barrows suffer
-
మరీ ఇంత దారుణమా.. అప్పు చెల్లించకపోతే ఇలా చేస్తారా?
భువనేశ్వర్: ఒడిశా కటక్ నగరంలో అమానవీయ ఘటన జరిగింది. అప్పు తిరిగి చెల్లించలేదనే కారణంతో ఓ యువకుడ్ని స్కూటర్‌కు కట్టేసి పరుగెత్తించింది ఓ గ్యాంగ్. అతని చేతులకు తాడు కట్టి నడిరోడ్డుపై చాలా దూరం లాక్కెల్లింది. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. #WatchVideo l Youth tied to scooter dragged along road in #Odisha pic.twitter.com/2idf9dAMrI — Prameya English (@PrameyaEnglish) October 17, 2022 వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు కేసు నమోదు చేసి ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. ఆదివారం రాత్రి ఈ ఘటన జరిగినట్లు వెల్లడించారు. యువకుడు తనకు తెలిసిన వాళ్ల దగ్గరే కొంతడబ్బు అప్పుగా తీసుకున్నాడని, కానీ వాళ్లు తిరిగి చెల్లించాలని ఎన్నిసార్లు అడిగినా అతను ఇవ్వకపోవడంతో ఇలా చేశారని తెలిపారు. ప్రాథమిక విచారణలో ఈ విషయం తెలిసిందని వివరించారు. ఇది చాలా సున్నితమైన కేసు అయినందున నిందితుల వివరాలు చెప్పేందుకు పోలీసులు నిరాకరించారు. విచారణ పూర్తయ్యక అన్ని వివరాలు వెల్లడిస్తామని స్పష్టం చేశారు. ఒడిశాలో ఇలాంటి ఘటనలు జరగడం కొత్తేం కాదు. గతంలోనూ ఓ వ్యక్తి మొబైల్ ఫోన్ దొంగిలించాడని అతడ్ని లారీ ముందుభాగంలో కట్టేసి, మెడలో చెప్పుల దండవేసి ఊరేగించారు. జగత్సింగ్పుర్ జిల్లాలో ఈ ఘటన జరిగింది. చదవండి: అత్యాచార కేసులో నిందితుడికి బెయిల్.. కానీ.. పెళ్లిపై షరతు! -
అప్పు తీర్చే దారి లేక..
చిన్నశంకరంపేట(మెదక్): అప్పులు తీర్చడానికి దుబాయ్ వెళ్లిన కొడుకు ఏజెంట్ చేతిలో మోసపోయి తిరిగి వస్తున్నాడని తెలిసిన రైతు ఆత్మహత్య చేసుకున్న విషాదకర ఘటన చిన్నశంకరంపేట మండలం సంగాయిపల్లిలో ఆదివారం చోటు చేసుకుంది. వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన రైతు గొల్ల సత్యనారాయణ తనకున్న ఎకరం భూమిలో సాగు చేస్తూ, కూలి పనులకు వెళ్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. తన ఇద్దరు బిడ్డల పెళ్లి కోసం రూ. 5 లక్షలు అప్పు చేశాడు. ఎదిగిన కుమారుడు నవీన్‌ను దుబాయ్ పంపి అక్కడ అతను సంపాదించిన డబ్బుతో అప్పులు తీర్చవచ్చని ఆశించాడు. మరో రూ. లక్ష అప్పు చేసి కొడుకును దుబాయ్ పంపించాడు. ఏజెంట్ చేతిలో మోస పోయిన కొడుకు ఇంటికి వస్తున్నానని ఫోన్ చేసి చెప్పాడు. దీంతో మనస్తాపానికి గురైన సత్యనారాయణ అప్పులు ఎలా తీర్చాలనే బెంగతో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. భార్య లక్ష్మి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ ప్రకాష్‌గౌడ్ తెలిపారు. -
అప్పు.. ఆయువు తీసింది!
