bank transfers
-
ఢిల్లీ హత్యోదంతం.. ఆ ఒక్క అబద్దమే అతడ్ని పట్టించింది..
సాక్షి,న్యూఢిల్లీ: ప్రియుడే ప్రేయసిని ముక్కముక్కలుగా చేసిన ఢిల్లీ మెహ్రౌలీ ఘటన దేశవ్యాప్తంగా సంచలనం రేపిన విషయం తెలిసిందే. హత్య జరిగిన దాదాపు ఆరు నెలల అనంతరం నిందితుడు అఫ్తాబ్ ఆమిన్ పూనావాలను పోలీసులు శనివారం అరెస్టు చేశారు. అయితే ఈ కేసు విచారణ ఎలా జరిగింది? ఒక్క అబద్ద అఫ్తాబ్‌ను ఎలా పట్టించిందనే విషయాలను పోలీసులు తెలిపారు. ఆ వివరాల ప్రకారం.. ► ప్రేయసి శ్రద్ధా వాకర్‌ను దారుణంగా హత్య చేసిన అనంతరం తనపై అనుమానం రాకుండా.. ఆమె ఇన్స్టాగ్రాం అకౌంట్ ఓపెన్ చేసి ఫ్రెండ్స్‌తో ఇఫ్తాబ్ చాట్ చేసేవాడని పోలీసులు తెలిపారు. ఇలా చేస్తే శ్రద్ధ చనిపోయిందని ఆమె స్నేహితులకు అనుమానం రాదని అతను భావించాడని చెప్పారు. అంతేకాదు మొబైల్ యాప్‌లో ఆమె బ్యాంకు ఖాతా నుంచి లావాదేవీలు కూడా చేశాడని వివరించారు. ► శ్రద్ధ కన్పించడం లేదని ఆమె తండ్రి ముంబై వాసాయ్ పోలీస్ స్టేషన్లో గతనెలలో ఫిర్యాదు చేశారు. అక్టోబర్ 26న పోలీసులు అఫ్తాబ్‌ను విచారణకు పిలిచారు. అయితే శ్రద్ధ మే 22నే ఢిల్లీ మెహ్రౌలిలో తాము నివసించే ఫ్లాట్ నుంచి వెళ్లిపోయిందని అఫ్తాబ్ చెప్పాడు. ఇద్దరి మధ్య గొడవ జరిగాక తనను వదిలేసిందని పేర్కొన్నాడు. దుస్తులు, ఇతర వస్తువులు ఫ్లాట్‌లోనే ఉంచి మొబైల్ మాత్రమే తనతో పాటు తీసుకెళ్లిందని నమ్మబలికాడు. ఆ తర్వాత మళ్లీ తనను ఆమె కలవలేదన్నాడు. కానీ వాస్తవానికి నాలుగు రోజుల ముందే(మే 18) ఆమెను అతను హత్య చేశాడు. అప్పటికి ఇద్దరూ ఢిల్లీ మెహ్రౌలీ ఫ్లాట్‌కు మారి రెండు వారాలే అయింది. ► అయితే అఫ్తాబ్‌ను విచారించిన అనంతరం పోలీసులు శ్రద్ధ మొబైల్ యాక్టివిటీని ట్రాక్ చేశారు. మే 22-26 మధ్య ఆమె ఫోన్ లొకేషన్ ఢిల్లీ మెహ్రౌలీలోనే ఉన్నట్లు తేలింది. అంతేకాదు శ్రద్ధ ఖాతా నుంచి అఫ్తాబ్‌కు రూ.54వేలు ట్రాన్స్ఫర్ అయ్యాయి. ► దీంతో పోలీసులకు అఫ్తాబ్‌పై మరోసారి అనుమానం వచ్చింది. వెంటనే అతడ్ని మళ్లీ విచారణకు పిలిచారు. బ్యాంకు లావాదేవీలపై ప్రశ్నించారు. అయితే ఆమె క్రెడిట్ కార్డు బిల్లులు కూడా తానే కడతానని, ఆమె పాస్వర్డ్లు, ఖాతా వివరాలు తనకు తెలుసునని అఫ్తాబ్ విచారణలో చెప్పాడు. తానే యాప్ ద్వారా శ్రద్ధ ఖాతా నుంచి తన ఖాతాలోకి డబ్బు పంపించుకున్నట్లు వివరించాడు. ► అనంతరం పోలీసులు శ్రద్ధ ఇన్స్టాగ్రాం చాట్‌ను పరిశీలించారు. అందులో మే 31 ఆమె ఓ ఫ్రెండ్‌తో చాట్ చేసింది. అప్పుడు కూడా ఫోన్ లొకేషన్ ఢిల్లీ మొహ్రౌలీలోనే ఉన్నట్లు చూపించింది. దీంతో వాసాయ్ పోలీసులు ఢిల్లీ పోలీసులను సంప్రదించారు. వెంటనే ఢిల్లీ పోలీసులు