులు నిరాకరించడంతో జెట్ ఎయిర్వేస్ తన కార్యకలాపాలను పూర్తిగా నిలిపివేస్తున్నట్టు బుధవారం ప్రకటించింది. ‘‘జెట్ ఎయిర్వేస్ కొనుగోలుకు బ్యాంకులు బిడ్లను ఆహ్వానించాయని తెలిసింది. ఒకవేళ ఇది సఫలం కాకపోతే జెట్ ఎయిర్వేస్ను మీరే స్వాధీనం చేసుకోవాలి. దాంతో 22,000 మంది ఉద్యోగాలు భద్రంగా ఉంటాయి’’ అని ఏఐబీఈఏ లేఖలో కోరింది. జెట్ ఎయిర్వేస్కు తాజా నిధుల సాయం చేయాలని బ్యాంకులపై ఒత్తిడి తీసుకురావడాన్ని కూడా వ్యతిరేకించింది. బ్యాంకులు యజమానులు కావడంతో ప్రతి ఒక్కరూ జెట్ బెయిలవుట్ కోసం వాటివైపే చూస్తున్నారని పేర్కొంది. ‘‘నరేష్ గోయల్ ఇప్పటికీ సంస్థ ప్రమోటర్‌గా 51 శాతం వాటా కలిగి ఉన్నారు. కంపెనీని నడిపించడమా లేక వేరొకరికి అమ్మేయడమా అన్నది అతని సమస్య’’ అని ఏఐబీఈఏ అభిప్రాయం వ్యక్తం చేసింది. ఈ సంక్షోభం మొత్తానికి సమాధానం చెప్పాల్సిన వ్యక్తి నరేష్ గోయల్ అని పేర్కొంది. ప్రభుత్వం వెంటనే జోక్యం చేసుకోవాలని డిమాండ్ చేసింది. -
బ్యాంకులకు ఇక 2,4 శనివారాలు సెలవు
సెప్టెంబర్ 1 నుంచి అమల్లోకి.. న్యూఢిల్లీ : లక్షల మంది బ్యాంకు ఉద్యోగులకు శుభవార్త! ప్రతి నెలా రెండు, నాలుగో శనివారాలు సెలవు దినాలుగా ప్రకటించాలన్న ఉద్యోగుల దీర్ఘకాల డిమాండ్‌కు కేంద్రం ఆమోదముద్ర వేసింది. సెప్టెంబర్ 1 నుంచి ఇది అమల్లోకి వస్తుంది. ఇందుకు సంబంధించి కేంద్రం నోటిఫికేషన్ విడుదల చేసింది. కేంద్రం నిర్ణయాన్ని స్వాగతిస్తున్నట్లు ఆలిండియా బ్యాంక్ ఎంప్లాయీస్ అసోసియేషన్ (ఏఐబీఈఏ) జనరల్ సెక్రటరీ సీహెచ్ వెంకటాచలం తెలిపారు. దీంతో ఇకపై ప్రతి రెండో, నాలుగో శనివారాలు బ్యాంకులకు సెలవు దినాలుగా ఉంటాయని పేర్కొన్నారు. ఉద్యోగుల పనితీరును మరింతగా మెరుగుపర్చేందుకు ప్రభుత్వ నిర్ణయం ఉపయోగపడగలదని తెలిపారు. ప్రస్తుతం అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ రంగ బ్యాంకులకు శనివారాలు సగం పనిదినాలుగా ఉంటున్నాయి.