bars owners
-
3 బార్లకు 3 దరఖాస్తులే.. ఆ 10 బార్ల పై ఆరా..?
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని కొత్త మున్సిపాలిటీల్లో బార్ల ఏర్పాటు కోసం ఎక్సైజ్ శాఖ చేపట్టిన దరఖాస్తుల స్వీకరణ కార్యక్రమం చర్చనీయాంశమవుతోంది. రాష్ట్రవ్యాప్తంగా అన్ని మున్సిపాలిటీల్లో వెల్లువలా దరఖాస్తులు వ చ్చినా కేవలం నిజామాబాద్ కార్పొరేషన్, బోధన్ మున్సిపాలిటీలో నోటిఫై చేసిన బార్లకు చాలా తక్కువ దరఖాస్తులు రావడం ఇప్పుడు ఎక్సైజ్ వర్గాల్లో హాట్‌టాపిక్‌గా మారింది. నిజామాబాద్ కార్పొరేషన్ పరిధిలో కొత్తగా 7 బార్లను నోటిఫై చేస్తే అక్కడ కేవలం 10 దరఖాస్తులే వచ్చాయి. ఇక బోధన్ మున్సిపాలిటీలో అయితే 3 బార్లకు గాను 3 దరఖాస్తులే వచ్చాయి. కానీ, రాష్ట్రంలోని ఇతర మున్సిపాలిటీల్లో మాత్రం వందల సంఖ్యలో దరఖాస్తులు వచ్చాయి. రాష్ట్రవ్యాప్తంగా 72 మున్సిపాలిటీల్లోని 159 కొత్త బార్లకు నోటిఫికేషన్ ఇస్తే 7,400 వరకు దరఖాస్తులు రావడం గమనార్హం. ఈ పరిస్థితుల్లో నిజామాబాద్, బోధన్‌లలో చాలా తక్కువగా ఎందుకు దరఖాస్తులు వచ్చాయన్న దానిపై ఎక్సైజ్ కమిషనర్ సర్ఫరాజ్ అహ్మద్ ఆ శాఖ ఉన్నతాధికారుల వద్ద ఆరా తీసినట్టు తెలిసింది. నిజామాబాద్‌లో 7 బార్లకు గాను చివరిరోజు వరకు ఒక్కటే దరఖాస్తు వచ్చిందని, చివరి రోజు కూడా 9 మాత్రమే ఎలా వచ్చాయని, అలాగే బోధన్‌లో అయితే మూడు బార్లకు చివరిరోజే మూడు దరఖాస్తులు రావడం ఎలా సాధ్యమైందని ఆయన అంతర్గతంగా పరిశీలన జరుపుతున్నట్టు సమాచారం. కాగా, ఇక్కడ తక్కువ దరఖాస్తులు రావడానికి సిండికేట్ కారణమైందని తెలుస్తోంది. ఇక రాష్ట్రవ్యాప్తంగా కొత్తగా నోటిఫై అయిన బార్లకు దరఖాస్తు చేసుకునే గడువును ఈ నెల 16 వరకు పొడిగించారు. ఇక ఈ నెల 19న లాటరీలు తీసి.. అందులో వచ్చిన వారికి 25వ తేదీన కేటాయిస్తారని ఎక్సైజ్ వర్గాలు వెల్లడించాయి. చదవండి: సముద్రం నీరూ తాగొచ్చు! -
టీనేజ్ చీర్... ఫుల్ బీర్
సాక్షి, సిటీబ్యూరో : నగరంలోని బార్లు, పబ్‌లలో టీనేజర్ల జోష్ పెరిగింది. కలర్ జిరాక్స్‌లతో ఫేక్ ఐడీలు సృష్టిస్తున్న వీరు... మధ్యాహ్నం బార్లు, రాత్రిళ్లు పబ్‌లలో ఎంజాయ్‌చేస్తున్నారు. ఇటీవల ఆబ్కారీ శాఖ కొన్ని పబ్లలోతనిఖీలు నిర్వహించగా... అక్కడ 60 శాతం టీనేజర్లే ఉన్నట్లు తేలింది. 