అఫ్తాబ్‌ను అదుపులోకి తీసుకుని విచారించారు. మే 22నే వెళ్లిపోయిన ఆమె ఫోన్ లొకేషన్ మే 31న కూడా ఢిల్లీ మెహ్రౌలీలోనే ఎలా ఉందని ప్రశ్నించారు. ► అప్పుడు అసలు విషయాన్ని పోలీసులకు వెల్లడించాడు అఫ్తాబ్. తానే శ్రద్ధను హతమార్చి 35 ముక్కలు చేసి ఫ్రిజ్‌లో పెట్టినట్లు భయానక నిజాన్ని చెప్పాడు. ఒక్కో పార్ట్‌ను ఒక్కోరోజు తీసుకెళ్లి సమీపంలోని అడవిలో పడేసినట్లు వివరించాడు. ► శ్రద్ధ తల్లిదండ్రులకు ఆమె ప్రేమ వ్యవహారం తెలిసినప్పటి నుంచి ఆగ్రహంతో ఆమెకు దూరంగా ఉన్నారు. ఎక్కడుంది? ఎలా ఉంది? అనే బాగోగులు పట్టించుకోలేదు. అయితే గత నెలలో ఆమె స్నేహితులకు కూడా శ్రద్ధ టచ్‌లో లేదని తెలిసిన వెంటనే పోలీసులను ఆశ్రయించారు. అప్పుడే అసలు విషయం వెలుగుచూసింది. ► శ్రద్ధ, అఫ్తాబ్ ఇద్దరూ ముంబై వాసాయ్ ప్రాంతానికి చెందినవారే. 2019లో డేటింగ్ యాప్‌లో పరిచయమైన వీరిద్దరూ సహజీవనం చేస్తున్నారు. ఈ ఏదాది మే లోనే ఢిల్లీకి మకాం మార్చారు. అయితే పెళ్లి విషయంలో ఇద్దరి మధ్య గొడవలు జరగడంతో అఫ్తాబ్ ఆమెను దారుణంగా హత్య చేశాడు. అనంతరం శరీరాన్ని ముక్కలుముక్కలుగా చేసి ఫ్రిజ్‌లో దాచాడు. ఈ సమయంలో వేరే అమ్మాయిలను కూడా ఫ్లాట్‌కు పిలిచి డేటింగ్ చేశాడు. చదవండి: శ్రద్ధా హత్య కేసులో ట్విస్ట్.. ప్రియురాలి శవాన్ని ఫ్రిజ్‌లో ఉంచి.. మరో యువతితో.. -
ఎన్ఆర్ఐలకు ఈడీ నోటీసులు
ముంబై : ఎన్ఆర్ఐలకు చెందిన బ్యాంకు అకౌంట్లు, విదేశీ చెల్లింపులపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ దృష్టిసారించింది. గత మూడు నెలల్లో 50 మంది ఎన్ఆర్ఐలకు ఈడీ నోటీసులు పంపింది. ఈ నోటీసుల్లో వారికి మనీ ఎక్కడి నుంచి వచ్చాయి? రెమిటెన్స్ మూలం ఏమిటి? వంటి ప్రశ్నలు సంధిస్తూ.. తమ ముందుకు వచ్చి వీటికి వివరణ ఇవ్వాలని ఎన్ఆర్ఐలను ఈడీ అధికారులు ఆదేశించారు. నోటీసులు అందిన వారిలో చాలామంది చాలా ఏళ్ల క్రితం విదేశాల్లో స్థిరపడిన వారే ఉన్నారు. వారు ప్రాపర్టీలు, ఫిక్స్డ్ డిపాజిట్లు, స్టాక్స్, ఇతర ఆస్తుల్లో పెట్టుబడులు పెట్టారు. ఈ పెట్టుబడులను ఎప్పడికప్పుడూ విక్రయిస్తూ.. ఆ నగదును విదేశాల్లో తమ బ్యాంకు అకౌంట్లకు బదలాయించుకున్నారు. కానీ అన్ని నగదు ట్రాన్స్ఫర్లు చట్టబద్ధంగా జరుగలేదని అధికారులు చెప్పారు. చాలా కేసుల్లో నగదు ఎక్కడి నుంచి వచ్చిందో తెలియలేదని, కొన్ని లావాదేవీలు అనుమానపూరితంగా ఉన్నాయని పేర్కొన్నారు. అనుమతి ఇచ్చిన మొత్తం కంటే ఎక్కువగా రెమిట్ అయిందని తెలిపారు. ఈ లావాదేవీలపై ఫైనాన్సియల్ ఇంటెలిజెన్స్ యూనిట్ నుంచి అలర్ట్‌లు పొందామని అధికారులు చెప్పారు. భారత్‌లో ఫండ్స్‌ను నిర్వహించడానికి ఎన్ఆర్ఐలు మూడు