Banks interest reates
-
బ్యాంకులకు దండిగా వడ్డీ ఆదాయం
ముంబై: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం డిసెంబర్‌తో ముగిసిన మూడో త్రైమాసికంలో బ్యాంకుల వడ్డీ ఆదాయం గణనీయంగా వృద్ధి చెందింది. 25.5 శాతం పెరిగి రూ.1.78 లక్షల కోట్లుగా నమోదైంది. ఇచ్చిన రుణాలపై అధిక మార్జిన్, అధికంగా రుణాల వితరణ దీనికి కలిసొచ్చింది. నికర వడ్డీ మార్జిన్ (నిమ్) 0.17 శాతం పెరిగి 3.28 శాతానికి చేరింది. ప్రస్తుత రుణాలపై రేట్లను పెంచడంతోపాటు, కొత్తగా ఇచ్చే రుణాలపైనా రేట్లు పెంచడం, డిపాజిట్ రేట్లను పెద్దగా మార్చకుండా అదే స్థాయిలో కొనసాగించడం వడ్డీ ఆదాయం వృద్ధికి సానుకూలించినట్టు కేర్ రేటింగ్స్ తెలిపింది. బ్యాంకుల ఆదాయంపై ఈ సంస్థ ఓ అధ్యయన నివేదికను విడుదల చేసింది. నిమ్ వృద్ధిలో ప్రైవేటు బ్యాంకుల పాత్ర ఎక్కువగా ఉంది. మెరుగైన నిర్వహణ సామర్థ్యాల వల్ల ప్రైవేటు బ్యాంకుల నిమ్ 0.15 శాతం పెరిగి 4.03 శాతానికి చేరుకుంది. ప్రభుత్వరంగ బ్యాంకుల నిమ్ 0.17 శాతం వృద్ధితో 2.85 శాతంగా ఉంది. బ్యాంకులు సమీకరించిన డిపాజిట్లు/నిధులపై చెల్లించే రేటుకు, ఈ నిధులను రుణాలుగా ఇచ్చి వసూలు చేసే వడ్డీ రేటుకు మధ్య వ్యత్యాసమే నికర వడ్డీ మార్జిన్. పెద్ద బ్యాంకులు డిపాజిట్లపై అధిక రాబడులను ఆఫర్ చేయడం ఆరంభించాయని, రుణాలకు రెండంకెల స్థాయిలో డిమాండ్ ఉండగా, అదే స్థాయిలో డిపాజిట్లు రావడం లేదని క్రిసిల్ నివేదిక తెలిపింది. కనుక నిమ్ ఈ స్థాయిలో స్థిరపడొచ్చని అంచనా వేసింది. ఆర్బీఐ గతేడాది మే నుంచి 2.5 శాతం మేర పెరో రేటును పెంచడం తెలిసిందే. రుణాల్లో చక్కని వృద్ధి డిసెంబర్ క్వార్టర్లో బ్యాంకులు రుణాల్లో 18.5 శాతం వృద్ధిని నమోదు చేశాయి. రుణ వితరణలో ప్రభుత్వరంగ బ్యాంకులది పైచేయిగా ఉంది. ప్రభుత్వరంగ బ్యాంకులు 18.9 శాతం అధికంగా రుణాలను మంజూరు చేయగా, ప్రైవేటు రంగ బ్యాంకుల రుణ వితరణలో 17.9 శాతం వృద్ధిని చూపించాయి. నికర వడ్డీ మార్జిన్లో మాత్రం ప్రభుత్వరంగ బ్యాంకుల కంటే ప్రైవేటు బ్యాంకుల పనితీరు మెరుగ్గా ఉంది. వడ్డీ వ్యయాలు ప్రైవేటు రంగ బ్యాంకులకు 27.3 శాతానికి పెరిగితే, ప్రభుత్వరంగ బ్యాంకులకు 22.6 శాతానికి చేరాయి. సగటు రుణ రేటు 1.2 శాతం పెరిగి 8.9 శాతంగా ఉంది. డిపాజిట్ల కోసం బ్యాంకుల మధ్య పోటీ ఉండడం, ఆర్బీఐ వడ్డీ రేట్ల పెంపు నేపథ్యంలో రానున్న రోజుల్లో డిపాజిట్ రేట్లు పెరుగుతాయని అంచనా వేసింది. 12 ప్రభుత్వరంగ, 18 ప్రైవేటు రంగ బ్యాంకుల గణాంకాల ఆధారంగా కేర్ రేటింగ్స్ ఈ వివరాలను రూపొందించింది. -