21 ఏళ్లలోపు యువతీ యువకులకు మద్యం విక్రయించడం, సరఫరా చేయడం చట్టరీత్యా నేరం. దీంతో దాదాపు ఏడు పబ్‌లకు ఆబ్కారీ శాఖ నోటీసులు జారీ చేసినట్లు తెలిసింది. మరోవైపు వేసవిలో బీర్ల విక్రయాలు ఊపందుకున్నాయి. నిత్యం సుమారు 1.30 లక్షల లీటర్ల బీర్‌ను యూత్ తాగేస్తోంది. గత ఐదేళ్లతో పోలిస్తే ఈసారి 30వేల లీటర్లు అదనంగా పెరగడం గమనార్హం. యూత్ జోష్‌తో గ్రేటర్‌లోని బార్లు, పబ్‌లలో బీర్ల సేల్స్ ఊపందుకున్నాయి. ఫేక్ ఐడీలతో పగలు బార్లు.. రాత్రి పబ్‌లు.. పలువురు టీనేజ్ యువత పగలు బార్లు.. రాత్రిళ్లు పబ్‌లకు వెళుతూ ఫుల్లు జోష్‌లో మునిగితేలుతున్నట్లు ఆబ్కారీశాఖ పరిశీలనలో తేలింది. ప్రధానంగా 21 ఏళ్లలోపు యువత కొందరు నకిలీ ఐడీ కార్డులను సృష్టిస్తుండగా.. మరికొందరు ఇతరుల ఐడీకార్డులను కలర్జిరాక్స్ తీసి తమ వయస్సు 21 ఏళ్ల కన్నా అధికంగా ఉన్నట్లు చూపుతూ బార్లు, పబ్‌ల్లోకి ప్రవేశిస్తున్నట్లు స్పష్టమైంది. ఇక పలు బార్లు, పబ్‌ల యజమానులు ఈ ధ్రువపత్రాలను సైతం సరిగా పరిశీలించడం లేదని తేలడం గమనార్హం. 60 శాతం టీనేజర్స్.. బార్లు, పబ్‌లలోకి ప్రవేశిస్తున్న యువతరంలో 60 శాతం మంది టీనేజర్స్ ఉంటున్నట్లు తేలడం ఆందోళన కలిగించే అంశం. ప్రధానంగా టీనేజ్ యువత తమకు తల్లిదండ్రులు ఇచ్చే పాకెట్‌మనీతో బార్లు, పబ్‌లలో మిత్రులతో కలిసి జల్సా చేసేస్తున్నట్లు తేలింది. ఈ విషయంలో తల్లిదండ్రులు ప్రత్యేకంగా దృష్టిసారించాలని.. తమ పిల్లలు ఎటు వెళ్తున్నారు.. ఏమి చేస్తున్నారన్న అంశంపై నిఘా పెట్టాలని వ్యక్తిత్వవికాస నిపుణులు స్పష్టం చేస్తున్నారు. . ఏడు పబ్‌లకు నోటీసులు.. ఆబ్కారీశాఖ పరిశీలనలో ఇటీవల పలువురు టీనేజ్ యువత ఉన్నట్లు తేలడంతో నగరంలోని ఏడు పబ్‌లకు నోటీసులు జారీచేసినట్లు ఆబ్కారీశాఖ వర్గాలు తెలిపాయి. మరోసారి ఇదే తప్పిదం పునరావృతమైతే సదరు బారు లేదా పబ్‌ల లైసెన్సులు రద్దు చేస్తామని స్పష్టం చేశాయి. అనుమానం వచ్చిన ప్రతీ టీనేజర్‌ను బార్ లేదా పబ్‌లోకి ప్రవేశించకుండా నిరోధించాలని, ఈ విషయాన్ని అందరికీ స్పష్టంగా కనిపించేలా నోటీసుబోర్డుపై ప్రదర్శించాలని స్పష్టం చేశాయి. టీనేజర్స్‌కు మద్యం సరఫరా చేస్తున్న పబ్‌లు, బార్లపై ప్రత్యేకంగా దృష్టిసారించడంతోపాటు వరుస తనిఖీలు చేపట్టాలని నిర్ణయించాయి. అమ్మకాల్లో చీర్స్... మండుటెండల్లో గ్రేటర్లో బీర్ల సేల్స్ ఉప్పొంగుతున్నాయి. గత ఐదేళ్లుగా ఏప్రిల్, మే నెలల్లో ఎన్నడూ లేనివిధంగా నిత్యం 1.30 లక్షల లీటర్ల బీర్ల అమ్మకాలు జరిగినట్లు ఆబ్కారీశాఖ వర్గాలు అంచనా వేస్తున్నాయి. గతంలో ఈ మోతాదు లక్ష లీటర్లేనని తెలిపాయి. గ్రేటర్ పరిధిలో నిత్యం రూ.20 కోట్ల విలువైన మద్యం, బీర్ల అమ్మకాలు జరుగుతాయి. ఇటీవలి కాలంలో బీర్ల అమ్మకాలు పెరగడంతో మద్యం అమ్మకాల విలువ రోజుకు రూ.24 కోట్లకు చేరినట్లు అంచనా. అంటే నెలకు సుమారు రూ.720 కోట్ల మేర మద్యాన్ని గ్రేటర్లో మందుబాబులు స్వాహా చేసేస్తుండడం గమనార్హం. -
మందుబాబులకు చుక్కెదురు..