నుంచి నాలుగు రకాల అకౌంట్లను కలిగి ఉంటున్నారని, దీనిలో నాన్-రెసిడెంట్ ఆర్డినరీ(ఎన్ఆర్ఓ) సేవింగ్స్ అకౌంట్ కూడా ఒకటిని పేర్కొన్నారు. ఇది ఒక్క రూపాయికి చెందిందని, వడ్డీలు, స్టాక్ గెయిన్స్, డివిడెంట్లు, ప్రాపర్టీ సేల్స్ వంటి వాటి నుంచి ఆదాయాలు పొందుతుందని చెప్పారు. ఒక ఆర్థిక సంవత్సరంలో ఒక ఎన్ఆర్ఐ అకౌంట్ ద్వారా గరిష్టంగా 10 లక్షల డాలర్లను విదేశీలకు రెమిట్ చేయొచ్చని తెలిపారు. అదీ కూడా అకౌంట్ హోల్డర్ లేదా ఛార్టెడ్ అకౌంటెంట్ సంతకంతోనే సాధ్యమవుతుందని ఈడీ అధికారులు చెప్పారు. ఎన్ఆర్ఈ(నాన్ రెసిడెంట్ ఎక్స్టర్నల్ రూపాయి అకౌంట్) ద్వారా కూడా నగదును పంపించుకోవచ్చు. కానీ కొంతమంది వ్యక్తులు ఎన్ఆర్ఓ అకౌంట్ల నుంచి ఎన్ఆర్ఈ అకౌంట్లకు నగదును పంపించుకుంటున్నారని, వీరి కూడా ప్రశ్నలు ఎదుర్కోబోతున్నట్టు ఓ సీనియర్ ఛార్టెడ్ అకౌంటెంట్ చెప్పారు. మోసపూరిత లావాదేవీ లేదా సెక్యురిటీ డాక్యుమెంట్ల నుంచి నగదు ఎన్ఆర్ఓ అకౌంట్లోకి వస్తే, దాన్ని నిబంధనలు ఉల్లంఘనగా భావిస్తామని చెప్పారు. ఇలా పలు లావాదేవీలను ఈడీ అధికారులు గుర్తించారు. -
నగదు పంపాలంటే.. ఎక్కువ చెల్లించాల్సిందే!
అబుదాబి : పొట్టకూటి కోసం విదేశాలకు వెళ్లి నాలుగురాళ్లు సంపాదించుకుంటున్న వారికి ఎక్స్చేంజ్ ఏజెన్సీలు షాకిస్తున్నాయి. యూఏఈలో నివసిస్తున్న వారు సంపాదించిన నగదును తమ స్వదేశాలకు పంపుకోవడం తలకుమించిన భారంగా మార్చుతున్నాయి. ఈ వారంలో ఎక్స్చేంజ్ ఏజెన్సీలు రెమిటెన్స్ లపై వసూలు చేసే ఛార్జీలను పెంచినట్టు ప్రకటించాయి. ఏప్రిల్ 15 నుంచి బ్యాంకు ట్రాన్స్ఫర్లకు 2 దిర్హామ్‌ల (35.12 రూపాయల) వరకు వసూలు చేస్తున్నట్టు పేర్కొన్నాయి. అదేవిధంగా కొన్ని ఎక్స్చేంజ్లపై విధించే కూడా ఫీజులను ఏప్రిల్ మొదటివారం నుంచి పెంచినట్టు తెలిపాయి. ఒకవేళ బ్యాంకు ట్రాన్స్ఫర్లు 1000 దిర్హామ్‌లు (సుమారు17,561 రూపాయలు) దాటితే, కస్టమర్లు 22 దిర్హామ్‌ల (386 రూపాయలను)ను చెల్లించాల్సి ఉంటుందని మేజర్ ఎక్స్చేంజ్ ఏజెన్సీలు ప్రకటించాయి. అంతకముందు ఈ రేటు 20 దిర్హామ్‌లు (351రూపాయలు)గానే ఉండేది. ఒక్కో లావాదేవీపై వేసే సర్వీసు ఛార్జీల రేట్లను కూడా పెంచినట్టు ఆ ఏజెన్సీలు తెలిపాయి. ఛార్జీలను పెంచిన అతిపెద్ద ఎక్స్చేంజ్ ఏజెన్సీలన్నీ, ఫారిన్ ఎక్స్చేంజ్ అండ్ రెమిటెన్స్ గ్రూప్ (ఎఫ్ఈఆర్జీ) లో సభ్యులు. ఇది యూఏఈలోని మనీ ఎక్స్చేంజ్ ఏజెన్సీలకు అధికారిక ప్లాట్‌ఫామ్. అయితే ఈ నిర్ణయం తమది కాదని ఎఫ్ఈఆర్జీ చైర్మన్ మహ్మద్ అల్ అన్సారీ చెప్పారు. సల్వంగా ఛార్జీలు పెంచుకోమనే సూచించామని, వాటిపై తుది నిర్ణయం సభ్యులే తీసుకున్నట్టు పేర్కొన్నారు.