హౌసింగ్ లోన్, పోటీ పడి మరీ వడ్డీ రేట్లు తగ్గిస్తున్న బ్యాంకులు
ముంబై: పండుగల సీజన్ నేపథ్యంలో నెలకొనే గృహ రుణ డిమాండ్‌లో మెజారిటీ వాటా పొందడానికి పోటీ పడుతున్న బ్యాంకుల్లో తాజాగా ప్రైవేటు రంగంలోని హెచ్ఎస్బీసీ, యస్ బ్యాంక్ లు చేరాయి. కొన్ని ముఖ్యాంశాలు చూస్తే... వడ్డీ భారం ఎక్కువై ఇతర బ్యాంకుల నుంచి గృహ రుణం మార్చుకునే వారికి (బ్యాలెన్స్ ట్రాన్స్ఫర్) సంబంధించి వడ్డీరేటును 10 బేసిస్ పాయింట్లు తగ్గించి 6.45 శాతంగా అమలు చేస్తున్నట్లు హెచ్ఎస్బీసీ ప్రకటించింది. బ్యాంకింగ్ పరిశ్రమలోనే ఇది అతి తక్కువ గృహ రుణ వడ్డీరేటు. ► ఇక కొత్త రుణాల విషయంలో బ్యాంక్ 6.70 శాతం వడ్డీ ఆఫర్ ఇస్తోంది. ఇది ఎస్బీఐ, హెచ్‌డీఎఫ్‌సీలకు సమానం. ► డిసెంబర్ 31 వరకూ అమలవుతుందని, తాజా రుణాలపై ప్రాసెసింగ్ ఫీజు కూడా ఉండబోదని హెచ్ఎస్బీసీ పేర్కొంది. ► యస్ బ్యాంక్ కూడా 6.70 శాతానికి గృహ రుణాన్ని ఆఫర్ చేస్తున్నట్లు ప్రకటించింది. వేతనం పొందే మహిళలకు సంబంధించి ఈ ఆఫర్ 6.65 శాతంగా ఉంటుంది. ఇప్పటికే పలు బ్యాంకులు ఇలా... పండుగ సీజన్ డిమాండ్‌లో భారీ వాటా లక్ష్యంగా ఇప్పటికే ఎస్బీఐ, బ్యాంక్ ఆఫ్ బరోడా (బీఓబీ), పంజాబ్ నేషనల్ బ్యాంక్ (పీఎన్బీ), హౌసింగ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (హెచ్డీఎఫ్సీ) గృహ రుణ రేట్లను ఇటీవలే భారీగా తగ్గించిన సంగతి తెలిసిందే. అత్యధిక క్రెడిట్ స్కోర్ ఉంటే రుణ మొత్తంతో ఎటువంటి సంబంధం లేకుండా 6.70 శాతం నుంచి రుణ లభ్యత ఉంటుందని ఎస్బీఐ ఇప్పటికే ప్రకటించింది. ఇప్పటి వరకూ రూ.75 లక్షలు పైబడిన రుణాలనికి ఒక కస్టమర్ 7.15 శాతం వడ్డీ చెల్లించాల్సి ఉండేది. ఇక మరో ప్రభుత్వ రంగ బీఓబీ కూడా పండుగల సీజన్‌ను పురస్కరించుకుని గృహ రుణ రేటు 6.75 శాతం వద్ద ప్రారంభమవుతుందని ప్రకటించింది. ప్రభుత్వ రంగ పీఎన్బీ కూడా రూ.50 లక్షలు దాటిన గృహ రుణంపై అరశాతం (50 బేసిస్ పాయింట్లు) వడ్డీరేటు తగ్గించింది. దీనితో ఈ రేటు 6.60 శాతానికి దిగివచ్చింది. హెడ్‌డీఎఫ్‌సీ రుణ రేటును 6.7 శాతానికి తగ్గించింది. చదవండి: ఒక్క లోను పొందాలంటే వంద తిప్పలు.. అందుకే ‘నావి’ వచ్చింది -
పెట్టుబడుల్లో వైవిధ్యం ఎందుకంటే...
