Bank Note Press
-
నోట్ల తయారీపై ఆర్బీఐ గవర్నర్ కీలక వ్యాఖ్యలు
ముంబై: నోట్ల తయారీలో సమీప కాలంలో భారత్ 100 శాతం స్వయం సమృద్ధిని సాధించాలని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) గవర్నర్ శక్తికాంత దాస్ ఉద్ఘాటించారు. మైసూరులో భారతీయ రిజర్వ్ బ్యాంక్ నోట్ ముద్రణ్ ప్రైవేట్ లిమిటెడ్ (బీఆర్బీఎన్ఎంపీఎల్) ఏర్పాటు చేసిన ఇంక్ తయారీ యూనిట్– ‘వర్ణిక’ను జాతికి అంకితం చేసిన అనంతరం ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో గవర్నర్ మాట్లాడుతూ, ఈ యూనిట్‌తో నోట్ల తయారీ వ్యవస్థలో భారత్ గణనీయమైన పురోగతి సాధించినట్లైందన్నారు. దిగుమతులపై ఆధారపడాల్సిన పరిస్థితి గణనీయంగా తగ్గనుందని తెలిపారు. సమీప భవిష్యత్తులో నోట్ల తయారీలో 100 శాతం స్వయం సమృద్ధిని సాధించేందుకు నిరంతర (సుశిక్షత మానవ వనరులు, ప్రక్రియ, సాంకేతికత, సామర్థ్యం పరంగా) పరిశోధన, అభివృద్ధి, ఆవిష్కరణల అవసరం ఎంతో ఉందని పిలుపునిచ్చారు. ఎల్డీసీకి శంకుస్థాపన... కాగా, బీఆర్బీఎన్ఎంపీఎల్ లెర్నింగ్ అండ్ డెవలప్మెంట్ సెంటర్ (ఎల్డీసీ)కు కూడా గవర్నర్ శక్తికాంత దాస్ శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో గవర్నర్ మాట్లాడుతూ, దేశంలోని కరెన్సీ ఉత్పత్తి, ఈ విభాగంలో మానవ వనరుల సామర్థ్యాన్ని పెంపొందించడానికి ఎల్డీసీ ఏర్పాటు ఎంతో కీలకమవుతుందని అన్నారు. ఈ కేంద్రం గ్లోబల్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌గా ఆవిర్భవించనుందని కూడా తెలిపారు. వర్ణిక ప్రత్యేకతలు... ఆర్బీఐ నియంత్రణలోని బీఆర్బీఎన్ఎంపీఎల్ నోట్ల భద్రతను మెరుగుపరచడానికి ఉద్దేశించి వర్ణికాను ఏర్పాటు చేసింది. ఈ యూనిట్ వార్షిక ఇంక్ తయారీ సామర్థ్యం 1,500 మెట్రిక్ టన్నులు. కలర్ షిఫ్ట్ ఇంటాగ్లియో ఇంక్ (సీఎస్ఐఐ)ని కూడా వర్ణిక తయారు చేస్తుంది. భారతదేశంలోని బ్యాంక్ నోట్ ప్రింటింగ్ ప్రెస్‌ల పూర్తి అవసరాలను తీరుస్తుంది. దీని ఫలితంగా బ్యాంక్ నోట్ ఇంక్ ఉత్పత్తిలో వ్యయాలు తగ్గుతాయి. సామర్థ్యం మెరుగుపడుతుంది. తద్వారా ఈ విషయంలో దేశం ఎంతో స్వయం సమృద్ధి సాధించినట్లయ్యింది. ఈ యూనిట్ ఏర్పాటు ‘మేక్ ఇన్ ఇండియా’ చొరవకు ఊతమిస్తోందని, నోట్ల ప్రింటింగ్ ఇంక్‌ను అవసరమైన పరిమాణంలో దేశీయంగానే ఉత్పత్తి చేయడానికి ఈ యూనిట్ ఊతం ఇస్తుందని ఆర్బీఐ ఒక ప్రకటనలో తెలిపింది. -
ఉద్యోగాలే.. ఉద్యోగాలు
సీఏఎఫ్ఆర్ఏఎల్లో రీసెర్చ్ అసోసియేట్లు సెంటర్ ఫర్ అడ్వాన్స్డ్ ఫైనాన్షియల్ రీసెర్చ్ అండ్ లెర్నింగ్ (సీఏఎఫ్ఆర్ఏఎల్).. రీసెర్చ్ అసోసియేట్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. ఖాళీలు 5. ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేది జనవరి 7. వివరాలకు www.cafral.org.in చూడొచ్చు. ఎయిర్ ఇండియాలో మెడికల్ ఆఫీసర్లు ఎయిర్ ఇండియా లిమిటెడ్.. కాంట్రాక్ట్ పద్ధతిలో మెడికల్ ఆఫీసర్స్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. ఖాళీలు 3. దరఖాస్తులకు చివరి తేది జనవరి 8. వివరాలకు www.airindia.inచూడొచ్చు. మిజోరాం యూనివర్సిటీలో ఫ్యాకల్టీ మిజోరాం యూనివర్సిటీ.. ప్రొఫెసర్ (ఖాళీలు-11), అసోసియేట్ ప్రొఫెసర్ (ఖాళీలు-14), అసిస్టెంట్ ప్రొఫెసర్ (ఖాళీలు-8) పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. దరఖాస్తుకు చివరి తేది ఫిబ్రవరి 1. వివరాలకు www.mzu. edu.inచూడొచ్చు. ఆర్వీఎస్కేవీవీలో ఫ్యాకల్టీ రాజమాత విజయ రాజే సింధియా కృషి విశ్వ విద్యాలయ.. ప్రొఫెసర్ (ఖాళీలు-12), అసోసియేట్ ప్రొఫెసర్ (ఖాళీలు-11), అసిస్టెంట్ ప్రొఫెసర్ (ఖాళీలు-11) పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. దరఖాస్తులకు చివరి తేది ఫిబ్రవరి 1. వివరాలకు http://rvskvv.ne్ట చూడొచ్చు. ఐఐటీ-ఖరగ్‌పూర్‌లో జూనియర్ ప్రాజెక్ట్ అసిస్టెంట్లు ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ)-ఖరగ్‌పూర్.. జూనియర్ ప్రాజెక్ట్ అసిస్టెంట్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. దరఖాస్తులకు చివరి తేది జనవరి 22. వివరాలకు ఠీww.iitkgp.ac.in చూడొచ్చు. గెయిల్ (ఇండియా) లిమిటెడ్‌లో ఎగ్జిక్యూటివ్ ట్రైనీలు గెయిల్ (ఇండియా) లిమిటెడ్.. గేట్ -2016 స్కోర్ ద్వారా కెమికల్ (ఖాళీలు-14), మెకానికల్ (ఖాళీలు-13), ఎలక్ట్రికల్ (ఖాళీలు-13), ఇన్స్ట్రుమెం టేషన్ (ఖాళీలు-6), బిజినెస్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ (ఖాళీలు-11), టెలికాం/ టెలిమెట్రీ (ఖాళీలు-10) విభాగాల్లో ఎగ్జిక్యూటివ్ ట్రైనీ పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేది జనవరి 29. వివరాలకు http://gailonline.comచూడొచ్చు. బ్యాంక్ నోట్ ప్రెస్‌లో సూపర్వైజర్లు బ్యాంక్ నోట్ ప్రెస్.. వివిధ విభాగాల్లో సూపర్వైజర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. ఖాళీలు 41. ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేది జనవరి 14. వివరాలకు http://bnpdewas.spmcil.com చూడొచ్చు.