బాలానగర్ (జడ్చర్ల): అప్పులబాధతో ఓ యువరైతు ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన మండల పరిధిలోని పెద్దాయపల్లి గ్రామ పంచాయతీ చెన్నంగులగడ్డతండాలో ఆదివారం ఉదయం చోటుచేసుకుంది. గ్రామస్తుల కథనం ప్రకారం... బాబునాయక్ (33) తన వ్యవసాయ పొలంలో నాలుగుబోర్లు వేసి అప్పులపాలయ్యాడు. అప్పు తీర్చే స్తోమత లేక భార్య లీలను ఆమె పుట్టింటికి పంపాడు. మూడురోజుల తర్వాత కూడా డబ్బు సర్దుబాటు కాలేదు. ఇదే విషయాన్ని ఆమె ఫోన్లో తెలిపింది. అప్పిచ్చిన వారికి ఏం సమాధానం చెప్పాలంటూ మదనపడిన బాబునాయక్ శనివారం రాత్రి తన ఇంట్లో చీరతో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఉదయం ఎంతకూ తలుపులు తీయకపోవడాన్ని తండ్రి హేమ్య నాయక్ గమనించాడు. ఎంత పిలిచినా పలకకపోవడంతో ఇరుగుపొరుగు వారితో కలిసి తలుపులు పగులగొట్టాడు. కొడుకు ఉరేసుకోవడాన్ని చూసి, పోలీసులకు, భార్యకు సమాచారం అందించారు. భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ శ్రీనివాస్ తెలిపారు. -
వేధింపులతో వ్యక్తి ఆత్మహత్యాయత్నం
విశాఖక్రైం: బలవంతపు వడ్డీలు కట్టలేక నగరంలోని రైల్వేన్యూకాలనీకి చెందిన సీహెచ్ రవికుమార్ ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. అయితే కుటుంబ సభ్యులు గమినించడంతో చికిత్స కోసం అతన్ని కేజీహెచ్‌కు తరలించారు. బాధితుడి కథనం మేరకు రైల్వేన్యూకాలనీకి చెందిన సీహెచ్ రవికుమార్ ఎల్ఐసీ ఏజెంట్‌గా పనిచేస్తున్నాడు. కాలనీలో భార్య, ఇద్దరు కుమార్తెలతో నివాసముంటున్నా డు. 2013లో గోపాలపట్నానికి చెందిన పోర్టు ఉద్యోగి మురళీ దివాకర్‌రెడ్డి, సిరిపురానికి చెం దిన శంకరరావుల వద్ద రూ.లక్ష అప్పుతీసుకున్నాడు.వారు వడ్డీ కోసం వేధించడంతో శనివారం రాత్రి నిద్రమాత్రలు మింగాడు. విషయాన్ని గమనించిన కుటుంబ సభ్యులు, స్థానికులు అతన్ని కేజీహెచ్‌కు తరలించారు. కేజీహెచ్‌లో చికిత్స పొందుతున్న రవికుమార్ మాట్లాడుతూ వడ్డీ వ్యాపారులు మురళీ దివాకర్‌రెడ్డి, శంకరరావులు తనను వేధిస్తున్నారని ‘సాక్షి’కి వివరించారు. వారి వద్ద 2013లో రూ. లక్ష అప్పుగా తీసుకోవడం జరిగిందన్నారు. అందుకు షూరిటీగా రూ.లక్ష చెక్కును వారికి అందజేసినట్లు వివరించారు. అనంతరం 2014లో రూ. లక్ష తిరిగి వారికి ఇవ్వడం జరిగిందన్నారు. అయితే దివాకర్‌రెడ్డి, శంకరరావులు మరో లక్షరూపాయాలు వడ్డీ అయ్యిందని చెప్పి చెక్కు తిరిగి ఇవ్వలేదని, దీంతో పాటు మరిన్ని డబ్బులు చెల్లించాలని బెదిరింపులకు దిగిరాని తెలిపారు. దీంతో పాటు తనకు తాళ్లవలసలో ఉన్న 80 గజాల స్థలాన్ని, అమ్మంచి డబ్బులు కాజేశారని రవికుమార్ వెల్లడించాడు. సింహాచలంలో ఉన్న 330 గజాల స్థలాన్ని రాయించుకున్నారని తెలిపాడు.అయినా ఇంకా డబ్బులు చెల్లించకపోతే చంపేస్తామని హెచ్చరిస్తున్నారని అతను ఆరోపించారు. వారి వేధింపులు భరించలేక శనివారం రాత్రి నిద్రమాత్రలు మింగినట్లు వెల్లడించారు. పోలీసులు చొరవతీసుకొని తనకు న్యాయం చెయ్యాలని రవికుమార్ కోరాడు. -
అప్పుల బాధతో రైతు ఆత్మహత్య
బహ్మసముద్రం (అనంతపురం): పంటలు దెబ్బతిని అప్పులు పెరిగిపోవడంతో అనంతపురం జిల్లా బ్రహ్మసముద్రం మండలం పాలవెంకటాపురం గ్రామానికి చెందిన రైతు శ్రీనివాసులు(32) మంగళవారం పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. శ్రీనివాసులుకు ఉన్న మూడు ఎకరాల్లో గత కొన్నేళ్లుగా టమాట పంట సాగు చేసి నష్టం చవిచూశాడు. సుమారు రూ. 5 లక్షల దాకా అప్పుల పాలయ్యాడు. అప్పులు ఎలా తీర్చాలనే ఆందోళనతో ఉదయం పొలానికి వెళ్లి పురుగుల మందు తాగాడు. ఎంతకూ ఇంటికి రాకపోయే సరికి భార్య అరుణ తోటకు వెళ్లి చూసేసరికి విషమ పరిస్థితుల్లో ఉన్నాడు. బంధువుల సాయంతో కళ్యాణదుర్గం అస్పత్రికి తరలిస్తుండగా మార్గ మధ్యంలో చనిపోయాడు.