అమలాపురం టౌన్, రాజమహేంద్రవరం క్రైం:ట్రేడ్ మార్జిన్ పెంచాలని డిమాండ్ చేస్తూ జిల్లాలోని మద్యం దుకాణాల లైసెన్స్‌దారులు చేపట్టిన నిరసన రెండో రోజు బుధవారం మరింత ఉద్ధృతమైంది. తొలి రోజు జిల్లాలోని మూడు ప్రభుత్వ లిక్కర్ గోడౌన్ల నుంచి మద్యం కొనుగోళ్లు నిలిపేసి ఆ గోడౌన్ల వద్దే నిరసనలు తెలిపిన మద్యం వ్యాపారులు రెండో రోజు నుంచి తమ తమ మద్యం దుకాణాలు, బార్లు మూసివేసి బంద్ పాటిస్తున్నారు. దీంతో జిల్లాలో బుధవారం 530 మద్యం దుకాణాలు, 40 బార్లు మూతపడ్డాయి. మద్యం దుకాణాల లైసెన్సుదారుల నుంచి ఇంతటి స్థాయిలో, ఇన్ని రోజులు ఎక్సైజ్ శాఖకు నిరసనలు వెల్లువెత్తడం ఇదే ప్రథమం. ప్రభుత్వానికి మద్యం ప్రధాన ఆదాయ మార్గమైతే, వాటి అమ్మకాల కోసం లైసెన్సులు పొందిన తమ లాభాలు, ఆదాయాలను మాత్రం ప్రభుత్వం హరిస్తోందని ఆ వ్యాపారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దుకాణాలు, బార్లు తెరుచుకోక, మద్యం దొరకక జిల్లా అంతటా మద్యం దుకాణాలు, బార్ల వద్ద బంద్ బోర్డులు దర్శనమిస్తున్నాయి. రెండో రోజూ కూడా జిల్లాలో సుమారు రూ.20 కోట్ల మద్యం సరఫరాకు, దాదాపు రూ. ఆరు కోట్ల మద్యం అమ్మకాలకు అంతరాయం ఏర్పడింది. రాజమహేంద్రవరం, అమలాపురం, సామర్లకోటల్లో గల బేవరేజెస్ లిక్కర్ గోడౌన్ల కొనుగోళ్లు, బిల్లింగ్‌లు లేక పూర్తిగా మూతబడ్డాయి. మద్యం వ్యాపారులు తమ దుకాణాలను స్వచ్ఛందంగా మూసివేసి తమ డిమాండ్ల సాధన కోసం రోడ్డెక్కారు. రాజమహేంద్రవరంలో మద్యం వ్యాపారులు సంబంధిత ఎక్సైజ్ డివిజన్ కార్యాలయంలో ఈఎస్‌కు వినతి పత్రం అందజేసి నిరసన వ్యక్తం చేశారు. కాకినాడలో కలెక్టరేట్ వద్ద ఆందోళన కార్యక్రమాన్ని చేపట్టారు. నిరసన ప్రదర్శనలు నిర్వహించారు. అమలాపురంలో లిక్కర్ గోడౌన వద్ద వంటా వార్పు పెట్టి వినూత్న నిరసనకు తెర తీశారు. వ్యాపారులు అక్కడే వంటలు వండుకుని అక్కడే సామూహికంగా భోజనాలు చేసి నిరసన తెలిపారు. ఇలా జిల్లా అంతటా మద్యం దుకాణాల లైసెన్స్‌దారులు నిరసనలు హోరెత్తించారు. ఈనెల 31వ తేదీ వరకూ మద్యం దుకాణాలను మూసి వేసి బంద్ పాటించేందుకు వ్యాపారులు ఏర్పాట్లు చేసుకున్నారు. 31వ తేదీ వరకు రోజుకో తీరుతో నిరసనలను వినూత్నంగా నిర్వహించేందుకు జిల్లాలోని దాదాపు 600 మంది మద్యం లైసెన్సుదారులు రంగం సిద్ధం చేసుకుంటున్నారు. మరోవైపు జిల్లాలో బుధవారం మందు దొరకక కొందరు మందుబాబులు ఆందోళన చెందారు. నాలుగు రోజుల పాటు మద్యం దుకాణాలు తెరుచుకోవని తెలిసి కొందరు మందుబాబులు ముందుచూపుతో మంగళవారమే స్పందించారు. -
బార్లపై పోలీసుల దాడి.. 50 మంది అరెస్ట్
వరంగల్: నగరంలో నిబంధనలకు విరుద్ధంగా నడుపుతున్న బార్ అండ్ రెస్టారెంట్లపై పోలీసులు ఆకస్మిక దాడి నిర్వహించారు. ఉదయం 5 గంటలకే బార్లను తెరిచి నడిపిస్తున్న యజమానులపై కేసు నమోదు చేశారు. బార్లలో ఉన్న 50 మంది మద్యంప్రియులను, బార్ల యజమానులను అరెస్ట్ చేశారు. వారి నుంచి 100పైగా మద్యం బాటిళ్లు స్వాధీనం చేసుకున్నారు.