పెట్టుబడుల్లో ముఖ్యంగా దీర్ఘకాలిక దృష్టితో చేసే ఇన్వెస్ట్మెంట్ విషయంలో వైవిధ్యం చూపడం అనేది చాలా కీలకమైన విషయం. ఒకే రంగానికి చెందిన వాటిల్లో పెట్టుబడి పెట్టకుండా ఈ మొత్తాన్ని విభిన్న రంగాలకు మళ్లించడం ద్వారా సాధ్యమైనంత వరకు నష్టభయాన్ని తగ్గించుకోవడమే కాకుండా లాభాలను పెంచుకునే వెసులుబాటు కలుగుతుంది. పెట్టుబడుల్లో వైవిధ్యత చూపడం వల్ల నష్టాలు పూర్తిగా ఉండవని కాదు, కాని దీనివల్ల నష్టాలను తగ్గించుకోవచ్చు. పెట్టుబడుల్లో వైవిధ్యం ఎందుకు ఉండాలో ఇప్పుడు సోదాహరణంగా తెలుసుకుందాం. ఉదాహరణకు మీరు ఎయిర్‌లైన్స్ షేర్లలో మాత్రమే ఇన్వెస్ట్ చేశారనుకుందాం. ఒకరోజు హఠాత్తుగా పైలట్లు సమ్మెకి దిగితే ఎయిర్‌లైన్స్ షేర్లన్నీ కుప్పకూలుతాయి. అప్పుడు తీవ్ర నష్టాలు తప్పవు. అదే ఎయిర్‌లైన్స్‌తోపాటు రైల్వే వంటి ఇతర రవాణా రంగాల్లో కూడా ఇన్వెస్ట్ చేస్తూ వైవిధ్యత చూపిస్తే, ఈ నష్టం సాధ్యమైనంత వరకు తగ్గిపోతుంది. ఎందుకంటారా.. పైలట్ల సమ్మెతో విమానాలు నిలిచి పోతే ప్రత్యామ్నాయ రవాణా మార్గాలైన రైల్వేలను ప్రయాణికులు ఆశ్రయిస్తారు. దాంతో వాటి ఆదాయం పెరిగి ఆ షేర్లు పెరుగుతాయి. అప్పడు ఎయిర్‌లైన్స్ షేర్ల వల్ల వచ్చిన నష్టాలను రైల్వే షేర్లతో పూడ్చుకునే అవకాశం కలుగుతుంది. కాబట్టి పెట్టుబడులు పెట్టేడప్పుడు రిస్క్ సామర్థ్యం ఆధారంగా ఈక్విటీ, బులియన్, రియల్ ఎస్టేట్, డెట్ వంటి అన్ని పథకాలకూ విస్తరించాలి. ఇవి కాకుండా అసలు రిస్క్ లేని గవర్నమెంట్ సెక్యూరిటీలు, పోస్టాఫీసు, రికరింగ్ డిపాజిట్లు వంటి వాటిల్లో కూడా కొంతమేర కేటాయించే విధంగా చూసుకోండి. రిస్క్ తక్కువ ఉన్న సాధనాలకు ఎక్కువ కేటాయిస్తే ఆ మేరకు రాబడులు తగ్గుతాయి. దీర్ఘకాలంలో ఇన్వెస్ట్ చేసేటప్పుడు రిస్క్ ఎక్కువ ఉన్న పథకాలకు కేటాయిస్తూ వెవిధ్యం చూపించాలి. అప్పుడే రిటైర్మెంట్ వంటి దీర్ఘకాలిక లక్ష్యాలకు స్థిరమైన సంపదను సృష్టించుకునే వెసులుబాటు కలుగుతుంది.